అన్వేషించండి

Amaravati Gazette: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత - విభజన చట్టం సవరణ ప్రక్రియ ప్రారంభం

AP capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత ఇచ్చే ప్రక్రియ ప్రారంభమయింది. విభజన చట్టం సవరణకు కేంద్రం న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Legality for AP capital Amaravati  :  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014లోని 5(2) సెక్షన్‌ను సవరించే ప్రతిపాదనకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ ఆమోదం అనంతరం అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ ప్రక్రియ రెండు వారాల్లో పూర్తి కావచ్చని తెలుస్తోంది.           

ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఏపీ విభజన చట్టం సవరణ ప్రక్రియ                             

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం  5(2) సెక్షన్ ప్రకారం, హైదరాబాద్‌ను 10 సంవత్సరాలు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు. అయితే, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని పేరు ఎక్కడా పేర్కొనలేదు, కేవలం "రెసిడ్యువరీ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్" అని మాత్రమే పేర్కొన్నారు. ఈ లోపం వల్ల రాజధాని విషయంలో చట్టపరమైన అస్పష్టత ఏర్పడింది. 2015లో టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించినా, గెజిట్ నోటిఫికేషన్ జారీ కాలేదు. అసెంబ్లీలో అమరావతిని ప్రతిపక్ష నేతగా జగన్ కూడా ఆమోదించడంతో ఇక రాజధాని సమస్య ఉండదనుకున్నారు.                   

అమరావతిని రాజధానిగా చేరుస్తూ బిల్లు రెడీ  - ఆమోదం తర్వాత గెజిట్ జారీ                        

కానీ 2019-2024 మధ్య జగన్ సీఎం అయ్యాక  మూడు రాజధానుల విధానం తెరపైకి తెచ్చారు.  అమరావతి ప్రాజెక్టును నిలిపివేశారు. దీనికి వ్యతిరేకంగా అమరావతి రైతులు  తీవ్ర పోరాటం చేశారు. న్యాయపరంగా కూడా జగన్ ప్రయత్నాలు సాధ్యం కాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం   అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించడంతో, చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరింది. మే 8, 2025న ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో  అమరావతిని రాజధానిగా చట్టంలో చేర్చాలి అనే ప్రతిపాదన ఆమోదించారు. ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపారు.  తాజా సమాచారం ప్రకారం, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఈ సవరణకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు.         

రెండో ద శ ల్యాండ్ పూలింగ్ కు ముందుకు రైతులకు  భరోసా            

కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం తర్వాత, సవరణ బిల్లును వింటర్ సెషన్‌లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బిల్లు రెండు సభల్లో  ఆమోదం పొందిన తర్వాత, అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ రెండు వారాల్లో పూర్తి కావచ్చని అంచనా. అమరావతిలో రెండో విడత  భూసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అమరావతికి గెజిట్ వస్తే రైతులు మరితం ధైర్యంగా భూములు ఇచ్చే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget