అన్వేషించండి

Supreme Issued Notices to CM Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దుపై ఎంపీ రఘురామ పిటిషన్ - జగన్, సీబీఐకు సుప్రీం నోటీసులు

Andhra News: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు జగన్, సీబీఐకు నోటీసులు జారీ చేసింది.

Supreme Notices to CM Jagan: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ (CM jagan Bail) రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama) వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో సీఎం జగన్, సీబీఐ (CBI) సహా ప్రతివాదులందరికీ జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్ నేతృత్వంలోని సర్వోన్నత న్యాయస్థానం నోటీసులిచ్చింది. 'ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా.?' అని ధర్మాసనం పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా, నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని కోర్టును కోరారు. ఇప్పటికే విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని రఘురామ పిటిషన్ వేయగా, ఆ పిటిషన్ సైతం జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను 2024, జనవరి తొలి వారానికి వాయిదా వేసింది.

రఘురామ పిటిషన్ లో ఏం చెప్పారంటే.?

అక్రమాస్తుల కేసులో జగన్ గత పదేళ్లుగా బెయిల్ పై బయటే ఉన్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్ష్యాలు చెరిపేస్తున్నారని ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలంగాణ హైకోర్టులో తొలుత పిటిషన్ దాఖలు చేశారు. అయితే, దీనిపై సీబీఐ సమాధానంతో ఈ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో రఘురామ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారించిన న్యాయస్థానం, 'సాక్ష్యాలు చెరిపేస్తున్నారు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా.?' అని ప్రశ్నించింది. దీంతో కేసుకు సంబంధించిన వివరాలు, జరిగిన ఘటనలపై లిఖితపూర్వక వివరాలను రఘురామ తరఫు న్యాయవాది కోర్టుకు అందించారు. జగన్ కు బెయిల్ మంజూరు చేసిన తర్వాత దర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు సీఎం జగన్ సహా, ప్రతివాదులకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

'నత్తనడకన విచారణ'

సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ పదేళ్లుగా నత్తనడకన సాగుతోందని, అందుకే మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ కూడా రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 'సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటివరకూ 3,041 సార్లు వాయిదా పడ్డాయి. వీటి విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించట్లేదు. ప్రధాన నిందితుడు జగన్ కు ఇష్టానుసారంగా వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారు. దీని వల్ల కేసు విచారణకు అంతు లేకుండా పోతుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కేసు విచారణ ప్రారంభమయ్యే స్థితి కనిపించడం లేదు. అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి. ఈ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి.' అని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను బెయిల్ రద్దు అంశం పిటిషన్ తో జత చేయాలని రిజిస్ట్రీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

గతంలోనూ పిటిషన్లు

సీఎం జగన్ పై గతంలోనూ ఎంపీ రఘురామ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. అక్రమాస్తుల కేసులో నిందితులైన వారికి వివిధ పదవులు కట్టబెట్టడం, ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నారని ఇందుకు సాక్ష్యాలుగా కోర్టుకు నివేదించారు. అయితే, ఈ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసింది. 

ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

Also Read: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు - చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా, అప్పటివరకూ చర్యలొద్దని ఆదేశం

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Nora Fatehi From Matka: 'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Embed widget