By: Harish | Updated at : 12 Jul 2022 05:09 PM (IST)
వరదలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం
మరి కొన్ని రోజులు ఏపీలో భారీగా వర్షాలు పడనున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎం జగన్... భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల్లో తాజా పరిస్థితి, తీసుకుంటున్న సహాయ చర్యలను గురించి అధికారులు సీఎంకు వివరించారు.
సీఎం జగన్ ఏమన్నారంటే.. గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయి. గడిచిన వందేళ్లలో ఇంత ముందుగా ఈ స్ధాయిలో వరద రాలేదు, సాధారణంగా ఆగష్టులో 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉంటుంది. అయితే తొలిసారిగా జులైలోనే 10 లక్షల క్యూసెక్కులకుపైన వరద వచ్చింది. ఇది జాగ్రత్త పడాల్సిన అంశం. ప్రస్తుతం ధవళేశ్వరంలో 13 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఇప్పడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోంది. బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. ఇది 15 నుంచి 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉంది. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి. మహారాష్ట్రలో భారీ వర్షాలతో గోదావరి నదికి వరదలు కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ కూడా మృత్యువాత పడకూడదు. అని అన్నారు.
కూనవరం, చింతూరుల్లో 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయి. వి.ఆర్.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయి లైన్ డిపార్ట్‌మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. కంట్రోల‌్ రూమ్స్ సమర్థవంతంగా పని చేయాలని ఆదేశించారు. 24 గంటలపాటు నిరంతరాయంగా కంట్రోల్ రూంలు పనిచేయాలన్నారు. అవసరమైనచోట వరద సహాయక శిబిరాలు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని వెంటనే శిబిరాలకు తరలించాలన్నారు. సహాయ శిబిరాల్లో మెరుగయిన ఏర్పాట్లు చేయాలన్నారు.
మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని జగన్ దిశానిర్దేశం చేశారు. బాధితుల పట్ల మానవతాదృక్ఫధంతో మెలగాలి ,శిబిరాల నుంచి వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రశంసించే విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. సహాయ శిబిరాల్లో నాణ్యమైన సేవలందించే క్రమంలో ఖర్చుకు వెనుకాడొద్దని పేర్కొన్నారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు వ్యక్తికి అయితే రూ.1000, ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు.
వైద్య సదుపాయాల విషయంలో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిత్యావసర సరుకులకు సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అవసరమైన సరకులు నిల్వ ఉంచేలా చూసుకోవాలన్నారు. పారిశుధ్యం బాగుండేలా చర్యలు తీసుకోవాలి, తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
కరెంటు సరఫరాకు అంతరాయం వచ్చినప్పుడు అత్యవసర సర్వీసులు నడిచేందుకు వీలుగా జనరేటర్లను అందుబాటులో ఉంచాలన్నారు సీఎం జగన్. తాగునీటి కోసం ట్యాంకర్లను సిద్ధంచేసుకోవాలి, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రతమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, ఇరిగేషన్ కాల్వలు.. ఎక్కడ బలహీనంగా ఉన్నాయో.. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సబ్‌స్టేషన్లు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోమన్నారు. బోట్లు, లైఫ్ జాకెట్లు.. అవసరైన ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలని సూచించారు.
అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2కోట్ల చొప్పున తక్షణ నిధులు ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు. సీఎంఓ అధికారులు అందుబాటులో ఉంటారని.. వరద కారణంగా జరిగిన నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి రోజువారీ నివేదికలు పంపాలని కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.
Konaseema District: నిర్లక్ష్యంపై ప్రశ్నించినందుకు వాలంటీర్లపై సచివాల ప్రతాపం - కుర్చీలు తీయించి దారుణం !
Employee Selfi Video: ‘బాబోయ్, రెడ్డి రాజ్యంలో పని చెయ్యలేం’ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన, సెల్ఫీ వీడియో
Breaking News Live Telugu Updates: విప్లవ రచయిత వరవరరావుకు సుప్రీం కోర్టు బెయిల్
IB Terror Warning: హైదరాబాద్లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్
Petrol-Diesel Price, 10 August: వాహనదారులకు షాక్! నేడు ఎగబాకిన ఇంధన ధరలు - మీ నగరంలో ఈరోజు ఇలా
Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే
Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్పై స్పందించిన రష్మిక
Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Swathimuthyam Release Date : దసరా సీజన్ టార్గెట్ చేసిన బెల్లంకొండ