![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pawan Kalyan: నెక్స్ట్ ఏం చేద్దాం? నేతలతో జనసేనాని పవన్ కళ్యాణ్ సమీక్ష
Pawan Kalyan: ఏపీలో రాజకీయ పరిస్థితులు, వారాహి యాత్ర 5వ దశ, జనసేన - టీడీపీ సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశ నిర్వహణ అంశాలపై పవన్ కల్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సుదీర్ఘంగా చర్చించారు.
![Pawan Kalyan: నెక్స్ట్ ఏం చేద్దాం? నేతలతో జనసేనాని పవన్ కళ్యాణ్ సమీక్ష Pawan Kalyan Meeting With Janasena Party Leaders Pawan Kalyan: నెక్స్ట్ ఏం చేద్దాం? నేతలతో జనసేనాని పవన్ కళ్యాణ్ సమీక్ష](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/17/ec3499c15f914330384f40287725ab5f1697557818908798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వారాహి యాత్ర 5వ దశ నిర్వహణ, జనసేన - తెలుగుదేశం సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశ నిర్వహణ అంశాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సుదీర్ఘంగా చర్చించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఈ భేటీ జరిగింది. కార్యక్రమానికి పలువురు జనసేన నాయకులు హాజరయ్యారు.
రైతుల సమస్యలపై చర్చ
రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు, సాగు నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల కృష్ణా పశ్చిమ డెల్టాలో 4 లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశం చర్చకు వచ్చింది. రైతుల పక్షాన నిలవాలని, అందుకు చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని జనసేన నేతలకు పవన్ సూచించారు. ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జన సైనికులు, వీర మహిళలపై అక్రమంగాపెడుతున్న కేసులు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి.
త్వరలోనే ఐదో దశ వారాహి యాత్ర
గత నెలలో పవన్ నాలుగో విడుత వారాహి యాత్ర జరిగింది. సెప్టెంబర్ 21న అవనిగడ్డ నుంచి యాత్ర ప్రారంభమై 26వ తేదీ వరకు నాలుగు నియోజకవర్గాల్లో నిర్విరామంగా జరిగింది. మూడో విడత యాత్ర విశాఖపట్నంలో జరిగింది. ఉభయగోదావరి జిల్లాలో రెండు విడతలుగా పవన్ వారాహి విజయయాత్ర చేపట్టారు. తాజాగా ఐదో విడత యాత్రకు పవన్ సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. యాత్ర షెడ్యూల్, ఎప్పుడు, ఎక్కడ ఉంటుందనే విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నాయి.
పలువురికి పదవులు
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా పడాల అరుణకు అవకాశం కల్పించారు. అలాగే పలు విభాగాలకు బాధ్యులను, ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు, రెండు నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించారు. మరికొందికి కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులుగా అవకాశం కల్పించారు. ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పంచకర్ల రమేష్ బాబు, క్రియాశీలక సభ్యుల శిక్షన విభాగం చైర్మన్‌గా ఈదర హరిబాబు, ప్రొటోకాల్ విభాగం చైర్మన్‌గా మల్లినీడి తిరుమల రావు, ఉంగుటూరు అసెంబ్లీ ఇన్ చార్జిగా పత్సమట్ల ధర్మరాజు, ఉండి ఇంచార్జిగా జుత్తిగ నాగరాజు, రాష్ట్ర కార్యదర్శులుగా ఆమంచి శ్రీనివాసులు, పిసిని చంద్రమోహన్, రత్నం అయ్యప్ప, గెడ్డం మహాలక్ష్మి, ప్రసాద్, చాగంటి మురళీ కృష్ణ, మండలి రాజేష్‌ను నియమించారు. సంయుక్త కార్యదర్శులుగా చిత్తలూరు సుందర రామిరెడ్డి, యడ్లపల్లి రాం సుధీర్, పాతూరు నారాయణ స్వామి మహేష్, మేడిశెట్టి సూర్య కిరణ్‌కు బాధ్యతలు అప్పగించారు.
జగన్‌పై విమర్శలు
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి అని పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. సీఎం అనాలోచిత నిర్ణయాలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలుయ్యాయని విమర్శించారు. గుంటూరులో సోమవారం మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జగన్ నాలుగేళ్ల పాలనతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయని అన్నారు. రైతులు చితికిపోయారని, వారికి అండగా నిలిచేందుకు టీడీపీతో కలిసి జనసేన పోరాటం చేస్తుందన్నారు. వ్యవసాయరంగం అధ;పాతాళానికి పడిపోయిందని, కృష్ణా పశ్చిమ డెల్టాకు రైతులకు సకాలంలో నీరివ్వక పోవడంతో 4 లక్షల ఎకరాల మేర పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. పులిచింతల, పట్టిసీమ నీరును ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎందుకంటే సీఎంకు నీటిపారుదల శాఖపై పట్టు లేదని విమర్శించారు.
కోడి గుడ్డు మంత్రికి, సీఎం ఇన్ఫోసిస్ తో సంబంధం ఏంటి?
విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్ మెంట్ సెంటర్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించడంపై నాదెండ్ల సటైర్ వేశారు. కోడి గుడ్డు మంత్రికి, సీఎం జగన్ కు ఇన్ఫోసిస్ కార్యాలయంతో సంబంధం ఏంటని నాదెండ్ల ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఇన్ఫోసిస్ ఉద్యోగులు వారంలో 2 రోజులైనా ఆఫీసుకు వచ్చి పని చేసుకుంటారని దీన్ని నిర్మించారు. 250 నుంచి 300 మంది ఉద్యోగులు వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటారు. కానీ మీరేదే రాష్ట్రానికి ఇన్ఫోసిస్ తీసుకొచ్చారనేలా వైసీపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారంటూ నాదెండ్ల మండిపడ్డారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)