By: ABP Desam | Updated at : 05 May 2022 05:48 PM (IST)
అమరావతి పనులపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి - ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం !
ఏపీలో మరోసారి రాజధాని అంశం తెరపైకి వచ్చింది. రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయటం లేదని రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతులు వేసిన పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే ఇప్పటి వరకు జరిగిన అమరావతి పునుల్లో జరిగిన పురోగతిపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ఉద్దేశ్యపూర్వకంగానే రాజధాని తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదని రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. నిధులు లేవనే సాకుతో రాజధాని తీర్పు అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీర్‌శర్మ, జీఏడీ ప్రత్యేక సీఎస్ జవహర్‌రెడ్డి, అప్పటి న్యాయశాఖ కార్యదర్శి సునీత, శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, అప్పటి ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, ఆర్థికశాఖ సెక్రటరీ ఎస్‌ఎస్ రావత్, పురపాలక ముఖ్యకార్యదర్శి వై. శ్రీలక్ష్మీ, సీఎం జగన్, అప్పటి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. నెలరోజుల్లో పనులు ప్రారంభించి కనీస వసతులైన తాగునీరు, డ్రైనేజి, విద్యుత్ లాంటి ఎమినిటీస్ కల్పించాలని కోర్టు తీర్పులో పేర్కొంది. ఆరు నెలల్లో రాజధాని నగరాన్ని నిర్మించాలని మార్చి3న ఇచ్చిన తీర్పులో చెప్పింది.
నెలలు గడుస్తున్నా ఆ తీర్పును ప్రభుత్వం పెద్దలు పట్టించుకోలేదని... ఆ తీర్పును ఉల్లంఘిస్తున్నారని రైతులు కోర్టుకు తెలియజేశారు. ఇందులో మంత్రులు, ముఖ్యమంత్రుల పాత్ర ఎక్కువ ఉందని... కోర్టు తీర్పు అమలు చేయకపోగా... న్యాయపాలనకు విఘాతం కలిగిస్తున్నారని అందులో అభిప్రాయపడ్డారు. వీళ్లంతా కోర్టు ధిక్కరణ చట్టంలో సెక్షన్ 2(6)ప్రకారం శిక్షార్హులని తెలిపారు. మార్చి మూడున అమరావతి కేసుల్లో తీర్పు ఇచ్చిన హైకోర్టు అమరావతి నిర్మాణ విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పేర్కొంది. ల్యాండ్ పూలింగ్ రూల్స్ ప్రకారం నిర్ధిష్ట సమయం పెట్టుకొని నిర్మాణాలు పూర్తి చేయాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది. ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం జరిగినట్టు ఎక్కడా కనిపించడం లేదని రైతులు వాపోయారు. ఇక్కడి ప్రాంత విద్యార్థులకు ఉచిత విద్య, పౌరులకు ఉచిత వైద్య సౌకర్యాలు, ఉపాధి హామీ పనులు దక్కడం లేదన్నారు రైతులు.
రాజధాని అమరావతిలో పనులు పూర్తి చేయడానికి ఐదేళ్ల టైం కావాలన్న సీఎస్ సమీర్‌శర్మ వేసిన అఫిడవిట్ తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు రైతు సాంబశివరావు. అసలు అమరావతిని అభివృద్ధి చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అందుకే కోర్టు విధించిన గడువు కంటే ఒక్కరోజు ముందు అఫిడవిట్ వేశారని గుర్తు చేశారు రైతులు. మౌలిక సదుపాయాలు కల్పించాలన్న కోర్టు తీర్పును హేళన చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
KarimnagarAssembly Election Results 2023: కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!
Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!
Trains Cancelled: విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు- ప్రత్యేక ట్రైన్స్ గడువు పొడిగింపు
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు
WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
/body>