అన్వేషించండి

Andhra Pradesh: ఒకప్పుడు ఏపీ పాలన ఇతరులకు పాఠం- గత ఐదేళ్ల పాలన గుణపాఠం: కలెక్టర్ల సమావేశంలో పవన్ కామెంట్స్

Pawan Kalyan: గత ఐదేళ్లు జరిగిన తప్పులు రిపీట్ కాకుండా పాలన ఉంటుందని కలెక్టర్ల సమావేశంలో తెలియజేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వ్యవస్థలను ఆటబొమ్మలుగా మార్చి పని చేయనీయలేదని విమర్శించారు.

Pawan Kalyan Speech At Collectors Meeting: పాలన ఎలా ఉండాలో గతంలో ఏపీ పాఠాలు నేర్పేది... అసలు పాలన ఎలా ఉండకూడదో గుణపాఠాలు నేర్పింది గత ఐదేళ్ల పాలన అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆయన ప్రభుత్వం ఆలోచనలను అధికారులకు వివరించారు. ఐదేళ్లుగా చాలా అవమానాలు భరించి అనేక ఒత్తిళ్లు తట్టుకొని అధికారంలోకి వచ్చామన్నారు. ప్రజాసేవలపై  ఎంతో కమిట్‌మెంట్ ఉన్నందునే అన్నీ దిగమింగి ఎన్నో అడ్డంకులు దాటుకొని ఎన్నికల్లో విజయం సాధించామని తెలిపారు. అందుకే ఐదేళ్లు కూడా అంతకు మించిన డెడికేషన్‌తో ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ఉన్నామని వివరించారు. దీన్ని గ్రహించిన అధికారులు తమ సేవలు అందించాలని అభిప్రాయపడ్డారు పవన్. 

ఇదే మా ప్రణాళిక

వ్యవస్థలను బతికించాలని కలెక్టర్లకు పవన్ సూచించారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వం కోసం మీ వెనుకాల మేం ఉన్నామని భరోసా ఇచ్చారు. మోడల్ స్టేట్‌గా ఉండే ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారని దాన్ని పూర్తిగా పునర్‌నిర్మించాలని అభిప్రాయపడ్డారు. తన శాఖకు సంబంధించిన లక్ష్యాలను అధికారుల ముందు పవన్ ఉంచారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేయబోతున్నట్టు పేర్కొన్నారు. గ్రామపంచాయతీలను బలోపేతం చేసే దిశగా ఇదో పెద్ద బృహత్ కార్యక్రమం అన్నారు. వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టును మరింతగా విస్తరించాలని సూచించారు. ఐదేళ్ల పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్నీ తట్టుకొని నిలబడ్డామన్నారు పవన్ కల్యాణ్. తమ పాలన కూడా ఆ తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్త పడతామన్నారు. 

ఆ దుస్థితి మరోసారి రాకూడదు

వ్యవస్థలను ఆటబొమ్మలుగా చేసుకొని రాష్ట్రాన్ని పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లారని వైసీపీ పాలనపై విమర్శలు చేశారు పవన్. పాలన ఎలా ఉండకూడదో చూపించారని అన్నారు. ఇది తన మొదటి సమావేశమనని ఇంకా తాను కూడా చాలా నేర్చుకుంటున్నానని అన్నారు. ఈ క్రమంలో చేసిన తప్పులు ఏమైనా ఉంటే కచ్చితంగా తమకు తెలియజేయాలని చంద్రబాబును కోరారు పవన్ కల్యాణ్. మంత్రులు, అధికారుల తప్పుల వల్ల ప్రభుత్వం ఇరుకునే పడే పరిస్థితి, మందుకు వెళ్లలేని దుస్థితి రాకూడదని ఆకాంక్షించారు పవన్. 

చంద్రబాబు నాయకత్వంలో వృద్ధి పథంలో...

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పరిణామాలు దేశ సమగ్రతపై ప్రభావం చూపబోతున్నాయని అభిప్రాయపడ్డారు పవన్ కల్యాణ్. విభజనతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు గత ఐదేళ్ల పాలన మరింత ఆగ్రహాన్ని తెప్పించిదన్నారు. అందుకే ఇకపై వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగానే ఉంటుందని భరోసా ఇచ్చారు. చంద్రబాబు అనుభవం కూటమి లక్ష్య సాధనకు ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు.  

Also Read: సింపుల్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ ఉండాలి- అందరి పనితీరుపై మూడు నెలలకోసారి రివ్యూ: చంద్రబాబు

Also Read: నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఎత్తిన అధికారులు - వడివడిగా కృష్ణమ్మ పరుగులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Embed widget