అన్వేషించండి

Jagananna Thodu: రేపే జగనన్న తోడు పథకం నిధుల విడుదల, వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ చేయనున్న సీఎం

జగనన్న తోడు పథకం నిధుల విడుదల, ఈనెల 11వ తేదీన 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు ఏపీ ప్రభుత్వం సాయం చేయనుంది.

Jagananna Thodu: ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జగనన్న తోడు పథకానికి మరో వడ్డీ లేని రుణాల పంపిణీకి ప్రభుత్వం మరోసారి శ్రీకారం చుట్టింది. ఈనెల 11వ తేదీన 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు ఏపీ ప్రభుత్వం సాయం చేయనుంది.
చిరు వ్యాపారుల కోసం...
చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కోసం ఏపీలోని సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టింది. నడ్డి విరిచే వడ్డీలకు చెల్లుచీటీ చెబుతూ చిరు వ్యాపారులకు అండగా నిలబడాలన్న సదుద్ధేశంతో జగనన్న తోడు పథకం ప్రవేశపెట్టింది. 11వ తేదీన బుధవారం జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు రూ.10వేల వరకు వడ్డీలేని రుణాన్ని పంపిణి చేయనున్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10వేలు చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి బ్యాంకుల ద్వారా కొత్తగా రూ. 395  కోట్లు కొత్త రుణాలు అందించడంతో పాటు, గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం  వైఎస్‌ జగన్‌  జమ చేయనున్నారు.
ఎవరెవరికి జగనన్న తోడు...
గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడగులు పొడవు, 5 అడుగులు వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారికి, పుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు అమ్మకుని జీవించేవారు, రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహించేవారు, గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్‌, మోటారు సైకిల్‌, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసేవారితో  పాటు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు... ఇత్తడి పని చేసేవాళ్లు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బమ్మల తయారీ, లేస్‌ వర్క్స్, కలంకారీ, తోలుబొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారికి ప్రభుత్వం తరఫున సహయాన్ని అందించనున్నారు. 
పాదయాత్రలో వచ్చిన ఆలోచనల్లో ఇది ఒకటి...
సుదీర్ఘ పాదయాత్రలో  చిరు వ్యాపారుల కష్టాలను చూసిన, వారి కడగండ్లను స్వయంగా విన్న ముఖ్యమంత్రి  వైఎస్‌.జగన్‌ ఆ పరిస్థితులను మారుస్తూ, నిత్యం కష్టంపైనే ఆధారపడి, గౌరవంగా జీవిస్తున్న వారిని ఆదుకోవడం కోసం సున్నా వడ్డీకే రుణాలు అందిస్తూ జగనన్న తోడు పథకం అమలు చేస్తున్నారు. దీని వలన లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. 
దేశంలో అత్యధికంగా వడ్డీలేని రుణాలు  ..
నేడు అందిస్తున్న రూ.395 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు రూ.15,31,347 మంది చిరు వ్యాపారాలు చేసుకునే లబ్ధిదారులకు అందించిన వడ్డీలేని రుణాలు రూ.2,406 కోట్లు.వీరిలో సకాలంలో రుణాలు చెల్లించి రెండోసారి రుణం కోరి పొందిన వారు 8,74,745 మంది. నేడు (11–01–2023) అందిస్తున్న వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ రూ.15.17 కోట్లతో కలిపి సకాలంలో రుణాలు చెల్లించిన 13.28 లక్షల లబ్ధిదారులకు ఇప్పటివరకు ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ రూ.63.65 కోట్లు కావటం విశేషం..
ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ తీసుకున్న చర్యల కారణంగా సకాలంలో రుణాలు చెల్లించిన వీధి వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల వారికి నిత్యం అందుబాటులో మూలధనాన్ని సమకూర్చుతున్నారు.ఏ ఏడాదికి ఆ ఏడాది రుణాల మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.11 వేలకు, రూ.11 వేల నుంచి రూ.12 వేలకు, రూ.12 వేల నుంచి రూ.13వేలకు పెంచుతూ బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Nellore News: పెంచలకోన అటవీ ప్రాంతంలో చిరుత సంచారం - కారు హారన్ కొట్టడంతో పరుగో పరుగు!
పెంచలకోన అటవీ ప్రాంతంలో చిరుత సంచారం - కారు హారన్ కొట్టడంతో పరుగో పరుగు!
Embed widget