అన్వేషించండి

Lokesh Latest News: వీడిన నారా లోకేశ్ పూజ గదిలోని బొమ్మ మిస్టరీ! క్షుద్ర పూజలంటూ వస్తున్న విమర్శలపై మంత్రి వివరణ! 

Lokesh Latest News: సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటివి వైరల్ అవుతాయో తెలియదు. అలాగే లోకేష్ పెట్టిన ఉగాది పూజ ఫొటోలోని ఓ మిస్టరీ బొమ్మపై చర్చ జరిగింది. విమర్శలు ఎదురయ్యాయి. ఇంతకీ ఆ బొమ్మ ఏంటీ?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఉగాది సందర్భంగా లోకేష్, దేవాన్ష్ పూజ గది ఫోటోలు వివాదాస్పదం అయ్యాయి.
  • పూజ గదిలోని శివుని బొమ్మపై రాజకీయ విమర్శలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి.
  • దేవాన్ష్ నాలుగేళ్ల వయసులో చేసిన శివుని బొమ్మ అని లోకేష్ వివరణ ఇచ్చారు.
  • కుమారుడి భక్తితో చేసిన జ్ఞాపకమని, దీనిపై వివరణ అవసరం లేదన్నారు.

Lokesh Latest News: తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా చేసుకున్నారు. కొత్త సంవత్సరం మనందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పూజలు నిర్వహించారు. వాటి ఫొటోలను స్టాటస్‌లు, సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకున్నారు. ఆ ఫొటోలను షేర్ చేసుకున్నారు. వాటిలో కొన్ని తీవ్ర దుమారం రేపాయి. లోకేష్ షేర్ చేసిన ఫొటోలతో పవిత్రమైన పూజ గది ఫోటో కాస్తా రాజకీయ విమర్శలకు దారితీసింది. చివరకు ఆ వివాదంపై లోకేశ్ స్వయంగా స్పందించాల్సి వచ్చింది. జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.  

వివాదం ఎలా మొదలైందంటే?

ఉగాది సందర్భంగా నారా లోకేశ్ తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ఇంటి పూజ గదిలో కూర్చుని ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు చెప్పారు. తండ్రీకొడుకులు పద్ధతిగా పంచె కట్టుకుని, భక్తిశ్రద్ధలతో దేవుడికి నమస్కరిస్తున్న ఆ ఫొటోలు చూడటానికి చాలా బాగున్నాయి. అక్కడితో ఆగిపోతే సోషల్ మీడియాతో సమస్యలు ఎందుకు వస్తాయి. దాన్ని జూమ్ చేసి అక్కడ ఏమేమి ఉన్నాయో చూశారు. అలా చూసిన ప్రత్యర్థులకు అక్కడ ఒక విచిత్రమైన బొమ్మ కనిపించింది. అంతే దాన్ని పట్టుకొని వైరల్ చేశారు. 

లోకేష్ పూజ గదిలో ఉన్న వింత బొమ్మ ఏంటీ అనే రచ్చ మొదలైంది. ఇలాంటివి క్షద్ర పూజల్లో వాడతారని కొందరు అంటే, ఇదేదో చేతబడికి ఉపయోగించిన బొమ్మలా ఉందని మరికొందరు చర్చకు పెట్టారు. దేవుడి గదిలో అనుమానాస్పద బొమ్మలు ఉండటం ఏంటని మరికొందరు నిలదీశారు. పవిత్రమైన పూజ మందిరంలో క్షద్ర పూజలు చేస్తున్నారా అంటూ ప్రత్యర్థులు హేళన చేశారు.

స్పందించిన లోకేష్‌

గంటల వ్యవధిలోనే ఇది వైరల్‌గా మారింది. దీంతో లోకేష్ స్పందించాల్సి వచ్చింది. ఆ బొమ్మ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, దానికి ఉన్న ఎమోషనల్ కనెక్షన్‌ను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఆయన ఏమన్నారంటే..." ఆ బొమ్మ ఏదో క్షద్ర పూజల కోసం తెచ్చింది కాదు. అది దేవాన్ష్‌ తన నాలుగేళ్ల వయసులో తయారు చేసిన శివుని బొమ్మ. దేవాన్ష్‌కు చిన్నప్పటి నుంచి శివుడు అంటే చాలా భక్తి, ఆ భక్తితోనే స్వయంగా ఒక చిన్న శివలింగాన్ని, శివుడి బొమ్మను తయారు చేశాడు." అని లోకేష్ వివరించారు.  


Lokesh Latest News: వీడిన నారా లోకేశ్ పూజ గదిలోని బొమ్మ మిస్టరీ! క్షుద్ర పూజలంటూ వస్తున్న విమర్శలపై మంత్రి వివరణ! 

గుర్తుగా దాచుకున్న జ్ఞాపకం

పిల్లలు చిన్నతనంలో చేసే పనులు తల్లిదండ్రులకు ఎంతో ప్రత్యేకమని లోకేష్ అభిప్రాయపడ్డారు. వారు చేసే చిన్న చిన్న బొమ్మలు లేదా గీసే చిత్రాలను జ్ఞాపకాలుగా దాచుకోవడం సహజమని వెల్లడించారు. తమ కుమారుడు ఎంతో ఇష్టంగా తయారు చేసిన ఆ శివుడి బొమ్మను పారేయకుండా, భక్తితో తమ పూజ గదిలోనే ఒక జ్ఞాపకంలా భద్రపరుచుకున్నామని తెలిపారు."కొందరికి విశ్వాసం అర్థమవుతుంది, మరికొందరికి అర్థం కాదు. కానీ ఇలాంటి భక్తికి ఎలాంటి వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు" అంటూ లోకేష్‌ కౌంటర్ ఇచ్చారు. తన ట్వీట్ చివరలో "హరహరమహాదేవ్" అని పేర్కొంటూ ఈ వివాదానికి ముగింపు పలికారు.

Frequently Asked Questions

ఉగాది సందర్భంగా నారా లోకేశ్ తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఏం చేశారు?

ఉగాది సందర్భంగా నారా లోకేశ్ తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ఇంటి పూజ గదిలో పూజలు చేశారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నారా లోకేశ్ షేర్ చేసిన ఫోటోలలోని ఒక బొమ్మపై ఎలాంటి వివాదం చెలరేగింది?

పూజ గదిలో కనిపించిన ఒక వింత బొమ్మను కొందరు క్షద్ర పూజలకు లేదా చేతబడికి వాడతారని ఆరోపించారు. దీంతో ఆ బొమ్మపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి.

ఆ వివాదాస్పద బొమ్మపై నారా లోకేశ్ ఎలా స్పందించారు?

ఆ బొమ్మ తమ కుమారుడు దేవాన్ష్ నాలుగేళ్ల వయసులో స్వయంగా తయారు చేసిన శివుని బొమ్మ అని లోకేశ్ వివరించారు. అది కేవలం జ్ఞాపకంగా పూజ గదిలో భద్రపరిచినట్లు తెలిపారు.

దేవాన్ష్ తయారు చేసిన శివుని బొమ్మను లోకేశ్ ఎందుకు పూజ గదిలో ఉంచారు?

తన కుమారుడు ఎంతో భక్తితో, ఇష్టంతో తయారు చేసిన ఆ శివుని బొమ్మను జ్ఞాపకంగా, భక్తితో పూజ గదిలో భద్రపరిచానని లోకేశ్ తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget