అన్వేషించండి
Advertisement
Chandrababu Kuppam Tour : రేపటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన, మూడు రోజులు అక్కడే!
Chandrababu Kuppam Tour : రేపటి నుంచి మూడ్రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు.
Chandrababu Kuppam Tour : టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలో పర్యటన కొనసాగుతోంది. రేపటి నుంచి మూడు రోజుల(11,12,13వ తేదీలు) పాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం పట్టణంతో పాటు శాంతిపురం, గుడుపల్లె మండలాలలోని పలు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు శాంతిపురం మండలం బెల్లకోకిలకు చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం బోయనపల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొంటారు. 12వ తేదీ సీగలాపల్లి జాతరలో చంద్రబాబు పాల్గొనున్నారు. గుడిపల్లె మండలం పోగురుపల్లితో పాటు పలు గ్రామాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. మూడో రోజు(13 వ తేదీ) కుప్పంలో స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
హైదరాబాద్
ఇండియా
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion