By: ABP Desam | Updated at : 25 Apr 2022 07:03 PM (IST)
సీపీఎస్ రద్దుపై కొత్త ప్రతిపాదన
సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం కొత్త ట్విస్టు ఇచ్చింది. ఏపీలో ఉద్యోగులకు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది ప్రభుత్వం. సీపీఎస్ రద్దుకు బదులు జీపీఎస్ ప్రతిపాదన తీసుకొచ్చింది. గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌ను తెరపైకి తీసుకొచ్చింది.
ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో జరిగిన చర్చల్లో ఈ కొత్త విధానాన్ని ప్రతిపాదించింది ప్రభుత్వం. దీనిపై ఉద్యోగ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇది నమ్మేలా లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రతిపాదన తీసుకొచ్చింది. కానీ ఉద్యోగ సంఘాలు అంగీకరించలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ కోసం ఉద్యోగులు ఉద్యమించిన తర్వాత ఆ స్థాయిలో సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఈసారి పోలీసులు విజయవంతంగా సీపీఎస్ ఉద్యోగులు పిలుపునిచ్చిన " చలో విజయవాడ"ని అడ్డుకోగలిగారు. నిలువరించగలిగారు. ప్రభుత్వం సీపీఎస్ రద్దు విషయంలో ఒత్తిడి ఎందుకు ఎదుర్కొంటోంది ? చాలా సమస్యకు చూపించినట్లుగా ఇన్‌స్టంట్ పరిష్కారం ఎందుకు చూపించలేకపోతోంది ?
ఇటీవల పీఆర్సీ కోసం ఉద్యోగులు రోడ్డెక్కినప్పుడు జరిపిన చర్చల్లో ప్రభుత్వం సీపీఎస్ విషయంలో క్లారిటీ ఇచ్చింది. సీఎం జగన్ మార్చి 31లోగా సీపీఎస్ రద్దుపై "రోడ్ మ్యాప్" సిద్ధం చేస్తామని ప్రకటించారు. కానీ ఏప్రిల్ నెలాఖరు వస్తున్నా పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్‌సీపీ విజయంలో అత్యంత కీలకమైనది.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న సీపీఎస్‌ను రద్దు చేసి.. పాత పెన్షన్ విధానం తీసుకు వస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. వారితో కలిసి ప్లకార్డులు పట్టుకుని ఉద్యమంలో నడిచారు. కానీ మూడేళ్లయింది. ఇప్పటికీ రద్దు చేయలేదు. చేయడానికి దారులు కూడా ప్రభుత్వానికి కనిపించలేదు. ఇప్పటి వరకూ వేచి చూసిన ఉద్యోగులు ఇక ఆగడం లేదు. రోడ్డెక్కుతున్నారు.
Pawan Kalyan: మహానేతలను ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా ? వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ ఇదే: పవన్ కళ్యాణ్
Vegetable Rates: ఏపీలో కూరగాయల రేట్ల నియంత్రణకు ప్రత్యేక యాప్, సీఎస్ ఆదేశాలు
Pawan Kalyan On Konaseema Violence: ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసును కవర్ చేసుకునేందుకు ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది : పవన్ కళ్యాణ్ ఆరోపణలు
AP Government On CPS: సీపీఎస్ అమలు సాధ్యం కాదు- తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం, జీపీఎస్‌కు సహకరించాలని సూచన
Guntur: పెళ్లికి ముందు వరుడి మాజీ లవర్ ఊహించని ట్విస్ట్, అసలు విషయం తెలిసి వధువు ఫ్యామిలీ షాక్
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి