News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

MP CM Ramesh: ఏపీ పోలీసులపై కేంద్రం డేగకన్ను, త్వరలోనే అదంతా జరుగుతుంది.. సీఎం రమేశ్ సంచలనం

అమరావతిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సీఎం రమేశ్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏపీ పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

FOLLOW US: 
Share:

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఆంధ్రప్రదేశ్‌లోని పోలీస్ వ్యవస్థపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం టెలిస్కోపుతో చూస్తుందని అన్నారు. అతి త్వరలోనే పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పోలీసు ఉన్నతాధికారుల తీరు సరిగ్గా లేదని, వ్యవస్థలు ముఖ్యం అనే విషయాన్ని వారు ఎందుకు మర్చిపోతున్నారని ప్రశ్నించారు. అందుకే, అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్ అధికారులను రీ కాల్ చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. అమరావతిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సీఎం రమేశ్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే తాజా వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పోలీసు ఉన్నతాధికారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో చూశామని గుర్తు చేశారు. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే రానున్నట్లు చెప్పారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగమే వెసులుబాటు కల్పించిందని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అవినీతి కార్యక్రమాలపై ఈ నెల 28వ తేదీన బీజేపీ సభ నిర్వహిస్తోందని రమేష్ వివరించారు. వైఎస్ జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి.. మెల్లగా అర్థం చేసుకుంటారని బీజేపీ ఇన్నాళ్లూ వేచి ఉందని, ఇకపై చర్యలు చూస్తారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అవినీతిపై ఈ నెల 28న బీజేపీ సభ నిర్వహించనుందని ఎంపీ సీఎం రమేశ్ ప్రకటించారు. 

సినిమా టికెట్ల ధరలపై ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రాముఖ్యం ప్రజా సమస్యలపై ఎందుకు లేదని నిలదీశారు. సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపుపై థియేటర్ యజమానులు కోర్టుకు వెళ్తే, హాళ్లను సీజ్ చేయిస్తారా అంటూ మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలు ఎంత ఉన్నాయి? అక్కడి విధానం ఏంటో ఓసారి చూడాలని సూచించారు. ఎవరినో దృష్టిలో పెట్టుకుని సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తారా? అని ప్రశ్నించారు.

Also Read: Ramana Deekshitulu : స్వామీ.. కోర్టుకెళ్లి తేల్చుకుందామా ? టీటీడీపై మళ్లీ ట్వీటెత్తిన రమణదీక్షితులు !

రాష్ట్రంలో రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బ తిన్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇసుక అందుబాటులో లేదని.. సిమెంట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని రమేష్ డిమాండ్ చేశారు. దశలవారీ మద్య నిషేధం కాకుండా.. దశలవారీ మద్యపాన వినియోగాన్ని జగన్ ప్రభుత్వం ప్రొత్సహిస్తోందని ఎద్దేవా చేశారు. ఏపీలో జరిగే ప్రతి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే నడుస్తోందని అన్నారు. గ్రామ సచివాలయాల నిర్మాణం కూడా కేంద్రం నిధులతోనే చేపట్టారని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల నిర్మాణం బిల్లులు కూడా ఇవ్వలేదని తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు.. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదని.. రెండున్నర ఏళ్లల్లో స్టీల్ ఎలా ఉత్పత్తి చేస్తారని అడిగారు.

Also Read: Prakasam: భార్యను తన దగ్గరికి పంపాలని భర్తకు ఫోన్, కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు.. అది తెలిసి దాష్టీకం

Also Read:  సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే అవమానం ఎలా అవుతుంది... థియేటర్లపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం లేదు... హీరో నానికు మంత్రి బొత్స కౌంటర్

Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Dec 2021 12:47 PM (IST) Tags: amaravati ap police Andhra pradesh police MP CM Ramesh BJP MP CM Ramesh CM ramesh Comments

ఇవి కూడా చూడండి

KarimnagarAssembly Election Results 2023: కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!

KarimnagarAssembly Election Results 2023: కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!

Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!

Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!

Trains Cancelled: విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు- ప్రత్యేక ట్రైన్స్‌ గడువు పొడిగింపు

Trains Cancelled: విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు- ప్రత్యేక ట్రైన్స్‌ గడువు పొడిగింపు

Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు

Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు

RK Roja: ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ - 51 రోజుల్లో 3 లక్షల మ్యాచ్‌లు, కీలక వివరాలు చెప్పిన మంత్రి రోజా

RK Roja: ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ - 51 రోజుల్లో 3 లక్షల మ్యాచ్‌లు, కీలక వివరాలు చెప్పిన మంత్రి రోజా

టాప్ స్టోరీస్

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
×