(Source: ECI/ABP News/ABP Majha)
Ysrcp Mla: జగన్ ను హత్య చేసేందుకు కుట్ర... వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం హత్యకు టీడీపీ నేతలు కుట్ర చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోని వచ్చేందుకు టీడీపీ ఏదైనా చేస్తుందని ఆయన ఆరోపించారు
అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వాక్యలు చేశారు. సీఎం జగన్ ను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లి తన భార్యను అవమానించారంటూ గోడును వినిపించారన్నారు. చంద్రబాబు అధికారం లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారని విమర్శించారు. సీఎం జగన్ హత్యకు కుట్ర చేసైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎవరో మల్లాది వాసు... వైసీపీ నేతలని హత్య చేస్తే రూ50 లక్షలు ఇస్తానన్న వ్యాఖ్యలను ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గుర్తుచేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలు తప్పు అయితే వాసు మాట్లాడింది తప్పు కాదా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలెవ్వరూ దీనిని ఎందుకు ఖండించడంలేదని ప్రశ్నించారు. అనంతపురంలో మల్లాది వాసు అభిమానుల పేరుతో ఫ్లెక్సీలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇదేనా తెలుగుదేశం విధానమని విమర్శించారు.
Also Read: "హోదా" కోసం రాజీనామాలు చేద్దాం ..రా ! సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్ !
హత్య చేసి అధికారంలోకి
ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని హత్య చేసేందుకు టీడీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. జగన్ హత్య చేసైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇటీవల సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. సీఎంను ఎలాగైనా జైలుకు పంపేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు.
Also Read: లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
చంద్రబాబు, బాలకృష్ణ ఎందుకు ఖండించలేదు
మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వంశీ, అంబటి రాంబాబులను చంపిన వారికి రూ.50 లక్షలు ఇస్తానని కమ్మ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మల్లాది వాసు ఈ వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. మల్లాది వాసు తెలంగాణలో ఎక్కడో చెబితే అనంతపురం జిల్లాలో ఫ్లెక్సీలు పెడుతున్నారని ఇదేనా టీడీపీ విధానం అంటూ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ నేతలు మల్లాది వాసు వ్యాఖ్యలు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. టీడీపీ హింసా రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. టీడీపీ పాలనలో రూ.వేల కోట్లు నేతల జేబుల్లోకి వెళ్లాయన్నారు. అందుకే సీఐడీ విచారణకు టీడీపీ నేతలు ఎందుకు అడ్డుపడుతున్నారన్నారు.
Also Read: పీఆర్సీ ప్రకటించినా ఉద్యమం ఆగదు... సీపీఎస్ రద్దు చేయకుండా ప్రత్యామ్నాయాలు వద్దు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి