అన్వేషించండి

Andhra News in Telugu: ఏపీ సచివాలయంలో లంచావతారం - ఏసీపీకి పట్టుబడ్డ సెక్షన్ ఆఫీసర్ !

AP News in Telugu: ఏపీ సచివాలయంలో లంచం తీసుకుంటూ ఓ అధికారి పట్టుబడ్డారు. ఓ స్కాలర్ షిప్ మంజూరు కోసం విద్యార్థి తండ్రిని లంచం డిమాండ్ చేశారు.

Andhra Pradesh News in Telugu: ఏపీ సచివాలయంలో ఏసీబీ దాడుల  కలకలం రేగింది. సచివాలయం బస్సు షెల్టర్ వద్ద నాటకీయంగా ఆర్థిక శాఖ సెక్షన్ ఆఫీసర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసింది. ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నాగభూషన్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు. వెలగపూడి సచివాలయం బస్ షెల్టర్ వద్ద రూ.40,000 లంచం తీసుకుంటుండగా నాగభూషన్‌రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. విదేశీ విద్యోన్నత నిధులు మంజూరుకు సంబంధించిన ఫైలును క్లియర్ చేయడానికి నాగభూషణ్  రెడ్డి ఓ విద్యార్థి తండ్రిని  లంచం అడిగాడు. అతను ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. నిఘా పెట్టిన ఏసీబీ డబ్బులు తీసుకుంటూండగా అరెస్టు చేశారు. 

ఇటీవలి కాలంలో ఏపీ సచివాలయంలో మొదటి సారి ఏసీబీ దాడులు                    

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో ఇప్పటి వరకూ ఏసీబీ  దాడులు జరగలేదు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు ఎలాంటి సోదాలు నిర్వహించలేదు. అయితే హఠాత్తుగా ఇటీవల ఏసీబీ అధికారులు సెక్రటేరియట్ ఉద్యోగులపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఏసీబీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూండటంతో.. వాటిపై దృష్టి పెట్టి ఉద్యోగుల అవినీతిని బయట పెట్టాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నేరుగా సెక్రటేరియట్ లో ఏసీబీ దాడులు జరగడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. 

ఇతర చోట్ల కూడా ఏసీబీ దాడులు పెరుగుదల                            

సెక్రటేరియట్ లోనే కాకుండా.. అవినీతి గురించి తమకు వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఆధారాలు ఉంటే.. నిఘా పెట్టి.. రెడ్ హ్యాండెడ్  గా పట్టుకుంటున్నామని ఏసీబీ పోలీసులు చెబుతున్నారు. ఇటీవల పలువురు అధికారులు ఇలా దొరికిపోయారు. ఆ తర్వాత ఏపీ ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఉద్యోగులపై ఏసీబీ దాడులను ఖండించారు. సరిగ్గా జీతాలివ్వడం లేదని ఆయినా ఇలా వేధిస్తున్నారని ఆరోపించారు. దీనికి ఏసీబీ అధికారులు ఖండన ప్రకటన ఇచ్చారు. లంచాలు తీసుకుంటే.. ఎవరినైనా అరెస్టు చేస్తామని.. తమకు వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికం రెవిన్యూ అధికారుల లంచాల గురించేనని చెబుతున్నారు. 

ఏసీబీ దాడులతో ఉలిక్కి పడుతున్న ఉద్యోగ సంఘాలు                                    

ఎన్నికలకు మూడు నెలల ముందు ఏసీబీ దాడులను పెంచడం వెనుక.. ఉద్యోగులను నోరెత్తకుండా చేసే ప్రయత్నం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు అనుమానిస్తున్నారు. ఉద్యోగులు ఎన్నికలకు ముందు ప్రభుత్వం నుంచి తమ కు రావాల్సిన వాటిపై డిమాండ్లు పెట్టడం.. ఆందోళనలు చేయడం సహజమని.. అలాంటివి ఈ సారి ఉండకుండా  ఇలా ఏసీబీ దాడులతో బెదిరిస్తున్నారని .. ఉద్యోగ సంఘాలు అనుమానిస్తున్నాయి. 

 

ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
AP DWCRA: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget