By: ABP Desam | Updated at : 23 Mar 2023 08:31 AM (IST)
గంటా శ్రీనివాస రావు
ఎమ్మెల్యే కోటలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠ అధికార విపక్షాల మధ్య కొనసాగుతోంది. ఎవరు ఎవరికి ఓటు వేస్తారు... వెన్నుపోట్లు ఎవరికి ఉంటాయన్న చర్చ జోరుగా నడుస్తోంది. అయితే రెబల్ ఎమ్మెల్యేల సంగతి పక్కన పెడితే... ఉన్న ఎమ్మెల్యేల్లో ఓట్లు వేసేది ఎవరూ అనే లెక్కలను పార్టీలు వేసుకుంటున్నాయి. అందులో ఒకరు గంటా శ్రీనివాసరావు.
గంటా శ్రీనివాస రావు అప్పుడెప్పుడో స్టీల్ ప్లాంట్ ఉద్యమం ప్రారంభమైన తొలిరోజుల్లోనే వీరావేశంతో రాజీనామా ప్రకటన చేశారు. ఉద్యమకారులు, మీడియా సమక్షంలోనే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించేసి అక్కడికక్కడే సంతకం పెట్టేశారు. ఆందోళనకారులతోనే దాన్ని స్పీకర్‌కి కూడా పంపేశారు. ఉద్యమ వేడి రాజేసేందుకు ఆయన చేసిన ప్రయత్నం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి ఆ రాజీనామా పత్రం పెండింగ్‌లో ఉంది.
తాను రాజీనామా చేశానంటూ ప్రకటించిన తర్వాత నుంచి సభకు గానీ సభా కార్యక్రమాలకు గానీ గంటా శ్రీనివాసరావు హాజరుకావడం లేదు. మధ్య మధ్యలో తన రాజీనామా ఆమోదించాలని స్పీకర్‌కు లెటర్లు కూడా రాశారు. అయితే రాజీనామా చేసేటైంలో ఆయన టీడీపీకి, ఆ పార్టీ చేపట్టే కార్యక్రమాలకు చాలా దూరంగా ఉండే వారు. అందుకే రాజీనామా ఆమోదం కోసం తీవ్రంగా ప్రయత్నించారు.
తర్వాత పరిస్థితి మారిపోయింది. పూర్తిగా ఆయన టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ మధ్య లోకేష్ చేసే పాదయాత్రకి కూడా మద్దతు తెలిపారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంటా ఓటు వేస్తారా లేదా అన్న ఉత్కంఠ ఉంది. రాజీనామా స్పీకర్ వద్ద ఉన్నందున ఓటు వేయడం నైతికంగా తప్పు అనుకుంటే మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉంటే ఛాన్స్ ఉంది. స్పీకర్ ఆమోదించలేదు కాబట్టి ఓటు వేస్తే తప్పేంటి అనుకుంటా మాత్రం ఓటింగ్‌కు హాజరయ్యే ఛాన్స్ ఉంది.
దీనిపై మరో వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. గంటా రాజీనామాను ఏ క్షణమైనా ఆమోదించే ఛాన్స్ ఉందంటున్నాయి అధికార పార్టీకి చెందిన నేతలు. ఆఖరి నిమిషంలో టీడీపీకీ షాక్ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. తమ పార్టీ నుంచి ఒకరిద్దరైనా ప్రతిపక్షానికి ఓట్లు వేస్తారని నిర్దారించుకుంటే మాత్రం గంటా రాజీనామాకు ఆమోద ముద్ర పడ్డట్టేనంటున్నారు. అందుకే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంటా ఎపిసోడ్ చాలా కీలంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. అయితే గంటా రాజీనామాను ఆమోదించేశారన్న ప్రచారం కూడా నడుస్తోంది. దీనిపై అధికార పార్టీ నుంచి కానీ... గంటా శ్రీనివాస రావు నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ రాలేదు. అందుకే దీనిపై కూడా సస్పెన్ష్ నడుస్తోంది.
నేడు(గురువారం) ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున‌్నాయి. మొత్తం ఏడు స్దానాలకు 8మంది అభ్యర్దులు పోటీ పడుతున్నారు. ఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయం హైలైట్ గా మారింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకూ అసెంబ‌్లి కమిటి హాలులో జరగనున్న ఓటింగ్ తరువాత సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. వెంటనే ఫలితాలు తెలుస్తాయి.
వైసీపీ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ నుంచి బరిలో జయమంగళ వెంకట రమణ,- మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, బొమ్మి ఇజ్రాయిల్, కోలా గురువులు, పోతుల సునీత, పెనుమత్స సూర్యనారాయరాజు ఉన్నారు. టీడీపీ నుంచి బరిలో లోకి విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ తెర మీదకు వచ్చారు.
యువగళంలో లోకేష్ కు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని డీజీపీకి వర్ల రామయ్య లేఖ
Coromandel Express Accident: టెక్నాలజీని వినియోగించుకొని రైలు ప్రమాదాలు జరగకుండా చూడాలి - ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ఏపీ మంత్రుల సమావేశం, కీలక అంశాలపై చర్చ
Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!
Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?