Kodali Nani Health Condition: కోర్ట్ కు వచ్చిన కొడాలి నాని- అప్పటివరకూ భూమి మీదే ఉంటానంటూ ఘాటు వ్యాఖ్యలు
Vijayawada Kodali Nani: కొడాలి నాని అనారోగ్యానికి గురయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మరో వైపున కొడాలి నాని పెండింగ్ లో ఉన్న కేసు విషయమై విజయవాడ కోర్టుకు కూడా హజరయ్యారు.
Kosali Nani Responds over Cancer Rumours: మాజీ మంత్రి, గుడివాడ శాసన సభ్యుడు కొడాలి నాని అనారోగ్యానికి గురయ్యారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మరో వైపున కొడాలి నాని పెండింగ్ లో ఉన్న కేసు విషయమై విజయవాడ కోర్టుకు కూడా హజరయ్యారు.
కొడాలి నాని ఆరోగ్యంపై రూమర్స్..
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గ శాసన సభ్యుడు కొడాలి నాని అనారోగ్యానికి గురయ్యారని, ఆయన ఆరోగ్యం పై అభిమానులు ఆందోళనతో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాట్సాప్ గ్రూప్ లతో పాటుగా వివిద సామాజిక మాధ్యమాల ద్వార కొడాలి నాని అనారోగ్యం పై ఎవరికి తోచినట్లుగా వారు ఇష్టానుసారంగా ప్రకటనలు చేశారు. కొడాలి నాని క్యాన్సర్ బారిన పడ్డారని ప్రచారం మొదలైంది. దీనిపై ఆయన సన్నిహిత వర్గాలు సైతం మండిపడ్డాయి. అలాంటిది ఏమీ లేదని అభిమానులకు సమాచారం అందించారు. అయితే ఈలోగా జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది. దీంతో కొడాలి నాని అభిమానులు, అసత్య ప్రచారం చేసిన వారిపై మండిపడుతున్నారు..
కుమార్తెను రిసీవ్ చేసుకునేందుకు వెళ్ళిన కొడాలి..
ఇటీవల కొడాలి నాని కుమార్తె అమెరికా నుంచి తిరిగొచ్చారు. ఆమెను రిసీవ్ చేసుకునేందుకు కొడాలి నాని హైదరాబాద్ కు వెళ్ళారు. అక్కడే కొన్ని రోజుల పాటు ఉన్నారు. అమెరికా నుంచి కుమార్తె వచ్చిన సంతోషంతో కుటుంబం అంతా హైదరాబాద్ లో కలసి గడిపారు. అంతకు ముందు అంటే జులై ఎనిమిదవ తేదీన కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో పర్యటించారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో కూడ పాల్గొన్న నాని, అభిమానులతో వివిద సామాజిక, సేవా కార్యక్రమాల్లో కూడ పాల్గొన్నారు. ఆ తరువాత రోజు సాయంత్రం నుండి కుమార్తెను రిసీవ్ చేసుకునేందుకు కొడాలి నాని హైదరాబాద్ కు పయమం అయ్యారు. అయితే ఆయన వెళ్ళిన రోజు నుండే అర్దరాత్రి సమయంలో సోషల్ మీడియా కేంద్రంగా కొడాలి ఆరోగ్య పరిస్దితులు పై రూమర్స్ స్టార్ట్ అయ్యాయయని భావిస్తున్నారు.
అప్పటి వరకు భూమి మీదనే ఉంటానన్న కొడాలి నాని..
కాగా, పెండింగ్ లో ఉన్న కేసు విషయంలో మాజీ మంత్రి , కొడాలి నాని విజయవాడలో ప్రజా ప్రతినిధుల కోర్ట్ కు వచ్చారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ప్రచారం పై కొడాలి రియాక్ట్ అయ్యారు. చంద్రబాబును రాజకీయాల నుంచి, రాష్ట్రం నుంచి ఇంటికి పంపే వరకు నేను భూమి మీదే ఉంటా అని వ్యాఖ్యానించారు. తానంటే గిట్టనివారు కొందరు అత్యుత్సాహంతో ఇలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను అనారోగ్యానికి గురైనట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ఇదంతా తెలుగు దేశం నాయకుల దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. ఐటీడీపీ ద్వారా టీడీపీ ఇలాంటి ప్రచారాలు చేయిస్తోందని చెప్పారు.
పవన్, చంద్రబాబులను మానసిక వైకల్య కేంద్రంలో చేర్చాలని సీఎంను కోరుతున్నానని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత వీళ్లకి మానసిక వైకల్య కేంద్రంలో చేరుస్తామని చెప్పారు. దమ్ముంటే నాపై పోటీకి దిగాలని చంద్రబాబు, లోకేష్ కు సవాలు చేసినా స్పందించటం లేదని అన్నారు. చంద్రబాబుకి రాజకీయాల నుంచి చరమ గీతం పలికే వరకు తాను భూమి మీదే ఉంటానని కొడాలి కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి సోషల్ మీడియా ప్రచారాల వల్ల తనకేం అవ్వదని దీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial