అన్వేషించండి

AP Assembly Session: అసెంబ్లీకి వచ్చిన జగన్.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వైసీపీ సభ్యులతో కలిసి వాకౌట్

AP Assembly Budget Session |మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి వచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని నినాదాలు చేసిన వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

YSRCP MLAs and MLCs Walkout | అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన కాసేపటికే వైఎస్సార్ సీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ సభ్యులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. వైఎస్సార్ సీపీ చాంబర్ నుంచి సభకు వచ్చిన మాజీ సీఎం జగన్ పార్టీ సభ్యులతో కలిసి మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొంత సమయానికే సభ వాకౌట్ చేశారు. 


AP Assembly Session: అసెంబ్లీకి వచ్చిన జగన్.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వైసీపీ సభ్యులతో కలిసి వాకౌట్

గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. రాష్ట్ర విభజన సమస్యలతో పాటు ఆర్థిక కష్టనష్టాల మధ్య ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యమై అభివృద్ధి ఆగిపోయిందని, ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. గతంలో శాంతిభద్రతలకు విఘాతం కలగడమే కాకుండా, 22ఏ వంటి నిబంధనలు దుర్వినియోగం అయ్యాయని విమర్శించారు. విద్యుత్, సాగునీరు, రహదారులు వంటి కీలక మౌలిక వసతుల రంగాల్లో ప్రగతి కుంటుపడిందని వివరించారు.


AP Assembly Session: అసెంబ్లీకి వచ్చిన జగన్.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వైసీపీ సభ్యులతో కలిసి వాకౌట్

2024లో రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను ప్రజలు కూటమికి అప్పగించారని గవర్నర్ గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా సాగుతోందని చెప్పారు. గత 19 నెలల కాలంలో వ్యవస్థలను గాడిలో పెట్టి, సూపర్ సిక్స్ సహా పలు సంక్షేమ కార్యక్రమాలను పునఃప్రారంభించినట్లు తెలిపారు. పాలనలో పారదర్శకత కోసం ఏడు శ్వేత పత్రాలను విడుదల చేసి, వ్యవస్థల పునరుద్ధరణపై తొలి తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ప్రశంసించారు.


AP Assembly Session: అసెంబ్లీకి వచ్చిన జగన్.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వైసీపీ సభ్యులతో కలిసి వాకౌట్

రాష్ట్ర భవిష్యత్తు కోసం 'స్వర్ణాంధ్ర 2047' లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రకటించారు. పది సూత్రాలను నిర్దేశించుకుని సుపరిపాలన అందించడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంగా పాటిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ఈ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. వ్యవస్థల పునర్నిర్మాణం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 12, 13 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే సభ వాయిదా పడుతుంది. అనంతరం స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై ఎప్పుడు చర్చించాలనే దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరుగుతుంది. ఈ చర్చ ముగింపులో ముఖ్యమంత్రి చంద్రబాబు సభ్యులు లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇస్తారు.


AP Assembly Session: అసెంబ్లీకి వచ్చిన జగన్.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వైసీపీ సభ్యులతో కలిసి వాకౌట్

అత్యంత కీలకమైన రాష్ట్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెడతారు. శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఫిబ్రవరి 15 (ఆదివారం), 16 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. తిరిగి ఫిబ్రవరి 17 నుంచి రెండు మూడు రోజుల పాటు బడ్జెట్‌పై సాధారణ చర్చ కొనసాగుతుంది. ఆ తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల వారీగా గ్రాంట్లు, డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలుపుతారు.

ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కేవలం ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా చట్టసభలో బిల్లులను కూడా ప్రవేశపెట్టనుంది. గతంలో తీసుకువచ్చిన నాలుగు ఆర్డినెన్సుల స్థానంలో కొత్త బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకువస్తుంది. పరిపాలనలో సంస్కరణలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లులు కీలకం కానున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
AP DWCRA: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Perni Nani Avigan: అవిగన్ రాజకీయం - వైఎస్‌ఆర్‌సీపీ మావిగన్‌పై మళ్లీ రూటు మార్చిందా?
అవిగన్ రాజకీయం - వైఎస్‌ఆర్‌సీపీ మావిగన్‌పై మళ్లీ రూటు మార్చిందా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget