అన్వేషించండి

AP Special Package: కేంద్ర పద్దులో ఏపీకి వచ్చేది 20 వేల కోట్లు! మెజార్టీ వాటా దక్కించుకోనున్న ఏపీ, బిహార్

Andhra Pradesh News | కేంద్రం ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు ఇవ్వనున్న ప్రత్యేక ప్యాకేజీతో ప్రభుత్వంపై ఎంతమేర బారం పడనుందంటే రూ.20000 కోట్ల నుంచి రూ.30000 కోట్లు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Union Budget 2024-25 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీ, బిహార్ కు కాస్త కేటాయింపులు ఎక్కువుగానే చేశారు. బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన హామీలకు వాస్తవ రూపంలో ఎంత వస్తుందనే లెక్కలు బయటకు వస్తున్నాయి.
ఆంధ్రకు 20వేల కోట్లు!.. బిహార్‌కు 5-10 వేల కోట్లు..
 కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు చెప్పిన అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 15వేల కోట్ల నుంచి  20వేల కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. బిహార్‌కు 5 నుంచి 10వేల కోట్ల సాయం అందనుంది.  ఈ రెండు రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక కేటాయింపుల వల్ల ఈసారి కేంద్ర ఖజానాపై 25వేల నుంచి 30వేల కోట్ల రూపాయల భారం పడనుందని ఆర్థిక శాఖ చెబుతోంది.  ‘రాష్ట్రాల అభ్యర్థనలపై అందించే ప్రత్యేక సాయం’  పద్దు కింద ఏపీ, బిహార్‌కు సాయం అందించే అవకాశం ఉంది. ఈ పద్దుకు ఈసారి బడ్జెట్‌లో 20 వేల కోట్లు కేటాయించారు. ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ హెడ్ కింద కేటాయింపులు 4వేల కోట్లు మాత్రమే. ఏవైనా రాష్ట్రాలు ప్రత్యేక అవసరాలు ఉంటే వారి కోరిక మేరకు ఈ పద్దు నుంచి కేటాయింపులు చేస్తుంది కేంద్రం. ఎన్నికల తర్వాత ఈ పద్దుకు కేటాయింపులు ఏకంగా 5 రెట్లు పెరగడం చూస్తుంటే.. ఈ ఖాతా ద్వారానే ఈ రెండు రాష్ట్రాలకూ సాయం అందించన్నారని అర్థం అవుతోంది.  2023-24 బడ్జెట్ లో రాష్ట్రాలకు సాయం కింద పద్దులో రూ.2,271 కోట్లు ప్రతిపాదించగా.. చివరికి రూ.13,000 కోట్లు సాయం అందించింది కేంద్రం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కేవలం 4 వేలు పేర్కొనగా, పూర్తి స్థాయి బడ్జెట్ లో మాత్రం ఆ ప్రత్యేక సాయం పద్దను రూ.20,000 కోట్లకు కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.  

ఏపీ, బిహార్ కు ప్రత్యేక కేటాయింపులు 
కిందటి వారం నిర్మలా సీతారామన్ బడ్జెట్ పద్దులో ఎక్కువగా వినిపించిన రాష్ట్రాల పేర్లు ఆంధ్ర, బిహార్. ఇంతకు మందు చాలా ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ అనే పేరే బడ్జెట్‌లో వినిపించేది కాదు. ఈసారి పలుమార్లు నిర్మల ఈ పేరును ప్రస్తావించారు. అమరావతికి ప్రత్యక ఆర్థిక తోడ్పాటు కింద 15వేల కోట్ల సమీకరణ, ఏపీలో వెనుకపడిన జిల్లాల ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుపై పూర్తి బాధ్యత తీసుకోవడం, వైజాగ్ -చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లోని కొప్పర్తి నోట్‌కు మౌలిక సదుపాయాలు కల్పించడం, హైదరాబాద్- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లోని ఓర్వకల్లుకు రోడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలకు నిధులు కేటాయింపు వంటివి ప్రస్తావించారు. అలాగే బిహార్‌కు 27వేల కోట్ల విలువైన కూడా హైవేలు, విమానాశ్రయాలు మౌలిక వసతుల కల్పనా ప్రాజెక్టులు ప్రకటించారు. 

రాజకీయ బడ్జెట్ అని విమర్శలు
ఎన్డీఏ 3.0 ప్రభుత్వానికి ఇప్పుడు ఊపిరి ఇస్తున్న పార్టీలు టీడీపీ, జనతాదళ్ యునైటెడ్ లే. మైనార్టీలో ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వానికి ఈ రెండు పార్టీలకు చెందిన 28 మంది ఎంపీల మద్దతు దన్నుగా నిలబడుతోంది. కాబట్టి రాజకీయ పరమైన కారణాలతో ఈ రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేశారని విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం తమకు ప్రత్యేక సాయం ఏమీ అందించడం లేదని చెబుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకే సాయం అందిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.  విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి సాయం అవసరం అంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం విడుదల చేసిన శ్వేతపత్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి అదనంగా రూ.19,107 కోట్లు అవసరం అని పేర్కొన్నారు.  పోలవరం, వెనుకబడిన జిల్లాల సాయం వంటివన్నీ చట్టంలోనే ఉన్నాయని.. రాజధానికి కేంద్రం సాయం చేస్తామని పదేళ్ల కిందటే చెప్పిందని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
I Phone Murder : ఐ ఫోన్ కోసం డెలవరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
ఐ ఫోన్ కోసం డెలవరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IND vs BAN 2nd Test Day 5 Highlights: రెండో టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియాSircilla Weavers: 18 లక్షల చీర చూశారా? సిరిసిల్లలోనే తయారీSrikakulam Fisherman Boats Fire: నడిసంద్రంలో అగ్ని ప్రమాదాలు, వణికిపోతున్న మత్స్యకారులుTiger in Konaseema: చిరుత కోసం డ్రోన్లతో వేట - కోనసీమ DFOతో ఫేస్ టూ ఫేస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
I Phone Murder : ఐ ఫోన్ కోసం డెలవరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
ఐ ఫోన్ కోసం డెలవరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Pawan Kalyan: 'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
Kothagudem News: సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
IND vs BAN 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
రెండో టెస్టులో భారత్ ఘన విజయం, బంగ్లాతో సిరీస్ క్లీన్ స్వీప్
Embed widget