News
News
X

ఇతర రాష్ట్రాల్లో అసైన్డ్‌ భూముల పాలసీ అధ్యయనం చేయండి- ధర్మాన సూచన

మంత్రి ధర్మాన ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా అసైన్డ్ భూములపై ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు

FOLLOW US: 
 

కాలానుగుణంగా చట్టాల్లో మార్పులు అవసరమని, సమాజం హితం కోరే ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా చట్టాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. మంత్రి ధర్మాన అధ్యక్షతన అసైన్డ్ భూములపై కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కమిటీ సభ్యులుగా ఉన్న హోంశాఖ మంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు కంబాల జోగులు (రాజాం), కైలే అనిల్ కుమార్ (పామర్రు), టీజేఆర్ సుధాకర్ బాబు (సంతనూతలపాడు), కోనేటి ఆదిమూలం (సత్యవేడు), జొన్నగడ్డ పద్మావతి (సింగనమల), కె. భాగ్యలక్ష్మి (పాడేరు) హాజరయ్యారు. 

అసైన్డ్ భూములపై అన్యాక్రాంతమైన హక్కుల బదలాయింపుపై ఈ కమిటీ సమీక్షించింది. మంత్రి ధర్మాన ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా అసైన్డ్ భూములపై ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. స‌మాజం హిత‌వు కోరే శాస‌న స‌భ లేదా ప్ర‌భుత్వం చ‌ట్టాల‌ను కాలానుగుణంగా సమీక్షించుకొని, తదనుగుణంగా మార్పులు, చేర్పులూ చేస్తుండాలని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ స్పూర్తితో భూమి ప్రజ‌ల‌కు మరింత అందుబాటులో ఉండాలన్న ఆదేశ సూత్రాలకు అనుగుణంగా, పేదలకు మేలు జరిగేలా, ప్ర‌జ‌ల జీవ‌న ప్రమాణాలు పెంచే విధంగా ముఖ్యమంత్రి అన్ని విధాలా కృషి చేస్తున్నారన్నారు. 

భూమి వ్యవ‌సాయానికి, ఇత‌ర రంగాల‌కు ఉప‌యుక్తం అయ్యే విధంగా ఉండాలన్నారు ధర్మాన ప్రసాదరావు. వ్యవసాయ భూమి ఉంటే రైతుల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని, అదే ఆత్మ విశ్వాసం అసైన్డ్ భూములున్నవారికి కలిగించేలా కమిటీ కృషి చేయాలని కోరారు. గ‌తంలో మాదిరిగా గ్రామాల్లో ఉన్న పెత్తందారులు పేద వర్గాల వారి నుంచి భూముల లాక్కుకునేందుకు వీల్లేదన్నారు. ప్ర‌భుత్వం అసైన్మెంట్ దారులైన పేద తరగతుల వారికి బహుళ ప్ర‌యోజ‌నాలు చేకూర్చే విధంగా  కమిటీ సూచనలు, సలహాలు ఇవ్వాలని.. ఇదే ముఖ్యమంత్రి నిర్ణయం కూడా అని తెలిపారు. ప్రభుత్వానికీ  మంచి పేరు వ‌చ్చే విధంగా అభిప్రాయాలు తీసుకుని, త‌రువాత తుది నిర్ణయాలు చేసే అవ‌కాశం ఉంటుందన్నారు. 

ప‌క్క రాష్ట్రాల‌తో పోల్చి అసైన్డ్ ల్యాండ్స్‌కు సంబంధించి రైతులు పొందిన ప్ర‌యోజ‌నాలేంటి..? అదేవిధంగా ప్ర‌భుత్వానికి మంచి పేరు వ‌చ్చే విధంగా ఈ కమిటీ చేస్తున్న సూచనలు, సలహాలు ఏమిటి.? అని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు ధర్మాన. అవసరమైతే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అధ్యయనం చేయడానికి కమిటీ, అధికారుల బృందం పర్యటించాలని మంత్రి ధర్మాన తెలిపారు.

News Reels

మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ప్రతి పేదవాడి భూమికి రక్షణ కల్పించి, భద్రతతోపాటు ప్రతి పేదవాడికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలనే లక్ష్యంతో అసైన్డ్ భూముల సమస్యలపై చర్చించడానికి ముఖ్యమంత్రి ఈ కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రతి పేదవాడికి మేలు జరిగేలా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. పట్టా భూముల మధ్యలో అసైన్డ్ భూములు ఉన్నందున వీటిని గుర్తించి తర్వాత ఇంటి నివేశన పట్టా మంజూరుకు చర్యలు చేపడుతున్నప్పుడు భూ ఆసాములు కొంతమంది కోర్టులలో వ్యాజ్యలు వేస్తున్నారని కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. పోడు భూములు శక్తి మేరకు సాగుచేస్తున్నందున ఎక్కువ మంది లబ్ధిపొందేలా పట్టాలు మంజూరుచేయమని మంత్రి తానేటి వనిత సూచించారు. 

మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. కమిటీలో ఎక్కువ మంది సభ్యులు గతంలో ఎస్సీ, ఎస్టీ భూములపై పోరాడిన వాళ్లే ఉన్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగేలా అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నియమించడం గొప్ప పరిణామమన్నారు. అసైన్డ్ భూములపై ఇతర రాష్ట్రాలు ఏ విధంగా చేస్తున్నారో అధ్యయనం చేయడానికి కమిటీ పర్యటించాలని ఆయన కోరారు. అనాధిగా అసైన్మెంట్ కి సంబంధించి ఎలాంటి అంశాలు ఉన్నాయి..? ఎంత మేరకు భూమి పేదల వద్ద ఉన్నాయి..? వాటి పరిరక్షణ, ఆర్థిక స్వావలంబన చేకూర్చుటకు కమిటీ చైర్మన్ వారికి తోడ్పాటు అందిస్తూ ముఖ్యమంత్రి వారి ఆశయ సాధనకు కట్టుబడి ఉంటామని తెలిపారు. 
 

Published at : 22 Oct 2022 08:31 AM (IST) Tags: ANDHRA PRADESH Dharmana Prasada Rao Assigned Lands Jagan

సంబంధిత కథనాలు

Navy Day History: భారత నేవీ వైజాగ్‌లో పేల్చేసిన పాక్ సబ్ మెరైన్

Navy Day History: భారత నేవీ వైజాగ్‌లో పేల్చేసిన పాక్ సబ్ మెరైన్ "ఘాజీ "కీ అమెరికాకు లింకేంటి ? ఘాజీ శకలాలను చూస్తారా !

President Droupadi Murmu : ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

President Droupadi Murmu :  ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

AP Skill Development Scam : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై ఈడీ ఫోకస్, 26 మందికి నోటీసులు

AP Skill Development Scam : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై ఈడీ ఫోకస్, 26 మందికి నోటీసులు

Breaking News Live Telugu Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై ఈడీ ఫోకస్, 26 మందికి నోటీసులు

Breaking News Live Telugu Updates:  ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై ఈడీ ఫోకస్, 26 మందికి నోటీసులు

CM Jagan Oath Video : సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో చూపిస్తూ సర్జరీ, ఆపరేషన్ సక్సెస్!

CM Jagan Oath Video : సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో చూపిస్తూ సర్జరీ, ఆపరేషన్ సక్సెస్!

టాప్ స్టోరీస్

CM KCR: మహహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఎవ్వరూ 1000 ఏళ్లు బతకరని కామెంట్

CM KCR: మహహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఎవ్వరూ 1000 ఏళ్లు బతకరని కామెంట్

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?

Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త

Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త