Amaravati restart: అమరావతి పనులు రీ స్టార్ట్ - హోరెత్తిన సభ !
Prime Minister Modi : ఆంధ్రుల రాజధాని అమరావతికి ప్రధాని మోదీ మరోసారి శంకుస్థాపన సభ కన్నుల పండువగా జరిగింది.

Amaravati works Start: ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులు, ప్రారంభించేందుకు నిర్వహించిన సభ కన్నుల పండువగా సాగింది. కేరళ నుంచి విజయవాడ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని మోదీకి చంద్ర బాబు, పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు వచ్చారు. సభా వేదికపై చంద్రబాబు, మోదీ పలు అంశాలపై సీరియస్ గా చర్చిస్తూ కనిపించారు.
వేదికపై వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంద్రబాబు, పవన్ కల్యాణ్ సన్మానం చేశారు. అమరావతి కి ప్రధాని మోదీ ఎంత అండగా ఉన్నారో చూపించే ఫోటోలను ఆయనకు ఇచ్చారు. 
అమరావతి పునఃనిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు. పార్కింగ్ కేటాయించిన ప్రదేశాలు వాహనాలతో నిండిపోయాయి. దూర ప్రాంతం నుంచి వచ్చే బస్సులను విజయవాడ శివారులో నిలిపివేశారు. సభా ప్రాంగణం ఉదయం పదకొండు గంటలకే నిండిపోయింది. 
నారా లోకేష్ స్పీచ్‌లో పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు. ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంది. పాకిస్థాన్‌కు సమాధానం చెప్పగలిగే మిస్సైల్ ప్రధాని మోదీ అన్నారు. ఒక్క పాకిస్థాన్ కాదు.. వంద పాకిస్థాన్‌లు వచ్చినా ఏం చేయలేవు. మోదీ కొట్టే దెబ్బకు పాకిస్థాన్ తోకముడవటం ఖాయమన్నారు. అమరావతికి పూర్తి స్థాయిలో మోదీ సహకారం అందిస్తున్నారు. ఆయన నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.
గతంలో చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారని నారాలోకేష్ విమర్శించారు. వైసీపీ పాలనలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. జై అమరావతి అన్నందుకు గతంలో తిరగలేని పరిస్థితి ఉందన్నారు. మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఎవరూ ఆపలేరు.ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ కార్యక్రమాలు ఆపలేరన్నారు.





















