AP Liquor Scam: మిథున్ రెడ్డి పావు మాత్రమే, ఏపీ లిక్కర్ స్కామ్ మాస్టర్ మైండ్ జగన్: మాణికం ఠాగూర్
AP Liquor Scam case | ఏపీ లిక్కర్ స్కామ్ వైఎస్ జగన్ మోహ్ రెడ్డి ఓ ప్లాన్ ప్రకారం చేసిన సైంటిఫిక్ కరప్షన్ అని రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ అన్నారు.

YS Jagan Mohan Reddy in AP Liquor Scam | అమరావతి: ఏపీ లిక్కర్ స్కాంలో వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఓ పావు మాత్రమేనని, మాస్టర్ మైండ్ వైఎస్ జగన్, భారతి అని కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ ఆరోపించారు. వైఎస్ జగన్ లిక్కర్ మాఫియా ఆంధ్రప్రదేశ్‌లో కోటి పేద కుటుంబాల జీవితాలను నాశనం చేసిందని ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ తీవ్ర ఆరోపణలు చేశారు. విశ్వసనీయ మద్యం బ్రాండ్ల స్థానంలో తక్కువ గ్రేడ్ మద్యంతో పాటు హానికరమైన బ్రాండ్లు వచ్చాయన్నారు. అదంతా ₹3,200 కోట్ల డబ్బుల కోసమే అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదే డబ్బును ఎన్నికల్లో ఓట్లను కొనేందుకు ఖర్చు చేశారని పేర్కొన్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన మిధున్ రెడ్డి కేవలం ఓ పావు మాత్రమే. అసలు సూత్రధారులు ఎవరంటే మిస్టర్ & మిసెస్ జగన్. ఇది అనుకోకుండా జరిగిన స్కామ్ కాదు. ఇది జగన్ ఓ పద్దతి ప్రకారం ప్లాన్ చేసిన అవినీతి. ఇది జగన్ టాప్-డౌన్ ఆపరేషన్.. సైంటిఫిక్ కరప్షన్ - మాణికం ఠాగూర్
- లిక్కర్ బ్రాండ్లు ఒడిసి పట్టుకున్నారు
- పంపిణీ నెట్‌వర్క్ ఫిక్స్ చేసుకున్నారు
- కిక్‌బ్యాక్‌లు ముందస్తుగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు
- నకిలీ సంస్థలు క్రియేట్ చేశారు
- దోపిడీని చట్టబద్ధం చేయడానికి లిక్కర్ పాలసీ విధానాన్ని తీసుకొచ్చారు
Jagan Mohan Reddy’s liquor mafia devastated one crore of poor families in Andhra Pradesh. Trusted liquor brands were replaced with low-grade, harmful ones — all for ₹3,200 Cr in bribes.
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) July 20, 2025
Midhun Reddy is just a pawn.
The real masterminds?
Mr & Mrs Jagan #LiquorScam #YSRCPScam… pic.twitter.com/Ha54zZIUvN
లిక్కర్ స్కామ్ ఎలా వర్కౌట్ అయిందంటే..
1. జగన్ పార్టీ వైసీపీ నేతలు మద్యం సరఫరాదారులతో సమన్వయం చేసుకున్నారు.
2. ఇదివరకే ఉన్న లిక్కర్ బ్రాండ్స్, విశ్వసనీయ మద్యం బ్రాండ్‌లను రాష్ట్రంలో లేకుండా చేశారు.
3. వారి బినామీల యాజమాన్యంలో వారి సొంత, తెలిసిన బ్రాండ్లును ఏపీలోకి తీసుకొచ్చారు
4. వైసీపీ తెచ్చిన బ్రాండ్లను రాష్ట్ర రిటైల్ ద్వారా అధిక ధరలకు విక్రయాలు జరిపారు
లాభం మార్జిన్..
- కల్తీ బ్రాండ్స్ అయినా ధరలు కృత్రిమంగా పెంచారు.
- నకిలీ ఇన్‌వాయిస్‌లు & సేవా ఒప్పందాల ద్వారా కమీషన్లు ఇచ్చారు.
- మనీ లాండరింగ్ చేయడానికి హైదరాబాద్, బెంగళూరుతో పాటు విశాఖపట్నంలలో షెల్ కంపెనీలను ప్రారంభించారు.
- రవా, గిడ్డంగుల (warehousing) ఒప్పందాలను కూడా ప్రాక్సీ సంస్థలకు ఇచ్చారు. వీటిని లాజిస్టిక్స్ ఖర్చులుగా చూపించారు. నిజానికి అవి ప్రజా ధనాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు మార్గాలు.
3 సమూహాలకు ప్రయోజనం చేకూర్చడానికి
1. మిస్టర్ అండ్ మిసెస్ జగన్
2. కొందరు మంత్రులు
3. వారితో సన్నిహితంగా మెలిగే కాంట్రాక్టర్లు
2020 నుంచి 2024 మధ్య కనీసం ₹3,200 కోట్లు మళ్లించారని SIT అధికారులు చెబుతున్నారు. 2024 ఎన్నికల ప్రచారంలోకి ఈ నగదు వినియోగించారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గాలలో నగదు, ఉచిత మద్యం పంపిణీ చేశారు. ఓటు కొనుగోలు, బూత్ నిర్వహణ కోసం వాడారు
చాలా వరకు నకిలీ మద్యం బ్రాండ్‌లకు తయారీ మౌలిక సదుపాయాలు కూడా లేవు. కానీ వారు లైసెన్స్‌లు తీసుకున్నారు. షాడీ బాట్లింగ్ యూనిట్ల నుండి నిర్వహించారు. కొన్ని రోజులు అలాగే ఉండటానికి రోజుకు లక్షలు లంచాలు ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి పేరు చీఫ్ ఆపరేటర్‌గా రికార్డులో ఉంది. ఎక్సైజ్ శాఖ, రాజకీయ కార్యాలయాల మధ్య సమన్వయం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.
వేల కోట్ల స్కామ్ కేసులలో ప్రధాన నిందితుడు
ఇది జగన్ మొదటి స్కామ్ కాదు. సీబీఐ దాఖలు చేసిన ₹43,000 కోట్ల అక్రమ ఆస్తుల కేసులో ఆయన ప్రధాన నిందితుడు. జగన్ 2012లో అరెస్టు అయ్యి 16 నెలలకు పైగా జైలు జీవితం గడిపారు. జగన్‌కు అవినీతి కొత్త కాదు. ఆయన విధానం అదే. మద్యం కుంభకోణం జగన్ అవినీతిలో తాజా పరిణామం. ఇసుక మాఫియా, మైనింగ్, భూ కేటాయింపు కుంభకోణాలు, అమరావతి చుట్టూ ఇన్‌సైడర్ ట్రేడింగ్, తాజాగా ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టి మద్యం ద్వారా దోపిడీ చేశారు. బాధితులు ఎవరంటే పేదలు, ఓటర్లు’ అని మాణికం ఠాగూర్ మాజీ సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు.






















