By: ABP Desam | Updated at : 11 Apr 2022 01:30 PM (IST)
మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పదనిసలు
మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సచివాలయంలో ఘనంగా సాగింది. మొత్తం 25 మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించారు. అల్ఫాబేటిక్ ఆర్డర్ ప్రకారం ముందుగా అంబటి రాంబాబు ప్రమాణం చేశారు. చివరిగా విడదల రజనీ ప్రమాణం చేశారు.
కొందరు దేవుడిపై ప్రమాణం చేస్తున్నట్టు ప్రమాణ స్వీకారం చేశారు. అంజాద్ బాషా అల్లా పై ప్రమాణం చేశారు. పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఉషా శ్రీ చరణ, ఆదిమూలపు సురేష్ ఇద్దరు ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు.
బొత్స చాలా డిఫరెంట్
తెలుగులో ప్రమాణం చేసిన బొత్స సత్యనారాయణ సౌరభౌమత్వం, అంతఃకరణ శుద్ధితో అనే పదాలు పలికేటప్పుడు తడబడ్డారు. ప్రమాణం తర్వాత గవర్నర్‌తో ఆశీర్వాదం తీసుకున్న తర్వాత జగన్ వద్దకు వచ్చి థాంక్స్ చెప్పారు.
బూడి ముత్యాలనాయుడు తన కాళ్లుపై పడుతుంటే జగన్ వారించి అభినందించి పంపించారు. తర్వాత ఆయన గవర్నర్ ఆశీర్వాదం తీసుకున్నారు.
గుడివాడ అమర్‌నాథ్ ప్రమాణ స్వీకారం తర్వాత జగన్‌కు సాష్టాంగ నమస్కారం చేశారు. జోగి రమేష్ కూడా కాళ్లపై పడేందుకు యత్నించారు. వద్దని జగన్ చెప్పి పంపించారు. వద్దని చెబుతున్న వినకుండా నారాయణ స్వామి సీఎం జగన్ కాళ్లకు నమస్కరించారు. తనకు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు.
AP New Cabinet Oath Taking Ceremony LIVE: ప్రమాణ స్వీకారం చేస్తున్న ఏపీ కొత్త కేబినెట్ : https://t.co/Y4OLsqSWp5 #APNewCabinet #APNewMinisters #AndhraPradesh #YSJagan #OathTaking pic.twitter.com/3bn1gUHuJZ
— ABP Desam (@ABPDesam) April 11, 2022
తొలిసారి మంత్రిగా ప్రమాణం చేసిన ఉషా శ్రీచరణ్ కూడా ముఖ్యమంత్రి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు ఆర్కే రోజా. ప్రమాణ స్వీకారం తర్వా ఆమె జగన్ కాళ్లకు నమస్కరించి చేతిపై ముద్దుపెట్టారు.
రెండోసారి మంత్రిగా ప్రమాణం చేసిన సీదిరి అప్పల రాజు సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ కాళ్లకు నమస్కరించారు. తానేటి వనిత కూడా సీఎం కాళ్లకు నమస్కరించారు. చివరకి ప్రమాణం చేసిన విడదల రజని కూడా జగన్ కాళ్లకు నమస్కరించారు.
ఈ ప్రమాణ స్వీకారణ కార్యక్రమానికి వైసీపీ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
AP New Cabinet Oath Taking Ceremony LIVE: ప్రమాణ స్వీకారం చేస్తున్న ఏపీ కొత్త కేబినెట్ : https://t.co/Y4OLsqSWp5 #APNewCabinet #APNewMinisters #AndhraPradesh #YSJagan #OathTaking
— ABP Desam (@ABPDesam) April 11, 2022
AP Government On CPS: సీపీఎస్ అమలు సాధ్యం కాదు- తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం, జీపీఎస్‌కు సహకరించాలని సూచన
Guntur: పెళ్లికి ముందు వరుడి మాజీ లవర్ ఊహించని ట్విస్ట్, అసలు విషయం తెలిసి వధువు ఫ్యామిలీ షాక్
AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !
Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్
Mahesh Babu Trivikram Movie Update: మహేష్ బాబు సినిమాకూ త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్‌తో వెళతారా?
Karimnagar: టెన్త్ ఎగ్జామ్స్‌కి ఫుల్లుగా తాగొచ్చిన టీచర్, తూలుతూనే ఇన్విజిలేషన్ - బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో రీడింగ్ చూసి అంతా షాక్!