అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Stone Attack: సీఎంపై రాయిదాడి ఘటనలో ఎన్నో అనుమానాలు, అదే టైంలో కరెంట్ ఎందుకు పోయిందో?

AP News Latest: ముఖ్యమంత్రి కోసం భద్రత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ రాయి దాడి ఎలా జరిగిందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం పర్యటన ఉన్నా కూడా కరెంటు తీసేయడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి.

Vijayawada News: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్‌ నగర్‌లో ఎన్నికల రోడ్ షో చేస్తుండగా రాయి దాడి జరిగింది. జగన్ ఉన్న వాహనం చుట్టూ ఉన్న జనంలోని ఓ వ్యక్తి ముఖ్యమంత్రిని గురి చూసి రాయితో కొట్టాడని భావిస్తున్నారు. దీంతో సీఎం ఎడమ కంటి పై భాగంలో గాయం అయింది. దాడి కోసం వినియోగించిన వస్తువు క్యాట్ బాల్ అయి ఉంటుందని భావిస్తున్నారు. సీఎం పక్కనే ఉన్న వైసీపీ సెంట్రల్‌ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌కు కూడా రాయి తగిలి స్వల్ప గాయం అయింది.

ముఖ్యమంత్రి కోసం భద్రత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ రాయి దాడి ఎలా జరిగిందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎంకు భద్రత కోసం ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ), సీఎం సెక్యూరిటీ గ్రూపు (సీఎంఎస్‌జీ), క్లోజ్‌ ప్రాక్సిమిటీ గ్రూప్‌, ఎస్కార్ట్‌, ఇన్నర్‌ కార్డన్‌, ఔటర్‌ కార్డన్‌ లాంటి రకరకాల భద్రతా వ్యవస్థలు ఉంటాయి. వీళ్లే వందల సంఖ్యలో ఉంటారు. వీరు కాక, ముఖ్యమంత్రి వచ్చిన ప్రదేశానికి చెందిన స్థానిక పోలీసులు కూడా భద్రత కల్పిస్తుంటారు. ఈ స్థాయి భద్రతలోనూ సీఎంపైకి గురి చూసి బలంగా రాయి విసిరి, గాయం చేయగలిగారంటే భద్రతాపరమైన లోపాలపై ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. 

మరో ముఖ్యమైన అంశం.. ఆ ప్రాంతంలో పవర్ కట్ ఉండడం. ఆ ప్రాంతం గుండా ముఖ్యమంత్రి పర్యటన అనేది ముందస్తుగా ఫిక్స్ అయిన కార్యక్రమం. అలాంటప్పుడు అక్కడ పవర్ కట్ ఎలా చేస్తారనే ప్రశ్న ఉదయిస్తుంది. సీఎం పర్యటన ఉంటే విద్యుత్తు సరఫరాకు అంతరాయం రాకుండా ముందే చూసుకోవాల్సి ఉంది. 

ముఖ్యమంత్రి బహిరంగ ప్రదేశాల్లో జనాల మధ్యలో ఉండగా.. ఆయన చుట్టూ ఉండే సెక్యూరిటీతో పాటు కాస్త దూరంగా ఉండే భద్రతా సిబ్బంది కళ్లు అదే పనిగా ప్రజలపైనే ఉంటాయి. జగన్‌పైకి రాయి వేసినప్పుడు వారు ఎందుకు గమనించలేదనే అనుమానం వ్యక్తం అవుతోంది. అయితే, వీరు పసిగట్టకుండా ఉండేందుకే కరెంటు కట్ చేశారని కూడా ఓ వాదన ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget