News
News
X

సర్వేలతో చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్- ఆయనకు మిగిలింది ఒకే దారి: అంబటి రాంబాబు

25కు 25 ఎంపీ స్థానాలు వైసీపీ గెలవబోతుందని... అందుకే చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్‌ పెరిగిపోతుందన్నారు మంత్రి రాంబాబు.

FOLLOW US: 

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుకు ఇక రిటైర్మెంట్ ఒక్కటే మిగిలిందని మంత్రి అంబ‌టి రాంబాబు సెటైర్లు వేశారు. ప్రజలు చెప్పులతో కొట్టారు కాబట్టే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నార‌ని కామెంట్ చేశారు. బాబు పుత్రుడిని ఒక  చోట దత్తపుత్రుడుని రెండు చోట్ల ప్రజలు ఓడించారని అంబ‌టి ఎద్దేవా చేశారు. అధికారం పోయిం ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు బాబుకు అంబేడ్కర్, సమ సమాజం గుర్తొకు వస్తున్నాయన్నారు.

ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నప్పుడే కులాలపై చంద్రబాబు మనస్తత్వమేంటో అర్థమైందని అంబటి రాంబాబు కామెంట్ చేశారు. 25కు 25 ఎంపీ స్థానాలు తాము గెలవబోతున్నామని... అందుకే ఫ్రస్ట్రేషన్‌తో చంద్రబాబు మాట్లాడుతున్నార‌ని అన్నారు. పోలవరంపై తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పారిపోయే పిరికిపంద బాబు అని ఎద్దేవా చేశారు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టు మాధవ్ ఫేక్ వీడియో చుట్టే బాబు నీచ రాజకీయం చేస్తున్నార‌ని అన్నారు.

ఈ మధ్య కాలంలో జాతీయ స్థాయిలో మూడో, నాలుగు సర్వేలు వచ్చాయని... అవి దేశవ్యాప్తంగా సర్వే చేసి రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని అంచనాలు వేశాయన్నారు రాంబాబు. ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంట్‌ స్థానాల్లో 18 నుంచి 23 సీట్లు వరకూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్సార్‌సీపీ గెలిచే అవకాశం ఉందన్నారు. కేవలం 2 -3 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలు చెప్పాయని వివరించారు. ఆ సర్వేలను తాను చూశానని... అయితే అవి పూర్తి వాస్తవాలుగా అనిపించడం లేదన్నారు. గడప గడప కార్యక్రమానికి వెళ్లామని..ప్రజల మధ్య తిరుగుతున్నామని స్పందన చూశామని వెల్లడించారు. 23 సీట్లే కాదు 25 పార్లమెంటు సీట్లను కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి తెలిపారు. 

బాబుకు రిటైర్మెంట్ ఒక్కటే మార్గం

బాబు వయసు 75 ఏళ్ళు.. వాళ్ల అబ్బాయిని మొన్న అసెంబ్లీకి రాకుండా ప్రజలు ఓడించారని ఎద్దేవా చేశారు రాంబాబు. ఇక చంద్రబాబు దత్తపుత్రుడు అసెంబ్లీకి అడుగుపెట్టాలని రెండు చోట్ల పోటీ చేశారు కానీ రెండుచోట్లా ఓడించారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ సర్వేలు చెప్పినట్లు వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందన్నారు. చంద్రబాబు ఓడిపోతే రిటైర్మెంట్‌ తప్ప మరో మార్గమే లేదని తెలిసిన తర్వాత ఫ్రస్ట్రేషన్‌లో ఏదేదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 

అధికారం పోయాక బాబుకు అంబేడ్కరిజం గుర్తొస్తుంది
చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని 14ఏళ్లు పాలించారని... 44 ఏళ్ల రాకీయ జీవితంలో హఠాత్తుగా సమసమాజం, అంబేద్కరిజం గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు రాంబాబు. అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఈవేమీ గుర్తుకురాలేదన్నారు. టీడీపీ హయాంలో ఆలయ కమిటీల్లోనూ, మార్కెట్‌ యార్డుల్లోనూ, కార్పొరేషన్లలోనూ, వివిధ కార్పొరేషన్ పదవుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలనే జ్ఞానమే ఆయనకు లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సుజనా చౌదరి, రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌నాయుడు చంద్రబాబుకు గుర్తుంటారన్నారు. అదే అధికారం పోయేసరికి అంబేద్కర్‌గారి ఆశయాలు, సమసమాజం గుర్తుకు వస్తున్నాయన్నారు. . 

కులాల పట్ల బాబు మనస్తత్వం ఇది
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఒక్కమాటతోనే కులాల పట్ల ఆయనకు ఉన్న అవగాహన, అభిప్రాయం, ఆయన మనస్తత్వం ఏంటో చాలా స్పష్టంగా అర్థమైందన్నారు రాంబాబు. ఈ విషయాన్ని ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలని అనుకుంటారా అని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మాట్లాడారంటే కుల అహంకారం, కులాల పట్ల ఆయన మనస్తత్వం ఏంటో అర్థం అవుతుందని వివరించారు. అగ్ర కుల అహంకారంతో పరిపాలన చేసిన పెద్దమనిషి చంద్రబాబు అని... అలాంటి ఆయన ఇవాళ కులాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని అంబ‌టి విమర్శించారు. 

Published at : 20 Aug 2022 06:14 PM (IST) Tags: YSRCP ambati rambabu chandra babu TDP

సంబంధిత కథనాలు

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

RK Roja On Balakrishna: ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌నన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్

RK Roja On Balakrishna: ప్లూటు బాబు ముందు ఊదు, జ‌గ‌నన్న ముందు కాదు - బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

YSRCP Politics : వైఎస్ఆర్‌సీపీలో పర్యవేక్షకుల పంచాయతీ ! అన్ని నియోజకవర్గాలకా ? కొన్నింటికేనా ?

YSRCP Politics :  వైఎస్ఆర్‌సీపీలో పర్యవేక్షకుల పంచాయతీ ! అన్ని నియోజకవర్గాలకా ? కొన్నింటికేనా ?

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల