అన్వేషించండి

Anantapur: టచ్ ఫోన్ బుక్ చేస్తే అర కేజీ రాయి పంపారు... ఈ-కామర్స్ పార్శిల్ ఓపెన్ చేసి అవాక్కైన కస్టమర్...

ఈ-కామర్స్ సైట్ లో ఫోన్ బుక్ చేస్తే రాయి పంపిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. రాయి చూసి అవాక్కైన కస్టమర్... సదరు సంస్థకు ఫిర్యాదు చేశారు.

ఆధునిక జీవితంలో రోజు రోజుకో మార్పు వస్తుంది. ఈ-కామర్స్ విషయమైతే చెప్పాల్సిన అవసరమే లేదు. పుట్టినప్పటి నుంచి చనిపోయవరకూ ఉపయోగించే వస్తువులన్నీ అందుబాటులో పెట్టేస్తున్నారు. పండుగలనీ, ఆఫర్లనీ అవసరంలేకపోయిన కొనుగోలు చేయిస్తుంటారు. ఈ మధ్య ఈ-కామర్స్ లో కొనుగోళ్లు పెరిగిన తర్వాత మోసాలు కూడా అదేస్థాయిలో బయటపడుతున్నాయి. ఆర్డర్ చేసేటప్పుడు చూపించే వస్తువు పార్శిల్ లో రావడంలేదు. తీరా ఆరా తీస్తే అదేదో సైబర్ మోసగాళ్ల సైట్ అని తేలుతుంది చివరకు. ఒక్కొసారి అసలైన ఈ-కామర్స్ సైట్ లోనే ఏదో బుక్ చేస్తే మరొకటి పంపిస్తుంటారు. ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.   Anantapur: టచ్ ఫోన్ బుక్ చేస్తే అర కేజీ రాయి పంపారు... ఈ-కామర్స్ పార్శిల్ ఓపెన్ చేసి అవాక్కైన కస్టమర్...

Read Also: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క

పార్శిల్ విప్పుతూ వీడియో

ఈ కామర్స్ సైట్‌లో ఏదైనా వస్తువు బుక్ చేస్తే దాని స్థానంలో రాళ్లు, పండ్లు వస్తున్న సంఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌లో Mi ఫోన్ బుక్‌ చేస్తే దానికి బదులుగా రాయి వచ్చిన సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో చోటుచేసుకుంది. బాధితుడు కథనం ప్రకారం..వంశీకృష్ణ అనే యువకుడు 6వ తేదీన ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15990 విలువచేసే రియల్‌మీ ఫోన్ బుక్‌చేశాడు. గురువారం డెలివరీ బాయ్ శ్రీనివాసులు వచ్చి పార్సిల్‌ ఇచ్చి అతని నుంచి రూ.15990 తీసుకున్నాడు. సాధారణంగా ఆ యువకుడు ఏది కొన్న పార్సెల్ ఓపెన్ చేసే ముందు వీడియో తీసే అలవాటు ఉండడంతో.. ఇప్పుడు వచ్చిన పార్శిల్‌ను విప్పుతూ ఇంకో ఫోన్‌లో వీడియో కూడా తీశాడు. తీరా పార్శిల్‌ బాక్సుకు ఉన్న సీల్ తొలగించి ఉండడంతో ఆ యువకుడు అవాక్కయ్యాడు. దాన్ని తెరిచి చూడగా సుమారుగా 500 గ్రాముల బరువున్న రాయి బయటపడింది. ఈ విషయాన్ని ఆ యువకుడు డెలివరీ బాయ్‌ని ప్రశ్నించగా తనకు ఏమి తెలియదని పార్శిల్‌ మీకు ఇచ్చి రమ్మంటే వచ్చానని తెలిపాడు. పార్సిల్ తొలగించిన వీడియో డెలివరీ బాయ్ కు చూపించగా అప్పుడు సంస్థ నుంచే ఏదో పొరపాటు జరిగినట్లు గుర్తించి, డెలివరీ బాయ్ పై అధికారులను అడిగి అతని డబ్బులు వెనక్కి ఇచ్చాడు. 

Read Also: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..

కేఎఫ్సీలో మరో ఘటన 

ఇంగ్లాండ్‌లోని ట్వికెన్‌హామ్‌కు చెందిన గ్యాబ్రిల్లే అనే మహిళ.. కేఎఫ్‌సీ ఔట్‌లెట్‌లో చికెన్ హాట్ వింగ్స్ మీల్‌ను ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత ఎంతో ఆత్రుతతో హాట్ వింగ్స్ బాక్సును ఓపెన్ చేసి తినడం మొదలుపెడితే.. దోరగా వేయించిన కోడి తల కనిపించింది. అంతే.. ఆమెకు ఒక్కోసారే కోడి మొత్తాన్ని తినేసినంత ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత మళ్లీ ఆ మీల్స్‌ను ముట్టుకుంటే ఒట్టు. ఆ కోపంతో ఆమె ఫ్రైడ్ చికెన్ హెడ్ ఫొటోను తీసి.. ఆ సంస్థకు 2 రేటింగ్ ఇచ్చింది. ఆమె పోస్ట్ వైరల్ కావడంతో ఆ సంస్థ నిర్వాహకులు దిగిరాక తప్పలేదు. అంతేకాదు.. మొత్తం చికెన్ తల మొత్తం ఫుడ్‌లోకి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయింది. ఆమె తమకు 2 స్టార్ ఇవ్వడంలో తప్పులేదని పేర్కొంది. ‘‘మేం ఆ ఫొటో చూసి సర్‌ప్రైజ్ అయ్యాం. ఇది ఎలా జరిగిందో తెలుసుకోడానికి మేం ఆమెను సంప్రదించాం. ఈ విషయాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తాం. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకుంటాం. మా సప్లయర్స్, సిబ్బందితో మాట్లాడి ఈ తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడతాం’’ అని తెలిపాడు. చికెన్ హెడ్ బాధితురాలికి కేఎఫ్‌సీ.. ఫ్రీ ఫుడ్‌ ఆఫర్ కూడా ఇచ్చింది. ఆమె తన కుటుంబంతో కలిసి తమ టేక్‌ఎవే ప్లేస్, తమ కిచెన్‌లో మీల్స్ ఎలా తయారు చేస్తారో చూడాలని ఆహ్వానించింది. మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైతే.. తిట్టేసి ఊరుకోకండి. సోషల్ మీడియా ద్వారా సంస్థ దృష్టికి తీసుకెళ్తే.. ఆ తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.

Read Also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget