By: ABP Desam | Updated at : 05 Jun 2023 07:49 PM (IST)
"వారాహి యాత్ర" పోస్టర్ ఆవిష్కరించిన నాదెండ్ల (Photo: Twitter)
Pawan Kalyan Varahi Yatra Poster: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 14న వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. ఈ మేరకు వారాహి యాత్ర పోస్టర్ ను పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. దాంతో పాటు వారాహి తొలి విడత యాత్రలో పర్యటించనున్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను పవన్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నియమించింది. జనవాణి కార్యక్రమం సమన్వయకర్తగా డి వరప్రసాద్ వ్యవహరించనున్నారు.
"వారాహి యాత్ర" పోస్టర్ ఆవిష్కరించిన శ్రీ @mnadendla గారు
— JanaSena Party (@JanaSenaParty) June 5, 2023
#JanaSenaVarahi#VarahiYatra pic.twitter.com/udqVdOZdF6
వారాహి యాత్రలో నియోజకవర్గాల జనసేన సమన్వయకర్తలు..
నర్సీపట్నం - బొలిశెట్టి సత్యనారాయణ, వంపూర్ గంగులయ్య
పాయకరావుపేట - గడసాల అప్పారావు, మూగి శ్రీనివాస్
యలమంచిలి - బండ్రెడ్డి రామక్రిష్ణ, బేతపూడి విజయశేఖర్
తుని - బోనబోయిన శ్రీనివాస యాదవ్, తాతంశెట్టి నాగేంద్ర
ప్రత్తిపాడు - చిలకం మధుసూదన్ రెడ్డి, అక్కల గాంధీ
పిఠాపురం - బొమ్మిడి నాయకర్, చిల్లపల్లి శ్రీనివాస్
కాకినాడ రూరల్ - నయుబ్ కమల్
కాకినాడ అర్బన్ - గాదె వెంకటేశ్వర రావు
ముమ్మిడివరం - బొలిశెట్టి సత్యనారాయణ
అమలాపురం - బోనబోయిన శ్రీనివాస యాదవ్, సుందరపు విజయ్ కుమార్
పి.గన్నవరం - గడసాల అప్పారావు
రాజోలు - చిలకం మధుసూదన్ రెడ్డి
పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు అండగా నిలిచిన జనసేన
వినుకొండ నియోజకవర్గం బ్రాహ్మణపల్లికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు గొల్ల గురుబ్రహ్మ ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షల బీమా చెక్కు అందచేశారు నాదెండ్ల మనోహర్. ఉమ్మడి గుంటూరు జిల్లాకి చెందిన పలువురు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు వేర్వేరు ప్రమాదాల్లో గాయపడ్డారు. వారిని పార్టీ నేతలతో కలిసి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. వీరికి వైద్య ఖర్చులకి సంబంధించి బీమా చెక్కులను అందచేశారు. అంతకుముందు కాజీపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు గద్దె వెంకట సత్యనారాయణ ఇటీవల ప్రమాదంలో గాయపడ్డారు. ఆయనను పరామర్శించి, వైద్య ఖర్చులకి సంబంధించి రూ.50 వేల భీమా చెక్కు అందించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనం వారాహి. ఈ ప్రచార వాహనంతో ప్రజల్లోకి రావాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఈ మేరకు వారాహి రూట్ మ్యాప్ సిద్ధం చేసింది జనసేన. తూర్పు గోదావరి జిల్లాలో అన్నవరంలో సత్యదేవుని దర్శించుకున్న తరువాత జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈ నెల 14 నుంచి ప్రారంభం అవుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇటీవల తెలిపారు.
వినుకొండ నియోజకవర్గం బ్రాహ్మణపల్లికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ గొల్ల గురుబ్రహ్మ ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షల బీమా చెక్కు అందచేసిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.
— JanaSena Party (@JanaSenaParty) June 5, 2023
Link: https://t.co/4PzNLPalyy pic.twitter.com/qoniYFVo5K
వారాహి రూట్ మ్యాప్ విడుదల చేసిన జనసేన
ప్రత్తిపాడు నియోజకవర్గం, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు.. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, నర్సాపురం, భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన నేతలు నేడు సమావేశమై చర్చించిన అనంతరం వారాహి రూట్ మ్యాప్ విడుదల చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు, అధిక సమయం ప్రజల మధ్య గడిపేలా జనసేన నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
Ayyanna Patrudu: జగన్ రెడ్డి జైలు పక్షి, ఆయన వచ్చాక రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి: అయ్యన్న పాత్రుడు
CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు
AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్ 'స్పాట్ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం
MLC Ashok Babu: ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదు, రూ.900 కోట్ల ఆదాయం: అశోక్ బాబు
Andhra Pradesh: న్యాయమూర్తులపై దూషణలు: హైకోర్టులో ఏజీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు
Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !
Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్
Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!
Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?
/body>