YS Jagan: మదనపల్లి అగ్ని ప్రమాదంపై స్పందించిన జగన్ - ఏపీకి కొత్త అర్థం చెప్పిన మాజీ సీఎం
YSRCP Chief Jagan: విషయాన్ని డైవర్ట్ చేయడంలో ఆరితేరిన చంద్రబాబు మదనపల్లి అగ్ని ప్రమాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు జగన్. కేవలం రషీద్ ఇష్యూను డైవర్ట్ చేయడానికి యత్నించారన్నారు.
Andhra Pradesh: వినుకొండలో రషీద్ అనే దారుణంగా హత్య చేశారు. అందులో నిందితుడు టీడీపీ నాయకులకు సన్నిహితుడు. కానీ కేసులో వారిపై కేసులు పెట్టలేదు. ఎమ్మెల్యే బంధువులపై కానీ, ఇతరులపై కేసులు లేవు. వీటిపై ప్రశ్నిస్తుంటే టాపిక్ డైవర్షన్ కోసం మదనపల్లిలో జరిగిన ఇష్యూను తీసుకున్నారు. సీఎం రెండుసార్లు రివ్యూ చేశారు. డీజీపీని ప్రత్యేక హెలికాప్టర్‌లో పంపించి హడావుడి చేశారు. పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి చేశారని ఆరోపిస్తూ ఆరోపిస్తారు. అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే ఫైల్స్ ఆన్‌లైన్లో ఉంటాయి కదా... అని ప్రశ్నించారు. దానికి ఇంత హడావుడి దేనికి అని నిలదీశారు. ఇన్నిసార్లు గెలుస్తున్నారంటే వాళ్లకు ప్రజల్లో మంచి పేరు ఉందనే కదా అర్థమన్నారు. నియోజకవర్గంలో తిరగకుండా చేస్తూ వాళ్లపైనే తిరిగి కేసులు పెడుతున్నారు.
మదనపల్లి కేసు డైవర్షన్
తనకు నష్టం జరిగే విషయాల నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారని చెప్పారు జగన్. వినుకొండ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడానికే మదనపల్లె సబ్ కలెక్టర్‌లో ఫైర్ యాక్టిడెంట్‌కు హైప్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇందులో పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. పెద్దిరెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యే, మిథున్‌రెడ్డి మూడుసార్లు ఎంపీగా విజయం సాధించారంటే ప్రజల్లో మంచి పేరు ఉందని గ్రహించాలన్నారు. వాళ్లను అభాసుపాలు చేసేందుకు వాళ్లపై దాడి చేసి రివర్స్‌లో కేసులు పెడతున్నారని ఆరోపించారు.
దిశా ఎక్కడ?
'మచ్చుమర్రిలో బాలికను వెతికడానికి చంద్రబాబుకు మనసు రాదు కానీ డీజీపీకి ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి మదనపల్లి పంపిచారని ఆరోపించారు. మచ్చుమర్రి కేసులో నిందితుడిని లాకప్‌డెత్ చేశారని విమర్శించారు. బాధితులు ఆందోళన చేయడంతో పోలీసులపై చర్యలు తీసుకున్నారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయి క్షీణించాయని ఆరోపించారు జగన్. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. 45 రోజుల్లో 12 మందిపై అత్యాచారాలు జరిగాయని వివరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్,పని చేసేవని ఎక్కడ నేరాలు జరగకుండా పోలీసులు వెంటనే వెళ్లేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆరోపించారు. మహిళలకు వరంలా ఉండాల్సిన వీటిని జగన్‌కు పేరు వస్తుందని పని చేయకుండా చేశారని విమర్శించారు.
Also Read: "జగన్ ఉండి ఉంటే" వైసీపీకి కొత్త నినాదం ఇచ్చిన అధినేత
ఏపీ అంటే ?
ఏపీ అంటే అరాచక పాలన, ఆటవిక పాలనగా మారిందని కొత్త అర్థం చెప్పారు. ప్రస్తుతం ఏపీలో రెడ్‌బుక్ పాలన నడుస్తోందని అన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడాన్ని జగన్ ఖండించారు. అక్రమ కేసులు పెట్టి ఆయన్ని అరెస్టు చేయడాన్ని తప్పుపెట్టారు. అనుకూలంగా ఉండే అధికారులను అక్కడకు ట్రాన్స్‌ఫర్ చేసి ఇదంతా నడిపిస్తున్నారని చెప్పారు. శ్రీనివాసులు అనే అధికారి ఎస్పీగా వచ్చిన తర్వాతే వినుకొండలో రషీద్ హత్య జరిగిందని గుర్తు చేశారు జగన్.
చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్ పేరుతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు జగన్. ఆ రెడ్ బుక్‌ను గ్రామాల్లో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో ఎవరూ మాట్లాడకూడదు. ఎవరూ ప్రశ్నించకూడదనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇలాంటి పరిణామాలు ఉంటాయని ఏకంగా చంద్రబాబు లాంటి వ్యక్తులు బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: హామీలు అమలు చేయాల్సి వస్తుందనే బడ్జెట్ పెట్టడం లేదు- చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు