News
News
X

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారడంపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు సీరియస్‌గా స్పందించారు. రాజకీయా పార్టీలు ఎన్ని వచ్చినప్పటికీ తమకు డోకా లేదన్నారు.

FOLLOW US: 
 
ఏపీపై బీఆర్‌ఎస్‌ ప్రభావం ఉండబోదన్నారు మంత్రి జోగి రమేష్‌. దేశంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని... వాళ్లందరి గురించి ఆలోచించాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రస్తుతం ఏపీలో తమకు మరో ఇరవై ఏళ్లు తిరుగు లేదన్నారాయన. ఉన్న పార్టీలకే స్కోప్‌ లేనప్పుడు కొత్తగా వచ్చే పార్టీలు ఏం చేస్తాయని ప్రశ్నించారు. ప్రజలంతా తమవైపే ఉన్నారని అభిప్రాయపడ్డారు. తాము తీసుకొచ్చిన కార్యక్రమాలు సంక్షేమ పథకాలకు బ్రహ్మరథం పడుతున్నారని రాష్ట్రాభివృద్ధిని స్వాగతిస్తున్నారని అన్నారు. 

మరో మంత్రి అమర్‌నాథ్ స్పందిస్తూ ఎవరు ఎలా వచ్చినా ఏపీలో తమకు ఢోకా లేదన్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామన్నారు. ఇప్పుడున్న ప్రతిపక్షాలనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించడం లేదని కొత్తగా వచ్చే పార్టీలు ఏం చేస్తాయని ప్రశ్నించారు. ఉన్న బీజేపీకే ఒక శాతం ఓట్లు కూడా లేని విషయాన్ని అమర్‌నాథ్ గుర్తు చేశారు. 

బీఆర్‌ఎస్‌గా టీఆర్‌ఎస్

తెలంగాణ రాజ‌కీయ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయం ప్రారంభమయింది.  భార‌త్ రాష్ట్ర స‌మితిగా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్ర‌స్థానంలో మ‌రో మలుపు చోటు చేసుకుంది. ప‌లు రాష్ట్రాల నేత‌ల స‌మ‌క్షంలో కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడంతో పాటు టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.  టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ కార్యవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ  ఆమోదించారు. దీంతో మధ్యాహ్నం 1.19 గంటలకు బీఆర్ఎస్ పార్టీ పేరును ప్రకటించారు.

News Reels

ముహుర్తం ప్రకారం టీఆర్ఎస్ పేరును  బీఆర్ఎస్‌గా మారుస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటన

బీఆర్ఎస్ ఆవిర్భావ తీర్మానానికి టీఆర్ఎస్ పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఆమోదించింది.తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది.  సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంట్‌ సభ్యులు, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు సహా 283 మంది కీలక ప్రతినిధులు భేటీకి హాజరయ్యారు. అలాగే సమావేశానికి పలు రాష్ట్రాల నేతలు సైతం హాజరయ్యారు. సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని ప్రకటించారు. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో దీన్ని కీలక మలుపుగా అభివర్ణించారు. పార్టీ సర్వసభ్య సమావేశానికి హాజరైన పలు రాష్ట్రాల నేతల సమక్షంలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. దీంతో హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద  బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచి, బాణసంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు.

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఇతర పార్టీల ప్రతినిధులు హాజరు 

కర్నాటక మాజీ ముఖ్యమంతి, జేడీఎస్‌ నేత హెడీ కుమారస్వామి, ఆయన పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళన్‌తో పాటు ఎంపీలు భేటీకి హాజరయ్యారు.ప్రస్తుతం జాతీయ పార్టీగా ఎందుకు మారుస్తున్నామో సభ్యులకు కేసీఆర్‌ వివరించారు.  అనంతరం టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.   తీర్మానానికి ఆమోదం తెలుపుతూ 283 మంది సభ్యులు ఆమోదముద్ర వేశారు.  ఆ తర్వాత సంతకాలు చేశారు.  

ఈసీ అనుమతి పొందిన తర్వాతనే అధికారికంగా మార్పు 

అయితే కార్యవర్గ సమావేశంలో తీర్మానం మాత్రమే చేశారు. ఈసీ ఆమోదించాల్సి ఉంది. ఈ తీర్మానంతో .. టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్లి ఎన్నికలసంఘం ప్రతినిధులతో భేటీ అవుతుంది. వారికి సమర్పించి తెలంగాణ రాష్ట్ర సమితిపేరును రద్దు చేయించి..  భారత రాష్ట్ర సమితిగా మార్పు చేయిస్తారు. ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం అయితే ఈ ప్రక్రియలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకూ  తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటుంది. 

Published at : 05 Oct 2022 07:55 PM (IST) Tags: BJP YSRCP Jogi Ramesh TRS BRS KCR TDP Amarnath

సంబంధిత కథనాలు

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

Guntur Knife Attack : గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి

వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయండి

వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయండి

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల ఎర కేసు, బీఎస్ సంతోష్, జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట

Breaking News Live Telugu Updates:  ఎమ్మెల్యేల ఎర కేసు, బీఎస్ సంతోష్, జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట

Nadendla Manohar : ప్రశ్నించేవారు లేకుండా చేయాలనే వైసీపీ కుట్ర, ఇది ముమ్మాటికీ వికృత రాజకీయం- నాదెండ్ల మనోహర్

Nadendla Manohar : ప్రశ్నించేవారు లేకుండా చేయాలనే వైసీపీ కుట్ర, ఇది ముమ్మాటికీ వికృత రాజకీయం- నాదెండ్ల మనోహర్

టాప్ స్టోరీస్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!