By: ABP Desam | Updated at : 27 Aug 2023 08:18 PM (IST)
సీఎం జగన్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
CPI Bus Yatra: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే కొనసాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సీపీఐ బస్సు యాత్ర ఆదివారం గుంటూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సభ నిర్వహించారు. సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, తెలంగాణలో బీఆర్‌ఎస్ ముసుగులో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే కొనసాగుతోందని విమర్శించారు. ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానని జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని అన్నారు.
సీఎం అయ్యాక వైఎస్ జగన్ తనపై ఉన్న కేసులకు భయపడి పోయారని అన్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీకి లొంగిపోయారని ఆరోపించారు. బీజేపీ బారి నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడేందుకు పోరాటం చేస్తామన్నారు. దేశాన్ని దుర్మార్గుడైన మోదీ పాలిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం పోవాలన్నారు. మోదీ దత్త పుత్రుడు ఏపీ సీఎం జగన్ అన్నారు. పేరుకు వైసీపీ పార్టీ అని, కానీ బీజేపీ ముసుగుపార్టీ అన్నారు. మేక వన్నె పులుల్లా బీజేపీకి అనుకూలంగా ఉన్నారని అన్నారు. పైకి వైసీపీ ముద్ర లోపల బీజేపీ ముద్ర వేసుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
దేశంలో మోదీని దించేందుకు 26 పార్టీలతో రాజకీయ వేదిక ఏర్పడిందని, ఆగస్టు 31 లేదా సెప్టెంబర్ 1న ముంబై వేదికగా సమావేశం జరగబోతోందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు పోరాటం చేస్తామన్నారు. ఏపీ తెలంగాణల్లో అధికార పార్టీలు పైకి బీజేపీ వ్యతిరేకంగా ఉన్నా లోపల మాత్రం మిత్ర పక్షాలే అన్నారు. చేసిన తప్పుల నుంచి బయట పడడం కోసం బీజేపీకి మద్దతు ఇస్తున్నాయని అన్నారు. కేవలం కవిత కోసం కేసీఆర్, ఏపీలో తనను రక్షించుకోవడానికి జగన్ బీజేపీకి వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ బెయిల్‌పై బయట ఉన్నారని గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ నిందితుడూ ఇన్నేళ్లు బెయిల్‌పై బయట ఉండలేదని వ్యాఖ్యానించారు.
బీజేపీవి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు
రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలపైకి సీబీఐని పంపుతున్నారని, ఐటీ తనిఖీలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అవసరం అయితే ఈడీ దాడులకు దిగుతున్నారని విమర్శించారు. అనుకూలంగా ఉన్న వారికి మరో రకంగా చూస్తున్నారని అన్నారు. సీఎం జగన్ ప్రధాని మోదీకి వత్తాసు పలకడం వల్లే ఇంతకాలం పాటు బెయిల్‌పై ఉండగలుతున్నారని విమర్శించారు.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగి నాలుగేళ్లు గడిచినా నేటికీ ఆ కేసు తేలలేదన్నారు. పులివెందులకు వెళ్లి చిన్న పిల్లాడిని అడిగినా వివేకాను హత్య చేసింది ఎవరనే విషయం చెబుతారన్నారు. సీబీఐ మాత్రం ఇంకా విచారణ కొనసాగిస్తుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అమిత్ షా కనుసన్నలో ఈడీ, సీబీఐ పనిచేస్తున్నాయని అన్నారు. ఏపీలో అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. సీఎం సమావేశానికి రూ.50 లక్షలు ఇచ్చే పరిస్థితిలో లేదన్నారు. రాష్ట్రం దివాళా తీసిందన్నారు. రాష్ట్రాన్ని రక్షించండి - దేశాన్ని కాపాడండి నినాదంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. కేంద్రంలో మోదీని, ఏపీలో జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు పోరాటం చేస్తామన్నారు.
Vizag Port: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
AP Liquor Policy: మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ సర్కార్
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!
Breaking News Live Telugu Updates: ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో చంద్రబాబు విచారణ వాయిదా
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్తో వార్మప్ మ్యాచ్కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
/body>