(Source: ECI/ABP News/ABP Majha)
Sujana On Janasena : టీడీపీ కోవర్టును కాదు - బీజేపీతో కలిసే జనసేన పోటీ చేస్తుందన్న సుజనా చౌదరి
తాను టీడీపీ కోవర్టును కాదని సుజనా చౌదరి చెబుతున్నారు. జనసేనతో కలిసే బీజేపీ పోటీ చేస్తుందన్నారు.
Sujana On Janasena : తాను టీడీపీ కోవర్టును కాదని సుజనా చౌదరి వివరణ ఇచ్చారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ బీజేపీతోనే కలిసి పోటీ చేస్తుందని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తో పొత్తుల అంశంపై పార్టీ అధిష్టానం చర్చలు జరిపారరి సుజనా అన్నారు. బిజెపి, జనసేన పొత్తుతోనే ముందుకు సాగుతున్నాయని తెలిపారు . అధిష్టానం ఏమి చెబితే మేము అలాగే నడుస్తామని స్పష్టం చేశారు. బిజెపి రాష్ట్రంలో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుందని, వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే ఎపికి కేంద్రం ఎక్కువ సాయం చేసిందని తెలిపారు. ఈ విషయం లో చర్చకు ఎవరొచ్చినా తాను సిద్దమని సవాల్ విసిరారు. రాజకీయంగా రాష్ట్రం లో బిజెపి లబ్ది పొందలేక పోయింది కానీ, అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం సాయం అందిస్తూనే ఉందన్నారు.
ఎపిలొ బిజెపి రాజకీయంగా లబ్ది పొందడానికి సమయం పడుతుందని సుజనా చౌదర విశ్లేషించారు. చాల కంపెనీలలో సంస్థల్లో నేను డైరెక్టర్ గా ఉన్నానని, 2014 లోనే మెడిసిటీ మెడికల్ కాలేజీ డైరెక్టర్ గా తప్పుకున్నట్లు వెల్లడించారు .మెడికల్ కాలేజీలో పాలన వ్యవహారంలో తనకు ఏ సంబంధం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్స్ పెంచడం కోసం అనుమతులు రద్దు చేస్తే మంచిదన్నారు. - అవినాష్ వ్యవహారంలో తాను స్పందించనని, కోర్టులు ఇండిపెండెంట్ గా పని చేస్తాయన్నారు. టిడిపి అనుకుంటే ముందస్తు ఎన్నికలు రావని, మ్యానిఫెస్టోకు ముందస్తు ఎన్నికలకు సంబంధం లేదన్నారు.
ఎపి లో విభజన చట్టం లో ఉన్న అనేక అంశాలను మోడీ అమలు చేశారని,మోడీ పాలనలో ఎపి కి విద్యా సంస్థలు, ఎయిమ్స్, జాతీయ రహదారులు నిర్మాణం జరిగిందన్నారు.ఎపి ప్రభుత్వం అసమర్థత వల్ల పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. ప్రాజెక్టు ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కూడా కేటాయించలేదని వివరించారు. పోలవరం ప్రాజెక్టు ను పూర్తి చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల వల్ల పోలవరం ఆలస్యం అయ్యుందని, రాజధాని అమరావతి ని అభివృద్ధి చేయకుండా జగన్ నాశనం చేశారని వ్యాఖ్యానించారు. మోడీ నిధులు ఇచ్చినా మూడు రాజధానులు పేరుతో రాష్ట్ర అభివృద్ధి ని ఆపేశారని మండిపడ్డారు. వెనుకబడిన ప్రాంతాలకు కూడా విడతల వారీగా కేంద్రం నిధులు ఇచ్చిందని,మోడీ పాలన పై ప్రపంచ దేశాలు సైతం చర్చ చేసుకుంటున్నారన్నారు. ఎక్కడకి వెళ్లినా మోడీ ధైర్యం గా మన దేశం గొప్పతనం గురించి చాటి చెబుతున్నారని, ఎపి కూడా మోడీ నాయకత్వంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా మోడీ అభివృద్ధి చేశారని సుజనా చౌదరి ప్రశంసించారు. తొమ్మిదేళ్ల లో నవ భారత్ ఆవిష్కృతమైందని, ఈ విషయాన్ని అంతర్జాతీయ సంస్థ లే చెబుతున్నాయని తెలిపారు.పేద, ధనిక మధ్య భారీ వ్యత్యాసం ఉండేదని, నేడు పేదలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి జీవన ప్రమాణాలు పెంచారని అన్నారు. భారతదేశం నుంచే ఇతర దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా చేశామని, జనాభా లో చైనా ను మన దేశం మించి పోయిందని వ్యాఖ్యానించారు.