TDP Office Attack: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడికి రిమాండ్ పొడిగించిన కోర్టు
Andhra Pradesh News | గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్యకు కోర్టు రెండు వారాలపాటు రిమాండ్ పొడిగించింది.
![TDP Office Attack: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడికి రిమాండ్ పొడిగించిన కోర్టు Remand extends for prime accused in TDP office attack case TDP Office Attack: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడికి రిమాండ్ పొడిగించిన కోర్టు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/28/be9cd605fe8f73bf43637e52b403daf81730120228865233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Remand extends for prime accused in TDP office attack case | అమరావతి: తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్యకు రిమాండ్ పొడిగించింది కోర్టు. గుంటూరు న్యాయస్థానం ఏ1 పానుగంటి చైతన్యకు 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు ఇచ్చింది. నిందితుడికి విధించిన 3 రోజుల సీఐడీ కస్టడీ ముగియడంతో గుంటూరులోని 6వ అదనపు న్యాయస్థానం ఎదుట నిందితుడిని అధికారులు సోమవారం హాజరు పరిచారు. అయితే తమ కస్టడీలో అధికారుల ప్రశ్నలకు చైతన్య సహకరించలేదని కోర్టుకు తెలిపారు. ఏ విషయం అడిగినా, తనకు తెలియదు, మరిచిపోయాను, గుర్తులేదు అని సమాధానం ఇచ్చినట్లు అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు చెప్పిన విషయాలు విన్న గుంటూరు 6వ అడిషనల్ మేజిస్ట్రేట్ ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్యకు మరో రెండు వారాలు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో నిందితుడు చైతన్యను పోలీసులు గుంటూరు కోర్టు నుంచి విజయవాడ జైలుకు తరలించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)