అన్వేషించండి

Andhra CID : హై ప్రోఫైల్ కేసులన్నీ సీఐడీ చేతికి - త్వరగా తేల్చేయాలని ఏపీ ప్రభుత్వం అనుకుంటోందా ?

APCID : హై ప్రోఫైల్ కేసులన్నీ ఏపీ సీఐడీకి బదలాయిస్తున్నారు. రాజకీయ నాయకులతో పాటు సివిల్ సర్వీస్ అధికారులు ఈ కేసుల్లో నిందితులుగా ఉండటంతో ఒత్తిళ్లు లేకుండా దర్యాప్తు కోసం సీఐడీకి బదలాయిస్తున్నారు.

Andhra Pradesh All high profile cases are being transferred to AP CID : ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీ మరో సారి యాక్టివ్ అవుతోంది. వైఎస్ఆర్‌సీపీ హయాంలో సీఐడీ సోషల్ మీడియా కేసుల నుంచి ప్రభుత్వ పెద్దలకు అత్యంత ముఖ్యమైన మార్గదర్శి వంటి కేసుల వరకు అన్నింటినీ డీల్ చేసేది. దాదాపుగా అన్ని రాజకీయ పరమైన కేసులే. ఇతర కేసుల విచారణ సాధారణ పోలీసులు తీసుకునే వారు. ఈ కారణంగా అప్పటి సీఐడీ చీఫ్‌లుగా పని చేసిన పీవీ సునీల్ కుమార్ తో పాటు సంజయ్ కు పోస్టింగ్‌లు లేవు. ఇద్దరిపై కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత కూడా అలంటి హై ప్రోఫైల్ కేసులు సీఐడీ వద్దకే వెళ్తున్నాయి. 

కీలక కేసులు సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు

వైసీపీ అధికారంలో ఉన్పప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసుతో పాటు చంద్రబాబు  ఇంటిపైనా  దాడి జరిగింది. ఆ కేసులను అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత దాడి జరిగింది తనపై కాబట్టి టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. సీసీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆదారాలతో అరెస్టులు ప్రారంభించారు. చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేష్ దాడికి వెళ్లిన కేసు కూడా వేగం పుంజుకుంది. తాజాగా హీరోయిన్ జత్వానీ కేసును కూడా సీఐడీకి అప్పగించారు. 

పాలనలో చంద్రబాబే ఆదర్శనం- జట్టు కట్టిన ఫలితం రాష్ట్ర ప్రగతిలో కనిపిస్తోంది- పల్లె పండగలో పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్

ఇప్పటికే మద్యం, ఇసుక స్కాం కేసులు కూడా!

గత ప్రభుత్వ హయాంలో మద్యం , ఇసుకల పై భారీ స్కాం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం వెల్లడించింది. సీఐడీ ఈ మేరకు కేసులు పెట్టింది. మైనింగ్ వ్యవహారాలను తన చేతుల మీదుగా నడిపిన వీజీ వెంకటరెడ్డి అనే అధికారిని ్రెస్టు చేశారు. తదుపరి చర్యలు తీసుకోనున్నారు. లిక్కర్ స్కాంలో కీలకమని భావిస్తున్న మరో అధికారి వాసుదేవరెడ్డి పరారీలో ఉన్నారు. లిక్కర్ స్కామును ఇప్పటికే సీఐడీకి అప్పగిస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు . ఇందులో పెద్ద ఎత్తున నగదు అక్రమ చెలామణి జరిగిందని అందుకే ఈడీకి కూడా సిపారసు చేస్తామని చంద్రబాబు తెలిపారు.  

'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ

కేసుల్లో సివిల్ సర్వీస్ అధికారులు, రాజకీయ నేతలు

ప్రభుత్వం సీఐడీకి అప్పగిస్తున్న కేసులన్నీ రాజకీయ నేతలు, సివిల్ సర్వీస్ అధికారులకు సంబంధించినవే. వారే ప్రధాన నిందితులుగా ఉన్నారు. కనీసం పది మంది వరకూ సివిల్ సర్వీస్ అధికారులతో పాటు మాజీ సీఎం జగన్ దగ్గర నుంచి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి సహా  పలువురు రాజకీయ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ సోషల్ మీడియా లాంటి చిన్నా చితకా కేసులు కావు. హై ప్రోఫైల్ కేసులు.. పవర్ ఫుల్ వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. అందుకే సాధారణ పోలీస్ స్టేషన్లలో అయితే ఇతర కేసుల విచారణతో బిజీగా ఉండి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేరని అందుకే సీఐడీని ఇన్వాల్వ్ చేస్తున్నారని అనుకోవచ్చు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Sand Policy : ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?
ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?
Nagavamsi: సినిమాకి రూ.1500 పెట్టలేరా? - నాగవంశీ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు!
సినిమాకి రూ.1500 పెట్టలేరా? - నాగవంశీ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు!
Nobel Prize  2024 : దేశాల మధ్య ఆర్థిక అంతరాలపై పరిశోధన - ముగ్గురు ఆర్థిక వేత్తలకు నోబెల్ ప్రైజ్
దేశాల మధ్య ఆర్థిక అంతరాలపై పరిశోధన - ముగ్గురు ఆర్థిక వేత్తలకు నోబెల్ ప్రైజ్
Mogilaiah Land Issue: పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ
పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: నేను టెర్రరిస్టునా? నన్నెందుకు రానివ్వరు? రాజాసింగ్ ఆగ్రహంవీడియో: నా శవం మీద సెటిల్ చేసుకోండి, సికింద్రాబాద్‌లో మాధవీలత అరెస్ట్Vivek Venkata Swamy: వివేక్‌కు కేబినెట్ బెర్త్ ఖాయమా? చెన్నూర్ ఎమ్మెల్యేతో ఫేస్ 2 ఫేస్సల్మాన్‌ను చంపితే లారెన్స్ బిష్ణోయ్‌కు వచ్చే ప్రయోజనం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Sand Policy : ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?
ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?
Nagavamsi: సినిమాకి రూ.1500 పెట్టలేరా? - నాగవంశీ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు!
సినిమాకి రూ.1500 పెట్టలేరా? - నాగవంశీ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు!
Nobel Prize  2024 : దేశాల మధ్య ఆర్థిక అంతరాలపై పరిశోధన - ముగ్గురు ఆర్థిక వేత్తలకు నోబెల్ ప్రైజ్
దేశాల మధ్య ఆర్థిక అంతరాలపై పరిశోధన - ముగ్గురు ఆర్థిక వేత్తలకు నోబెల్ ప్రైజ్
Mogilaiah Land Issue: పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ
పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ
YCP Leader Attack On Anchor : మార్గాని భరత్ అనుచరుడు మామూలోడు కాదు - అప్పు తిరిగివాలన్నందుకు మహిళా యాంకర్‌పై దాడి !
మార్గాని భరత్ అనుచరుడు మామూలోడు కాదు - అప్పు తిరిగివాలన్నందుకు మహిళా యాంకర్‌పై దాడి !
TDP Office: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి - కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి - కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు
Telangana News: దసరా పండుగకు ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచలేదు - ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన
దసరా పండుగకు ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచలేదు - ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన
Pawan Kalyan Comments : అల్లు అర్జున్ బాగుండాలని కోరుకునే వాడిని- పవన్ ఆసక్తికరమైన కామెంట్స్
అల్లు అర్జున్ బాగుండాలని కోరుకునే వాడిని- పవన్ ఆసక్తికరమైన కామెంట్స్
Embed widget