News
News
X

MP Raghu Rama: విశాఖలో భూకబ్జాలు...రాష్ట్రంలో రివర్స్ రూలింగ్...ఏపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామ కామెంట్స్

ఏపీ పాలిటిక్స్‌లో ఎంపీ రఘురామ కృష్ణ రాజు హాట్ టాఫిక్. ఎంపీ విజయసాయి బెయిల్ రద్దుపై రఘురామ వేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. ఇదిలా ఉంటే ఆయన తాజాగా ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

FOLLOW US: 

ఏపీలో రివర్స్ పాలన నడుస్తోందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ విశాఖ నగరంలో కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. అలాగే ఏపీ నుంచి హైదరాబాద్‌కు వలసలు సైతం పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు విడిచి పోతున్నాయని, కొత్తగా పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఏపీలో శాంతిభద్రతలు లేవని ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయ నేతల మెప్పు కోసం అధికారులు తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదని ఎంపీ రఘురామ కృష్ణ రాజు అన్నారు. ఢిల్లీలో మాట్లాడిన ఆయన కర్నూలు జిల్లాలోని ఓ పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మించిన అంశంలో ఐఏఎస్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తామించారు. అధికారులు తప్పును తప్పుగా చెప్పాలన్నారు. అలా కాకుండా అత్యుత్సాహం వ్యవహరిస్తే భవిష్యత్ తప్పనిసరిగా శిక్ష తప్పదని హెచ్చరించారు. 

విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా

విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులకు సంబంధించి కౌంటరు దాఖలు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డిని సీబీఐ కోర్టు ఆదేశించింది. కౌంటరు దాఖలు చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ గడువు కోరింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈనెల 13 వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది సీబీఐ కోర్టును కోరారు. 

విజయసాయి రెడ్డి ఎంపీ హోదాలో కేంద్ర హోంమంత్రి, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయాల్లో అధికారులను తరచూ కలుస్తూ, తనకు కేంద్ర మంత్రులతో సంబంధాలున్నాయనే విధంగా సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తు్న్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి ఎంపీ కాగానే జగన్‌ లెక్కకు మించిన ఆదాయం కేసులో ప్రధాన దర్యాప్తు అధికారి ఉన్న అధికారిని సీబీఐ జేడీగా నియమించవద్దని అభ్యంతరం వ్యక్తంచేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇది విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఎంపీ రఘురామ తన పిటిషన్‌లో ఆరోపించారు.

Also Read: YSR Nethanna Nestham Scheme: నేతన్న నేస్తం మూడో విడత సాయం విడుదల... 80 వేల లబ్ధిదారుల అకౌంట్లలో రూ.192 కోట్లు జమ

Also Read:   Candidates Criminal Record: నేతల నేర చరిత్ర 48 గంటల్లోగా ప్రకటించండి.. రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం

Also Read: AP Inter College Reopen: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కరోనా నిబంధలు వచ్చేశాయి... ఈ రూల్స్ పాటించకుంటే సమస్యలు తప్పవు

Published at : 10 Aug 2021 02:46 PM (IST) Tags: AP News AP political news MP Raghu Rama MP Vijay sai reddy bail news MP Raghu Rama Krishna Raju News Vijay sai reddy News

సంబంధిత కథనాలు

Crime News :  బెజవాడలో కాల్‌మనీ కలకలం - టీడీపీ కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్ !

Crime News : బెజవాడలో కాల్‌మనీ కలకలం - టీడీపీ కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్ !

YSRCP Vs Janasena : వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్‌ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !

YSRCP Vs Janasena :  వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్‌ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !

AP Teachers : "మిలియన్ మార్చ్" నిర్వీర్యం కోసమే టార్గెట్ చేశారా ? ఏపీ టీచర్లు ప్రభుత్వంపై ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు ?

AP Teachers :

AP 10th Supply Students: టెన్త్ సప్లిమెంటరీ విద్యార్థులకు గుడ్ న్యూస్, వారికి ఛాన్స్ ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున నిర్ణయం

AP 10th Supply Students: టెన్త్ సప్లిమెంటరీ విద్యార్థులకు గుడ్ న్యూస్, వారికి ఛాన్స్ ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున నిర్ణయం

YSR Nethanna Nestham: గుడ్‌న్యూస్! వీళ్ల అకౌంట్స్‌లోకి 24 వేలు, బటన్ నొక్కనున్న సీఎం జగన్ - ఎప్పుడంటే

YSR Nethanna Nestham: గుడ్‌న్యూస్! వీళ్ల అకౌంట్స్‌లోకి 24 వేలు, బటన్ నొక్కనున్న సీఎం జగన్ - ఎప్పుడంటే

టాప్ స్టోరీస్

TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

TS Congress  : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Anantapur Crime News :  బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !

KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !