అన్వేషించండి

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు, అమరావతి సభకు వచ్చే వాహనదారులకు సూచనలివే

PM Modi AP Tour Update: అమరావతికి ప్రధాని మోదీ వస్తున్నారు. భారీ బహిరంగ సభకు 5 లక్షల మంది మేర హాజరుకానున్నారని సమాచారం. రాజధాని ప్రాంత రైతులు సభకు భారీ ఎత్తున తరలి వస్తున్నారు.

అమరావతి: నేటి మధ్యాహ్నం ప్రధాని నరేంద్రం మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పనులు పున:ప్రారంభానికి శ్రీకారం చుట్టనున్నారు. వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ క్రమంలో అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసే వాహనదారులకు పోలీసులు కొన్ని సూచనలు ఇచ్చారు. ఉదయం నుంచి రాత్రి 10:00 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు.

1) MIP/ VVIP/ VIP వాహనాల దారులు ప్రకాశం బ్యారేజ్ - లోటస్ పాయింట్ - కరకట్ట -- సీడ్ యాక్సెస్ రోడ్(E3) - N9 జంక్షన్ - సభా ప్రాంగణానికి చేరుకుని అక్కడ వీరి కోసం ఏర్పాటు చేసిన  పార్కింగ్‌లో గల P8 మరియు P9 సెక్టార్లలో పార్కింగ్ చేయాలి.

Note :- ఆకస్మిక మార్గం:- సభా ప్రాంగణం - E3 రోడ్డు - కరకట్ట రోడ్డు - ప్రకాశం బ్యారేజ్ ద్వారా విజయవాడ వెళ్ళవచ్చును.

2) VIP లతో పాటు A+ వాహనదారులు ప్రకాశం బ్యారేజ్ - స్క్రూ బ్రిడ్జి - ఉండవల్లి సెంటర్ -- ఉండవల్లి గుహలు రోడ్డు నుండి కుడివైపు  తిరిగి - ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ప్రక్కన గల రోడ్డు (కరకట్ట ప్రక్కన ఉన్న రోడ్డు) ద్వారా సీడ్ యాక్సిస్ రోడ్డుకు (E 3 ) చేరుకుని - N10 జంక్షన్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకోవాలి. సభాస్థలం వెనుక ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. 

3) Route No -1:- కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి వచ్చే వాహనాలు రూట్ నంబర్ - 1 రహదారిలో గొల్లపూడి నుంచి పశ్చిమ బైపాస్ నవయుగ బ్రిడ్జి మీదుగా వెంకటపాలెం వద్ద సర్వీస్ రోడ్డులోకి రావాలి. అక్కడి నుండి మందడం ఆర్ అండ్ బి రోడ్డు గుండా N7 జంక్షన్ (మందడం పెట్రోల్ బంక్ సమీపంలో) ద్వారా కుడివైపునకు తిరిగి పార్కింగ్ నంబర్ - 06 నందు పార్కింగ్ చేయాలి.

4) Route No - 2 :- కృష్ణా జిల్లా నుంచి రూట్ నంబర్ - 2 ద్వారా వచ్చే వాహనాలు వారధి - తాడేపల్లి హైవే - మయూరి టెక్ పార్క్ డౌన్ - ఎన్నారై అండర్ పాస్ - నేతన్న సర్కిల్ - డాన్ బాస్కో స్కూల్ మీదుగా ఎర్రబాలెం - కృష్ణయ్య పాలెం - Z' 0 జంక్షన్ E8 రోడ్డు నుంచి పార్కింగ్ స్లాట్ నంబర్ - 01  చేరుకోవాలి

5) Route No - 3:- గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి రూట్ నంబర్- 3 ద్వారా వచ్చే వాహనదారులు కాజా టోల్ గేట్ సర్వీస్ రోడ్డు - మురుగన్ హోటల్ ఎడమ వైపు తిరిగి వెస్ట్ బైపాస్ మీదుగా N6 - E11 జంక్షన్ - N9 జంక్షన్ E8 - N9 జంక్షన్ ద్వారా పార్కింగ్ స్లాట్ నంబర్ - 01  చేరుకోవాలని సూచించారు. 

6) Route No - 4:- గుంటూరు నుంచి రూట్  నెంబర్- 04 ద్వారా వచ్చే వాహనదారులు గుంటూరు - తాడికొండ రోడ్డు - తాడికొండ పెద్దపరిమి - E6 రోడ్డు ప్రారంభం (తుళ్లూరు అయ్యప్ప స్వామి టెంపుల్) - N 11 - E 7 జంక్షన్ - E7 - N10 రోడ్ నుంచి పార్కింగ్ స్లాట్ నంబర్ - 01 చేరుకొనవలెను.

7) Route No - 5:- పల్నాడు జిల్లా నుంచి రూట్ నెంబర్ - 05 ద్వారా వచ్చే వాహనాలు అమరావతి - పెద్ద మద్దూరు - వైకుంటపురం - బోరుపాలెం - దొండపాడు - రాయపూడి Y జంక్షన్ - MLA క్వార్టర్స్ - న్యూ పార్క్ రోడ్డు - E6 - N11 జంక్షన్ నుండి N11 - E7  జంక్షన్ - E7 - N10 రోడ్డు ద్వారా పార్కింగ్ స్లాట్ నంబర్- 01 చేరుకోవాలి.

8) అత్యవసర సేవలకు రూట్ :- అత్యవసర సేవలకు సంబంధించిన వాహనదారులు సభా ప్రాంగణం - N9 జంక్షన్ - కురగల్లు - నిడమర్రు - మంగళగిరి టౌన్ నుంచి వెళ్లాలి. 

గుంటూరు జిల్లాలో ఎక్కడా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండటానికి కొన్ని వాహనాలను పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. 

* గుంటూరు నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనాలు బుడంపాడు క్రాస్ మీదుగా తెనాలి - వేమూరు- కొల్లూరు - వెల్లటూరు జంక్షన్ – పెనుముడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు - గుడివాడ - హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లిస్తున్నారు.

* చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్ళే వాహనాలు బోయపాలెం క్రాస్ వద్ద నుండి ఉన్నవ, ఏ.బి.పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు -గుడివాడ-హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖ వైపు మళ్లిస్తున్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget