News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Rythu Bharosa Funds: రైతులకు గుడ్‌న్యూస్! నేడు వీరి అకౌంట్లలోకి డబ్బులు - బటన్ నొక్కనున్న సీఎం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక చేయూత అందించడానికి 15 అక్టోబర్, 2019 నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది.

FOLLOW US: 
Share:

వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం 2023 - 24 కౌలు రైతులకు మొదటి విడత సాయాన్ని నేడు (ఆగస్టు 31) సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధి దారుల ఖాతాలోకి నిధులు జమ చేస్తారు.

ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా..
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక చేయూత అందించడానికి 15 అక్టోబర్, 2019 నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది.. అర్హులైన భూ యజమాని కుటుంబాలను ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించి, వారికి మొదటి విడత రూ. 7500/-  మే నెలలో (పీఎం కిసాన్ లబ్ధిరూ. 2000/- లను కలిపి), రెండో విడత రూ. 4000/- అక్టోబర్  నెలలో (పీఎం కిసాన్ లబ్ధిరూ. 2000/- లను కలిపి),
మూడో విడత రూ. 2000/- ప్రత్యేకంగా పీఎం కిసాన్ లబ్ధిని జనవరి నెలలో అందజేయడం జరుగుతుంది. అదే విధంగా రాష్ట్రంలో భూమి లేని షెడ్యూల్ తెగలు , షెడ్యూల్ కులం,  వెనకబడిన కులాలు,  మైనారిటీ వర్గాలకు  చెందిన కౌలు రైతు కుటుంబాలకు, దేవాదాయ భూములు అటవీ భూమి సాగుదారులకు  సంవత్సరానికి రూ. 13,500/- చొప్పున ఆర్థిక సహాయం 3 విడతలలో రైతుల ఖాతాలలోకి  రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. మొదటి విడత రూ. 7500/- లబ్ధిని మే నెలలో, రెండో విడత రూ. 4000/- లబ్ధిని అక్టోబర్ నెలలో, మూడో విడత రూ. 2000 లబ్ధిని జనవరి నెలలో అందజేస్తున్నారు.

2019-20  లో పథక అమలు తీరు...
మొత్తం లబ్ధిదారులు : 46,69,375
భూ యజమాని కుటుంబాలు : 45,11,252  లుగా ఉన్నాయి..
భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాస్తవ సాగుదారులు : 1,08,256
అటవీ భూమి సాగుదారులు : 49,867
లబ్ధి మొత్తం : రూ.6173 కోట్లు 
(వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి: రూ.3,648 కోట్లు + పీఎం కిసాన్ లబ్ధి: రూ.2525 కోట్లు)

2020-21 లో పెరిగిన తీరు..
మొత్తం లబ్ధిదారులు : 51,59,045
భూ యజమాని కుటుంబాలు : 50,04,874
భూమిలేని ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాస్తవ సాగుదారులు: 69,899
అటవీ భూమి సాగుదారులు : 84,272
లబ్ధి మొత్తం : రూ.6928 కోట్లు 
(వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి  : రూ.3962 కోట్లు + పీఎం కిసాన్ లబ్ధి: రూ.2966 కోట్లు)

2021-22 సంవత్సరంలో పథకం  అమలు తీరు..
మొత్తం లబ్ధిదారులు : 52,38,517
భూ యజమాని కుటుంబాలు : 50,66,241
భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాస్తవ సాగుదారులు : 89,877
అటవీ భూమి సాగుదారులు : 82,399
లబ్ధి మొత్తం : రూ.7,016.59 కోట్లు
(వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి: రూ.4051.87 కోట్లు + పీఎం కిసాన్ లబ్ధి: రూ.2964.72 కోట్లు)

2022-23 సంవత్సరంలో
మొత్తం లబ్ధిదారులు : 51,40,943
భూ యజమాని కుటుంబాలు : 49,26,041
భూమిలేని ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాస్తవ సాగుదారులు: 1,23,871
అటవీ భూమి సాగుదారులు : 91,031
లబ్ధి మొత్తం : రూ.6944.50 కోట్లు 
(వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి  : రూ.4015.94 కోట్లు + పీఎం కిసాన్ లబ్ధి: రూ.2928.56 కోట్లు)

ఈ ఏడాది 2023-24  సంవత్సరం మొదటి విడత లబ్ధి జూన్ 1న భూ యజమానులు, అటవీ భూమి సాగుదారులకు రూ.3833.21 కోట్లు విడుదల చేయడం జరిగింది. కౌలు దారులకు మొదటి విడత లబ్ధి ఆగస్టు 31న విడుదల చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. రూ.109.74 కోట్లు 14,6324 భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాస్తవ సాగుదారులకు (3631 దేవాదాయ భూమి సాగుదారులతో కలిపి)  అందించడం జరుగుతుందని,
దీనితో  2023-24 వ సంవత్సరంలో మొదటి విడత లబ్ధి  మొత్తం 52,57,263 రైతులకు రూ. 3942. 95 కోట్లు అందుతుంది.
మొత్తం లబ్ధిదారులు : 51,10,939
భూ యజమాని కుటుంబాలు  : 50,19,187
అటవీ భూమి సాగుదారులు : 91,752
లబ్ధి మొత్తం : రూ.3833.21 కోట్లు 
(వైఎస్ఆర్ రైతు భరోసా లబ్ధి: రూ.2829.37 కోట్లు + పీఎం కిసాన్ లబ్ధి: రూ.1003.84 కోట్లు)గా లెక్కలు చెబుతున్నాయి. 2019-20 నుంచి ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా మొత్తం రూ.31005.04 కోట్ల లబ్ధి రైతు కుటుంబాలకు అందించడం జరిగినదని ప్రభుత్వం ప్రకటించింది.

Published at : 30 Aug 2023 09:23 PM (IST) Tags: AP News CM Jagan News YSRCP News Farmers news ysr rythu bharosa funds aggriculture in ap

ఇవి కూడా చూడండి

Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట - ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట - ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

SSC Exams: పదోతరగతి పరీక్షల్లో 'కాంపోజిట్‌' పేపర్ కొనసాగింపు, రద్దుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

SSC Exams: పదోతరగతి పరీక్షల్లో 'కాంపోజిట్‌' పేపర్ కొనసాగింపు, రద్దుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు సీఐడీ రెడీ

రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు సీఐడీ రెడీ

IIITDMK Admissions: ఐఐఐటీడీఎం కర్నూల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఈ అర్హతలుండాలి

IIITDMK Admissions: ఐఐఐటీడీఎం కర్నూల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఈ అర్హతలుండాలి

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

టాప్ స్టోరీస్

Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ

Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం

తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం