![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Guntur Politics: గుంటూరులో టీడీపీ అభ్వర్థులు దాదాపు ఖరారు, తెనాలి జనసేనకే!
TDP Candidates in Guntur : గుంటూరు జిల్లాలో టీడీపీ, జనసేన కూటమి మధ్య సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చాయి. 12 స్థానాల్లో 11 స్థానాలను టీడీపీకి , జనసేనకు ఒక స్థానాన్ని కేటాయించారు.
![Guntur Politics: గుంటూరులో టీడీపీ అభ్వర్థులు దాదాపు ఖరారు, తెనాలి జనసేనకే! Tdp candidates almost finalized in guntur Tenali ticket may get Janasena Guntur Politics: గుంటూరులో టీడీపీ అభ్వర్థులు దాదాపు ఖరారు, తెనాలి జనసేనకే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/09/bb128d1ea380eefef87279ea7e01b54f1707450969958930_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TDP Candidates in Guntur: గుంటూరు జిల్లాలో టీడీపీ, జనసేన కూటమి మధ్య జనసీట్ల పంపకాలు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 సీట్లు ఉండగా, ఇరు పార్టీల మధ్య చర్చలు తరువాత 12 స్థానాలపై స్పష్టత వచ్చింది. వీటిలో 11 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయనుండగా, జనసేనకు ఒక స్థానాన్ని కేటాయించినట్టు చెబుతున్నారు. ఆయా స్థానాల్లో దాదాపు సీనియర్లకు అవకాశాలను ఇరు పార్టీలు కల్పించాయి. తెనాలి స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇక్కడ టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే, ఈ సీటను జనసేనకు కేటాయించడంతో ఆయనకు మరో చోట సీటు ఇచ్చేందుకు టీడీపీ అధినాయకత్వం ఆలోచన చేసోంది.
ఈ స్థానాల్లో అభ్యర్థులు ఖరారు
గుంటూరు జిల్లాలో సుమారు 12 స్థానాలకు దాదాపు అభ్యర్థులు ఖరారయ్యారు. వీరి అభ్యర్థిత్వాలను ప్రకటించాల్సి ఉంది. ఖరారు చేసినట్టు చెబుతున్న జాబితాలో మంగళగిరి నారా లోకేష్, వేమూరు నక్కా ఆనందబాబు, పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్, చిలకలూరిపేట ప్రతిపాటి పుల్లారావు, ప్రత్తిపాడు బూర్ల రామాంజనేయులు, వినుకొండ జీవీ ఆంజనేయులు, మాచర్ల జూలకంటి బ్రహ్మారెడ్డి, గురజాల యరపతినేని శ్రీనివాసరావు, బాపట్ల వేగేశ్న నరేంద్రవర్మ, సత్తెనపల్లి కన్నా లక్ష్మి నారాయణ, రేపల్తె అనగాని సత్యప్రసాద్, తెనాలి నాదెండ్ల మనోహర్(జనసేన) అభ్యర్థిత్వాలు ఖరారైనట్టు చెబుతున్నారు. మిగిలిన సీట్లలో పోటీ అధికంగా ఉండడంతో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో అధిష్టానం ఉన్నట్టు చెబుతున్నారు. గుంటూరు పశ్చిమ సీటును జనసేన ఆశిస్తోంది. కానీ, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ సీటుకు టీడీపీ తరపున పలువురు పోటీ పడుతున్నారు. ఇక్కడ టీడీపీ ఇన్‌చార్జ్‌గా కోవెలమూడి రవీంద్ర ఉన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ శేషయ్య, వెంకటేష్ యాదవ్, మన్నవ మోహన్ కృష్ణ, డేగల ప్రభాకర్ తదితరులు ఈ సీటు కోసం ప్రయత్నిస్తున్నరు.
ఈ సీటును జనసేన నుంచి బోనబోయిన శ్రీనివాస యాదవ్ ఆశిస్తున్నారు. గుంటూరు తూర్పు సీటును ముస్లింలకు కేటాయించాలని పార్టీ టీడీపీ నిర్ణయించింది. ఇక్కడి నుంచి ఇన్‌చార్జ్ మహ్మద్ నజీర్, పార్టీ నేత వహీద్, దివంగత టీడీపీ నేత లాల్ జాన్ భాషా సమీప బంధువు అరిప్‌తోపాటు మరికొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌తోపాటు కొత్తగా వచ్చిన నేత భాష్యం ప్రవీణ్ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. నరసారావుపేటలోనూ పోటీ అధికంగా ఉంది. ఇక్కడి సీటు కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఇన్‌చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్‌బాబుతోపాటు, కడియాల లలిత్, కడియాల వెంకటేశ్వరరావు, నల్లపాటి రాము సీటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.
నరసారావుపేట ఎంపీ స్థానం లావుకే
నరసారావుపేట ఎంపీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ దాదాపు ఖరారు చేసింది. జిల్లాలోని మూడు ఎంపీ స్థానాల్లో రెండింటిని టీడీపీ దాదాపు ఖరారు చేసింది. నరసారావుపేట స్థానాన్ని వైసీపీ నుంచి బయటకు వచ్చి, టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న సిటింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కేటాయించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. గుంటూరు ఎంపీ స్థానానికి కొత్త అభ్యర్థిని బరిలోకి దించేందుకు టీడీపీ సన్నాహాలు చేస్తోంది. సిటింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడంతో ఇక్కడ ఎన్‌ఆర్‌ఐ పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేటాయించాలని పార్టీ భావిస్తున్నట్టు చెబుతున్నారు. బాపట్ల ఎంపీ స్థానంపై అభ్యర్థిని ఖారారు చేయాల్సి ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)