అన్వేషించండి

Anantapur Temple Hundi Note Viral: అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?

Weird Temple Offerings: అనంతపురం జిల్లా సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయ హుండీలో దేవుడికి ఓ వింత కానుక వచ్చింది. రూ. 20 నోటుపై తన అత్త చనిపోవాలని రాసి హుండీలో వేశారు.

Devotee Wishes Aunt Death Rs 20 Note:   సాధారణంగా ప్రజలు గుళ్లకు వెళ్లి దేవుడి హుండీల్లో కానుకలు వేసి.. స్వామీ! మా పిల్లలకు మంచి ఉద్యోగం రావాలి, మా ఆయురారోగ్యాలు బాగుండాలి, వ్యాపారంలో లాభాలు రావాలి" అని కోరుకుంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న ప్రసిద్ధ సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో మాత్రం ఒకరు దేవుడికే మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్  ఆఫర్ ఇచ్చాడు. హుండీలో వేసిన రూ. 20 నోటుపై రాసిన ఒక వింత కోరిక కోరారు. 
 
 హుండీ లెక్కింపులో దైవిక ట్విస్ట్! 

అనంతపురం జిల్లాలోని సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో అధికారులు, సిబ్బంది ఎప్పటిలాగే భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించడానికి కూర్చున్నారు. హుండీ ఒంపగానే నోట్లు, నాణేలు గుట్టలుగా పడ్డాయి. సిబ్బంది చాలా భక్తిశ్రద్ధలతో నోట్లను వేరు చేస్తుండగా.. ఒక రూ. 20 నోటు వారి కంటపడింది. దానిపై ఏదో పెన్నుతో రాసి ఉండటంతో, ఏవైనా బ్యాంక్ నంబర్లో లేదా ప్రేమికుల పేర్లో అనుకుని సాధారణంగా చూశారు. కానీ, ఆ నోటుపై ఉన్న అక్షరాలు చదవగానే పాపం లెక్కించే సిబ్బంది గుండెలు ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది!

 స్వామీ.. మా అత్తను లేపేయ్! 

సాధారణంగా భక్తులు దేవుడికి లేఖలు రాసి హుండీలో వేస్తుంటారు. కానీ ఈ మహాభక్తుడో..భక్తురాలో కానీ డైరెక్ట్ పాయింట్‌కి వచ్చేసి రూ. 20 నోటుపై ఇలా రాశారు.. స్వామీ.. నా వల్ల కావడం లేదు. మా అత్త పెట్టే వేధింపులను నేను అస్సలు భరించలేకపోతున్నాను. దయచేసి ఆమె త్వరగా చనిపోయేలా చూడు స్వామీ!  అని తన మనసులోని  పవిత్రమైన కోరికను దేవుడి ముందు పెట్టాడు. ఆ నోటు చదివిన సిబ్బంది ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, "నాయనా.. దేవుడికి థాంక్స్ చెప్పేవాళ్లను చూశాం కానీ, ఇలా అత్తను లేపేయమని 20 రూపాయల సుపారీ ఇచ్చే భక్తుడిని ఇప్పుడే చూస్తున్నాం  అని తలలు పట్టుకున్నారు.

 ఇరవై రూపాయలకే అంత పెద్ద స్కెచ్చా? 

ఈ వింత కోరిక ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లకు పెద్ద మీమ్ మెటీరియల్‌గా మారింది.  భలేవాడివే సామి.. ఈ రోజుల్లో ఒక ఆర్డినరీ రౌడీ షీటర్ కూడా మనుషులను లేపేయడానికి లక్షల్లో డిమాండ్ చేస్తుంటే.. నువ్వు ఏకంగా సృష్టిని నడిపించే దేవుడికే కేవలం 20 రూపాయలు ఇచ్చి అంత పెద్ద స్కెచ్ వేయమని కోరతావా? కనీసం ఒక రూ. 500 నోటు వేసినా దేవుడు కరుణించేవాడేమో! అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బహుశా ఆ భక్తుడికి అత్తగారిపై ఉన్న కోపం కంటే.. తన జేబులో ఉన్న బడ్జెట్ అంతేనేమో అని మరికొందరు జాలిపడుతున్నారు.

కోడలనే ఫిక్సవుతున్న నెటిజన్లు

సాధారణంగా సీరియళ్లలో, సినిమాల్లో చూపించే అత్తా-కోడళ్ల కారాలూ-మిరియాలూ.. ఈ నోటుతో రియల్ లైఫ్‌లో ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థమవుతోంది. అందుకే ఎక్కువ మంది ఈ సుపారీ ఇచ్చింది కోడలే అనుకుంటున్నారు.   ఈ రూ. 20 నోటు ఫోటోలు ప్రస్తుతం వాట్సాప్, ఎక్స్   ఇన్‌స్టాగ్రామ్‌లలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నోటు రాసింది ఎవరా? అని ఆలయ సిబ్బందికి కూడా తెగ క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే హుండీలో వేసేటప్పుడు ఎవరూ చూడరు కాబట్టి ఆ 'క్రియేటివ్' భక్తుడిని పట్టుకోవడం ఇంపాజిబుల్. ఏదేమైనా, అనంతపురం సుబ్రమణ్యేశ్వర స్వామికి పూజలు చేసి, క్షేమంగా ఇంటికి వెళ్లిన అనంతపురం అత్తలందరూ.. ఇప్పుడు తమ కోడళ్లు లేదా అల్లుళ్లు  కాఫీ ఇస్తే తాగాలా వద్దా? అని అనుమానంగా చూసే పరిస్థితి వచ్చిందని నెటిజన్లు నవ్వుకుంటున్నారు.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Advertisement

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget