CJI Justice NV Ramana Tour : సీజేఐకు హోమ్ టౌన్‌లో గ్రాండ్ వెల్కమ్.. ఎద్దుల బండిపై జస్టిస్ రమణ దంపతుల ఊరేగింపు..
సీజేఐ జస్టిస్ NV రమణకు తెలంగాణ-ఏపీ బోర్డర్‌లో ఘన స్వాగతం లభించింది. ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. సొంతూరులో కూడా స్వాగతానికి భారీ ఏర్పాట్లు చేశారు.
సీజేఏ హోదాలో తొలిసారిగా గ్రామానికి వచ్చిన ఎన్వీ రమణకు గ్రామస్థులు సాదర స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను ఎడ్ల బండిపై గ్రామంలో ఊరేగించారు. మేళతాలాలు, జనసందోహం మధ్య ఊరేగింపు సాగింది. ఊరేగింపు తర్వాత ఆయన గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు గ్రామస్తులు పౌరసన్మానం చేశారు.
అంతకు ముందు హైదరాబాద్ నుంచి సొంతూరు వస్తున్న జస్టిస్ ఎన్వీ రమణకు మార్గ మధ్యలో ఘన స్వాగతం లభించింది. దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన... రోడ్డు మార్గంలో పొన్నవరానికి బయల్దేరారు. ఈ సందర్భంగా సరిహద్దులోని గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద కృష్ణా జిల్లా కలెక్టర్ జే. నివాస్, ఎస్పీ సిద్ధార్త్ కౌశల్ ఆయనకు బొకేలు ఇచ్చి వెల్‌కమ్ చెప్పారు. వేదపండితులు పూర్ణకుంభంతో, మేళా తాళాలతో స్వాగతం పలికారు. పలువురు మహిళలు జాతీయ జెండా చేతిలో పట్టుకొని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు అభివాదం చేశారు.
ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, హైకోర్టు రిజిస్ట్రారర్ జనరల్ ఏ.వి.రవీంద్రబాబు, రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ ఏ.గిరిధర్, లా సెక్రెటరీ సునీత, నందిగామ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి బి.శ్రీనివాస్, డిఐజి రాజశేఖర్ బాబు, ఉమెన్ వెల్ఫేర్ కమిషనర్ కృతిక శుక్లా ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
#SupremeCourt #CJI NV Ramana arrives at his native village #Ponnavaram in Krishna district.@NewIndianXpress @xpressandhra @Kalyan_TNIE @shibasahu2012 @Ravindra_TNIE pic.twitter.com/7hZC5MtGy2
— prasantmadugula (@prasantmadugula) December 24, 2021
సొంతూరు పొన్నవరంలో కూడా భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు పొన్నవరం వాసులు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్