By: Harish | Updated at : 14 Mar 2023 10:05 AM (IST)
వారాహితో వార్నింగ్- పేర్ని నాని, అమర్‌నాథ్‌ను ట్రోల్ చేస్తున్న జనసేన
Pawan Kalyan vs Peri Nani: వారాహి వాహనం రాజకీయంగా సంచలనంగా మారింది. జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వాహనానికి వారాహి అనే పేరు పెట్టారు. ఇప్పుడు అదే వారాహి వాహనంపై విజయవాడ మీదగా మచిలీపట్టణానికి దాదాపుగా 100 కిలోమీటర్లు మేర రోడ్ షో నిర్వహించనున్నారు. జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నాడు వారాహి వాహనం స్పెషల్ అట్రాక్షన్‌గా కానుంది. రోడ్లపైకి ఎలా వస్తుందో అని సవాల్ చేసిన చోటే అదే వాహనంపై ర్యాలీగా వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు.
వారాహితో వార్నింగ్...
వారాహి వాహనం పొలిటికల్‌గా ఎంత వివాదం అయ్యిందో అందరికి తెలిసిందే. అసలు వాహనం రిజిస్ట్రేషన్‌కు అనుమతి లేదని, నిబంధనల ప్రకారం వాహనాన్ని తయారు చేయలేదని అప్పట్లో పేర్ని నాని సంచలన కామెంట్స్ చేశారు. ఆ వాహనం రంగుపై కూడా విమర్శలు చేశారు. భారత రక్షణ రంగానికి సంబంధించి నిబంధనలకు విరుద్దంగా వాహనం రంగు ఉందని పేర్ని నాని అప్పట్లో బాంబు పేల్చారు. ఆ తర్వాత చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ నిబంధనలు ప్రకారం వారాహి వాహనం రిజిస్ట్రేషన్ కాదని అధికార పక్షం సవాల్ చేశారు. దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే పవన్ కళ్యాణ్ వారాహి వాహానానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా తెలంగాణ అధికారులు రిజిస్ట్రేన్ ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో వాహనం రిజిస్ట్రేషన్ కు సంబంధంచిన వివాదానికి అప్పటేలో తెరదించారు.
అయినా సరే వైసీపీ నేతల దాడి ఆగలేదు. వారాహి వాహనంపై ఘాటుగానే స్పందిస్తూ వచ్చారు. అందులో ముందు ఉండేది మాజీ మంత్రి పేర్ని నాని, ప్రస్తుత మంత్రి అమర్‌నాథ్. రాష్ట్రంలోని రోడ్ల మీద వారాహి వాహనాన్ని తిరగనివ్వమని సవాల్ చేశారు. దీంతో జనసేన, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య కొన్ని వారాల పాటు మాటల యుద్దం నడిచింది. వారాహిని ఆంధ్రప్రదేశ్ రోడ్లపై నడిపించి తీరుతామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ సవాల్ విసిరారు పవన్ కల్యాణ్.
తర్వాత ఆ తెలుగు రాష్ట్రాల్లో పూజా కార్యక్రమాలు జరుపుకోవడంతో పరిస్థితి శాంతించింది. అయితే ఇప్పుడు విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు వారాహితో ర్యాలీ తీయడం మరోసారి పాత విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి. పవన్‌పై విమర్శలు చేయడానికి ఎప్పుడూ ముందు ఉండే పేర్ని నాని నియోజకవర్గంలో పవన్ సభ పెట్టడం ఓ ఎత్తుగడ అయితే. ఇప్పుడు ఆ సభకు వెళ్లేందుకు వారాహిపై ర్యాలీగా వెళ్తుండటం సంచలనంగా మారుతోంది.
అనుమతి ఇవ్వబోం... రోడ్లపై ఎలా తిరుగుతుందో చూస్తామన్న వారి ఇలాఖాలోనే పవన్ వారాహిపై వెళ్తున్నారు చూడండి అంటూ జనసైనికులు ట్వీట్లు చేస్తున్నారు. అన్నట్లుగానే ఇప్పుడు అదే మచిలీట్టణం నియోజకవర్గంలో పేర్ని నాని ఇలాఖాలోనే పవన్ కళ్యాణ్ పార్టి ఆవిర్బావ దినోత్సవానికి ఏకంగా వారాహి వాహనం వెళ్తున్నారు. దీంతో పేర్ని నానికి కౌంటర్ ఇస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
వ్యవస్థాపక సభకు రూట్ మ్యాప్ ఇదే
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేటి షెడ్యూల్ లోకి వెళితే మధ్యాహ్నం 12.30కు నోవాటెల్ హోటల్ నుంచి బయలుదేరుతారు. ఒంటిగంటకు ఆటోనగర్ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వారాహి వాహనం ద్వారా జనసేన ఆవిర్భావ సభ, మచిలీపట్నం బయలుదేరుతారు . తాడిగడప జంక్షన్ ,పోరంకి జంక్షన్ ,పెనమలూరు జంక్షన్ - పామర్రు – గుడివాడ సెంటర్ (బైపాస్), గూడూరు సెంటర్ మీదుగా 5గంటలకు మచిలీపట్నంలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఆవిర్భావ సభ వేదికపై కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మొత్తం 51మంది రైతులకు పవన్ లక్ష రూపాయలు చొప్పున ఆర్దిక సహయం అందిస్తారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్ గేమ్‌తో ప్రచారం- ప్రత్యర్థులను పరుగులు పెట్టేంచేలా స్కెచ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
AP MLC Elections: ఆ 16 మంది వైసీపీ ఎమ్మెల్యేల ఓటు టీడీపీకే - గోరంట్ల, నిమ్మల కీలక వ్యాఖ్యలు
ఏపీలో ప్రభుత్వం తరఫున ధర్మ ప్రచార కార్యకమం- జనంలోకి ఏడు ప్రముఖ దేవాలయాల ప్రచార రథాలు !
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు ఓటేస్తారా? రాజీనామాను ఆమోదించేశారా?
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు
Hindenburg Research: మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు