Mahindra praises Chandrababu Naidu: చంద్రబాబు తిరుగులేని శక్తి - ప్రశంసించిన ఆనంద్ మహింద్రా - ఏపీ సీఎం స్పందన ఏమిటంటే ?
Anand Mahindra : ఆనంద్ మహింద్రా చంద్రబాబును పొగిడారు. ఇండస్ట్రీల ఇన్సెంటివ్స్ విషయంలో చంద్రబాబు పాలసీలను అభినందించారు

Anand Mahindra praises Chandrababu Naidu: ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తిరుగులేని శక్తిగా ప్రశంసించారు. 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులకు సులభతరమైన వాతావరణం కల్పించేందుకు ఇన్వెస్టర్లకు ఇచ్చే ప్రోత్సాహకాల కోసం అవసరం అయితే 'ఎస్క్రో సిస్టమ్'ను ప్రవేశపెడతామని ప్రకటించారు. ఇది ఆనంద్ మహింద్రాను ఆకర్షించింది.
"ఈ మనిషి తిరుగులేని శక్తి... దశాబ్దాలుగా ఆయన అభివృద్ధి విధానాలకు అకర్షితుడ్ని అవుతున్నాను. కొత్త, ముందుకు తీసుకెళ్లే విధానాలు మాత్రమే కాకుండా, తాను, తన చుట్టూ ఉన్నవారందరిని ఉన్నతస్థాయికి తీసుకెళ్తూ ఉంటారు. " అని ప్రశంసించారు. ఈ పోస్టు వైరల్ అయింది.
This man is an unstoppable force of nature.
— anand mahindra (@anandmahindra) November 19, 2025
What I’ve admired about him for decades is not just his obsession for development but his desire to always be innovative in his policies.
He raises the bar for himself and for everyone around him.
👏🏽👏🏽👏🏽
pic.twitter.com/4RFUWGfwiv
ఆనంద్ మహింద్రా ప్రశంసలపై చంద్రబాబు స్పందించారు. భారతదేశం అద్భుతమైన వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని నేను గట్టిగా నమ్ముతున్నాననని... మన బాధ్యత నిరంతరం నూతన ఆవిష్కరణలు చేయడమన్నారు. ఈ ప్రయత్నంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాననని చంద్రబాబు తెలిపారు. గత కొన్ని దశాబ్దాలుగా మీ మద్దతు మరియు భాగస్వామ్యం అమూల్యమైనవి. త్వరలో మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతించడానికి నేను ఎదురు చూస్తున్నానన్నారు .
Anand ji, thank you for your gracious words. I firmly believe India is entering a phase of transformative growth, and as policymakers our responsibility is to continually innovate and create new pathways to unlock the vast entrepreneurial energy of our people. I am merely doing… https://t.co/KkzK00A2c0
— N Chandrababu Naidu (@ncbn) November 19, 2025
చంద్రబాబుతో మహీంద్రా మధ్య గతంలోనూ అభివృద్ధి, ఆర్థిక విషయాలపై సన్నిహిత సంబంధం ఉంది. గతంలో అరకు కాఫీ ప్రమోషన్‌కు చంద్రబాబు చేసిన కృషిని మహీంద్రా కొనియాడారు. పారిస్‌లో అరకు కాఫీ క్యాఫెల్లో ట్రైబల్ జీవన వివరాలు చూపించే ఎలక్ట్రానిక్ స్క్రీన్లు, ట్రైబల్ డ్రెస్‌ల నుంచి ప్రేరణ పొందిన ప్యాకేజింగ్‌ను హైలైట్ చేస్తూ, "మీ ఆలోచనలు సరైనవి" అని పేర్కొన్నారు. గత ఎన్నికల తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తెలుగులో అభినందనలు తెలిపిన మహీంద్రా, ఆయన నాయకత్వాన్ని ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉన్నారు.
సీఐఐ సదస్సులో ఆధునిక సాంకేతికతలు, డ్రోన్ తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన రంగాల్లో ఆంధ్రాన్ని గ్లోబల్ మ్యాప్‌లో ఉంచాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మహీంద్రా వంటి పారిశ్రామికవేత్తల ప్రశంసలు, ఈ లక్ష్యాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఏపీలో మహింద్రా గ్రూపు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి.





















