YS Jagan : బెయిల్‌పై ఉన్న చంద్రబాబు సాక్షులను బెదిరిస్తున్నారు! జగన్ సంచలన ఆరోపణలు
YS Jagan : కుంభకోణాల్లో ఆరితేరిన చంద్రబాబు సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వంపై సంచలన విమర్శలు చేశారు.

YS Jagan : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న స్కాంలు మామూలు కుంభకోణాలు కాదని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. వివిధ కేసుల్లో బెయిల్‌పై ఉన్న వ్యక్తి అధికారులను బెదిరించి కేసులు కొట్ట కొట్టేయించుకుంటున్నారని విమర్శించారు. అబద్దపు వాంగ్మూలాలు ఇప్పించారని మండిపడ్డారు. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని అన్నారు. ఇంకా ఏమన్నారంటే..." 2014-19 మధ్య చంద్రబాబు చేసిన స్కామ్‌లు అషాాషీ స్కామ్‌లు కావు. వివిధ కేసుల్లో బెయిల్ మీ ఉన్న చంద్రబాబు తనపై ఫిర్యాదు చేసిన అధికారుల్ని బెదిరిస్తున్నారు. అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించారు. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ బరితెగిస్తున్నారు. స్కీమ్ స్కామ్ కేసును కేంద్రం కూడా గుర్తించింది. చంద్రబాబు, బినామీలతో అమరావతి భూ కుంభకోణం జరిగింది." అని ఆరోపించారు.
చంద్రబాబు హయాంలో సింహాచలం ఆలయంలో చోరీ జరిగిందని గుర్తు చేశారు చంద్రబాబు సెప్టెంబర్ 1న ఆలయ ఉద్యోగులే చోరీకి పాల్పడ్డారని వెల్లడించారు. రమణ, సురేష్ ఇద్దరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారని తెలిపారు. అలా ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ఇద్దర్నీ జైల్లో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. విచారణ జరిపి ఆస్తుల్ని స్వాధీనం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని అన్నారు. సింహాచలం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిను ఎందుకు విచారించలేదని అన్నారు. సుబ్బారెడ్డి, అశోక్ గజపతికు చెరో న్యాయమా అని ఆందోళన వ్యక్తం చేశారు.





















