Ambati Rambabu: చంద్రబాబు, పవన్ ఇంటిమీద కూడా జగన్ స్టిక్కర్లు వేస్తాం: మంత్రి అంబటి రాంబాబు
Minister Ambati Rambabu: చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ఇంటి మీద కూడా వారి అనుమతితోనే జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు అతికిస్తామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
Minister Ambati Rambabu: వైసీపీ ప్రభుత్వం చేపట్టిన "జగనన్నే మా భవిష్యత్తు" ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి కుటుంబం మేలు గురించి వివరాలు సేకరించి బాధితులకు భరోసా నిలబడేందుకే ఈ కార్యక్రమం అని వివరించారు. ప్రజల ఆశీస్సులు కోరి లబ్ది జరిగితేనే.. ఓటు వేయమని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కుల మతాలకు అతీతంగా పరిపాలన చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అంటూ ప్రశంసలు కురిపించారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక సీఎం కూడా జగన్ అంటూ కొనియాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 96 శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారన్నారు. గత ప్రభుత్వంలో హామీలు, పథకాలు అమలు చేయకుండా మాజీ సీఎం చంద్రబాబు మాట తప్పారని ఆరోపించారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల ఇంటి మీద కూడా వారి అనుమతితోనే జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు వేస్తామన్నారు. ప్రజలకు మేలు చేసిన తర్వాతే తాము ఓటు వేయమని అడుగుతున్నట్లు వెల్లడించారు.
"ఈనెల 7వ తారీఖు నుంచి ఈనెల 20 తేదీ వరకు క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. దాని పేరు జగనన్నే మా భవిష్యత్తు అనేటువంటి నినాదంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 7 లక్షల మంది కార్యకర్తలు.. గృహసారథులు అయితేనేమీ, కౌన్సిలర్లు అయితేనేమీ వాలంటీర్లు అయితేనేమీ. వీళ్లందరూ ఒక లక్షా 60 వేల గృహాలకు.. ప్రతీ ఇంటికీ వెళ్లి ఆ ఇంట్లో కుటుంబ సభ్యులను పరామర్శించి, మాట్లాడి.. ఈ నాలుగు సంవత్సరాల కాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏమేం సాయం చేసిందో, మొత్తంగా చెప్పడం.. ఆ కుటుంబానికి ఏ విధంగా మేలు జరిగిందో ప్రాక్టికల్ గా తెలుసుకోవడం ఒకటి.
రెండవది.. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి, మెరుగైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేకమైన కుటుంబానికి అందాయి అని వారిని అడిగి.. వారి నోటి ద్వారా తెలుసుకొని, వాది ద్వారా అప్రియేషన్ పొంది మాకు సంబంధించినటువంటి ఒక నంబర్ కు 8296082960కి వారు అనుమతితో వారి ద్వారా వారి సెల్ నుంచి మిస్డ్ కాల్ ఇప్పించేటువంటి కార్యక్రమం." - మంత్రి అంబటి రాంబాబు
"ప్రతీ ఇంటికీ వెళ్తాం. ఒక్కో ఇంట్లో 15 నిమిషాల నుంచి గంటసేపు ఉండి వారితో సంభాషిస్తాం. వారి డోర్ మీద వారి అనుమతితో జగన్ మోహన్ రెడ్డి గారి స్టిక్కర్ అంటిస్తాం. వారి సెల్ మీద వారి అనుమతితో జగన్ మోహన్ రెడ్డి స్టిక్కర్ అంటిస్తాం. చిత్తశుద్ధిగా పరిపాలన చేశాం. చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తున్నాం. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా సామాన్యుడైనటువంటి పేద వాడిని ఆదుకోవాలని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి లంచాలు లేకోకుండా అమలు చేస్తున్న సీఎం.. జగన్ మోహన్ రెడ్డి. 96 శాతం వాగ్ధానాలను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. మాకే ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉంది. ఏ రాజకీయ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు." - మంత్రి అంబటి రాంబాబు