News
News
వీడియోలు ఆటలు
X

Tigers Wandering: పల్నాడును వణికిస్తున్న పులులు, పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు

దుర్గి మండలం మాచర్ల, వినుకొండ ఫారెస్ట్ రేంజ్ ప్రాంతంలో ప్రజలు అయితే కంటి‌ మీద కునుకు తీయడానికే భయపడుతున్నారు.

FOLLOW US: 
Share:

గుంటూరు... పల్నాడు ప్రాంతంలో పులుల కదలికలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దుర్గి మండలం మాచర్ల, వినుకొండ ఫారెస్ట్ రేంజ్ ప్రాంతంలో ప్రజలు అయితే కంటి‌ మీద కునుకు తీయడానికే భయపడుతున్నారు. పులి‌ దాడి చేసి ఆవును చంపిన గజాపురం అడవీ ప్రాంతం డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళి అటవీ శాఖ అధికారులు పులి‌ కదలికలపై నిఘా కెమెరా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. డీఎఫ్ఓ రామచంద్రరావు ఆధ్వర్యంలో పలు వాహనాలలో ఫారెస్ట్ సిబ్బంది అటవీ ప్రాంతానికి వెళ్లారు. గతంలో కాకినాడ జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కొన్నిచోట్ల పులల సంచారించడం తెలిసిందే. బెంగాల్ టైగర్ వచ్చిందని సైతం స్థానికంగా ప్రచారం జరిగింది. 

ట్రాప్ కెమెరాలు ఏర్పాటు
దుర్గి మండలం గజాపురం అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. గత నెల 21వ తేదీన గజాపురం వద్దే ఆవుపై పులులు దాడి చేశాయి.  కాకిరాల బీట్ లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ‌పులులు నీటి తావుల వద్దకు వచ్చే అవకాశం ఉండటంతో ఫారెస్ట్ అధికారులు అక్కడ ట్రాప్ కెమెరాలను పెట్టారు.

పల్నాడు అటవీ ప్రాంతంలో పులుల సంచారం 
పల్నాడుజిల్లాలలో టైగర్ టెన్షన్ మొదలైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ అభయారణ్యంలోని పులులు పల్నాడు జిల్లా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించాయని అధికారులు చెబుతున్నారు. దీంతో జనావాసాల్లోకి వస్తాయనే భయంతో ఉన్నారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేయడంతో మరింక కంగారు పడుతున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ అటవీ ప్రాంతంలో పులుల సంతతి వృద్ధి చెందింది. వాటి సంఖ్య 73కి పెరిగింది. దీంతో అవి తిరిగేందుకు ఆ ప్రాంతం సరిపోవడం లేదు. అందుకే అవి పల్నాడు జిల్లా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించాయి. 

దుర్గి, మండలంలోకి రెండు పులులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. బొల్లాపల్లి, కారంపూడి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఇవి మ్యాన్‌ ఈటర్స్ కావని కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నా ప్రజల్లో మాత్రం భయాందోళన కనిపిస్తున్నాయి. టైగర్స్‌ను ఇబ్బంది పెట్టి వాటిని గందరగోళ పరచొద్దని అధికారులు హితవు పలుకుతున్నారు. 

పల్నాడు అటవీ ప్రాంతంలోకి వచ్చిన పులులు జనావాసాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే సుమారు 45 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉన్నందున కంచె వేసేందుకు వీల్లేదని అంటున్నారు. అందుకే అటవీ జంతువులు గ్రామాల్లోకి రాకుండా పెద్ద పెద్ద గుంతలు తవ్వినట్టు చెబుతున్నారు. అందులో నీళ్లు కూడా పోయిస్తున్నామన్నారు. 

Published at : 06 May 2023 08:09 PM (IST) Tags: AP Latest news Telugu News Palnadu Guntur Tiger

సంబంధిత కథనాలు

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

Coromandel Train Accident : ఒడిశా ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు

Coromandel Train Accident : ఒడిశా  ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశా దుర్ఘటనకు కారణాలేంటి? ఈ 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?

Odisha Train Accident: ఒడిశా దుర్ఘటనకు కారణాలేంటి? ఈ 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం

YS Viveka Case : సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి - అరెస్ట్ భయం లేనట్లే !

YS Viveka Case :  సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి - అరెస్ట్ భయం లేనట్లే !