అన్వేషించండి

YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్

Andhra Pradesh News: బాపట్ల నియోజకవర్గంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల ప్రసంగించారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు.

AP Congress News: కాంగ్రెస్ పై మోదీ పదే పదే విషం చిమ్ముతున్నారని.. కాంగ్రెస్ అధికారంలో వస్తే మంగళసూత్రాలు తెంచుతుందని అంటున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారో అని షర్మిల నిలదీశారు. మోదీ పదే పదే మతాల మధ్య మళ్ళీ చిచ్చు పెడుతున్నారని.. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ద్వేషం పెంచుతారా? అని ప్రశ్నించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు సృష్టించి ఎన్ని మంగళ సూత్రాలు తెంచలేదని షర్మిల ఆరోపించారు. ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు కూడా మణిపూర్ ఘటనతో ఎన్నో మంగళ సూత్రాలు మోదీ తెంచారని అన్నారు. బాపట్ల నియోజక వర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల ప్రసంగించారు.

‘‘రాహుల్ గాంధీ ప్రేమను నింపే మాటలు మాట్లాడుతున్నారు. మోదీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారు. ప్రధానికి దమ్ముంటే చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి. ముస్లింలను కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు. మీకు బుద్ది చెప్పే సమయం ఆసన్నమయ్యింది. మతాల మధ్య చిచ్చు పెట్టే బీజేపీ తో బాబు, జగన్ కొంగుపట్టుకొని తిరుగుతున్నారు. బీజేపీ ఈ దేశానికి చాలా ప్రమాదం.

బాపట్ల ఎమ్మెల్యే పనికొచ్చాడా? ప్రజల అవసరాలు తీర్చారా? మొత్తం ఇసుక మాఫీయా అంట కదా? టీడీపీ వాళ్ళు కిటికీలు మాత్రమే దోచారు. వైసీపీ మొత్తం గడపలు దోచేశారు. భూ బకాసురుడు అంట కదా.. తక్కువకు భూములు గుంజుకొని సర్కార్ దగ్గర ఎక్కువ ధర దోచాడు అంట కదా. ఇది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం. ఇలాంటి దొంగ ఎమ్మెల్యేకి మళ్ళీ సీట్ ఇచ్చాడట. మళ్ళీ దోచుకొని తినమని చెప్పడానికి సీట్ ఇచ్చాడా? మొత్తం మీ డబ్బులే.. ఈసారి ఎంత ఇచ్చినా తీసుకోండి. ఆలోచన చేసి ఓటు వేయండి. 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఏమి మిగల్చలేదు. మొత్తం దోచేశారు. కనీసం రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు.

మన రాజధాని ఏది అని చెప్పలేని పరిస్థితి. ప్రత్యేక హోదా మన హక్కు. హోదా మన రాష్ట్రానికి ఊపిరి. హోదా వచ్చి ఉంటే 10 ఏళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది. 10 ఏళ్లలో ఒక్క ఎంపీ కూడా హోదా మీద పోరాటం చేయలేదు. బాబుకి, జగన్ కి హోదాపై చిత్తశుద్ది లేదు. హోదా ఇస్తామని బీజేపీ మోసం చేస్తే కనీసం నిలదీయలేదు. బీజేపీ కొంగు పట్టుకొని తిరుగుతున్నారు. జగన్ పులి కాదు.. పిల్లి. బీజేపీతో ప్రేమాయణం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి పక్కన పెట్టారు. ఇదే బాపట్లలో నల్లమాడ వాగు ప్రతి ఏటా ఉప్పొంగుతుంది. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరుగుతుంది. ఆధునీకరణ చేయాలని వైఎస్ఆర్ అనుకున్నారు. వైఎస్ఆర్ వారసుడిగా జగన్ ఈ కాలువను పట్టించు కోలేదు.

ఈ ఐదేళ్లు జగన్ గాడిదలు కాశారు - షర్మిల
జగన్ వైఎస్ఆర్ వారసుడు కాదు. ఈ ఐదేళ్లు జగన్ గాడిదలు కాశాడు. ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఉద్యోగాలు అని మోసం చేశారు. 2.25 లక్షల ఉద్యోగాలు అని మోసం చేశారు. మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీ వేశాడు. 5 ఏళ్లు కోటలు కట్టుకొని బ్రతికాడు. ప్రజల సమస్యలు విన్న పాపాన పోలేదు. అభివృద్ధి చేసింది లేదు కానీ.. ఇప్పుడు ఎన్నికలకు సిద్ధం అంట. ఎందుకు సిద్ధం సార్ అని అడుగుతున్నా.. మ్యానిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నాడు. మద్యపాన నిషేధం అని ఎందుకు చేయలేదు? సర్కారు కల్తీ మద్యం ఎందుకు అమ్ముతుంది? ప్రజల ప్రాణాలు ఎందుకు తీస్తున్నారు? ఏది అమ్మితే అదే కొనాలి. ఎంతకూ అమ్మితే అదే కొనాలి. వైఎస్ఆర్ ఆశయాలు నిలబెట్టాలి అంటే రైతును రాజు చేయాలి. ఇళ్లులేని ప్రతి పేద కుటుంబానికి ఇళ్ళు కట్టాలి. ఉద్యోగాలు ఇవ్వాలి. ఎప్పుడే వైఎస్ఆర్ వారసులు అవుతారు. కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది’’ అని వైఎస్ షర్మిల అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget