By: ABP Desam | Updated at : 07 Dec 2022 01:05 PM (IST)
జయహో బీసీ సభలో మాట్లాడుతున్న సీఎం జగన్
వివిధ కారణాలతో వెనుకబడిన బీసీలకు చేయూత ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్టుగానే అన్ని రంగాల్లో ఉన్నత స్థానం కల్పిస్తున్నామని అన్నారు సీఎం జగన్. విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జనసముద్రంలా తన 82 వేల మందే తాము చేసిన సేవకు సాక్ష్యమన్నారు. బీసీలకు సంబంధించిన రాజకీయసాధికారతో రకరకాల పదవుల్లో సముచిత స్థానం కల్పించామన్నారు.
అందుకే బీసీ హృదయంలో జగన్... జగన్ హృదయంలో బీసీలు ఎప్పటికీ ఉంటారని అభిప్రాయపడ్డారు జగన్. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని... బ్యాక్‌బోన్ క్లాస్‌ని అన్నారు. సమాజానికి వెన్నెముక కులాలను అని చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నాం... ప్రతి అడుగు ముందుకు వేస్తున్నాం అని తెలిపారు. బీసీ అంటే శ్రమ... పరిశ్రమ... మన ఇంటికి గడప, ఇటుక, అన్నీ బీసీలే. మన తినే కంచం తయారీ బీసీ... ఇంట వెలిగిన దీపం బీసీ.. మన వస్త్రాలు తయారీ బీసీ.. ఇళ్లల్లో మంగళవాయిద్యాలు బీసీ... మన బంగారు నగల తయారీ బీసీ..శిరోజాల సంస్కారం బీసీ.. సాంస్కృతిక కళారూపాలు బీసీ.. ఇలా బీసీల కోసం మాట్లాడాలంటే... చాలా ఉందన్నారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ రాసిన కమ్మరి కొలిమి.. కుమ్మరి చక్రం అంటూ కవిత చదివారు.
ఈ దేశ చరిత్ర సాంస్కృతికి సంప్రదాయాలకు ఎంత చరిత్ర ఉందో... బీసీలకు అంతే చరిత్ర ఉందన్నారు. దేశ సంప్రదాయాలను తమ భుజాలపై మోస్తున్నారని కితాబు ఇచ్చారు. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న బీసీలు వెనుకబాటుకు చాలా కారణాలు ఉన్నాయని వెల్లడించారు. ఒకనాడు పారిశ్రామిక విప్లవంతో బీసీలు వెనుకడుగు వేశారన్నారు. ఆధునిక విద్యను బీసీలకు, ఎస్సీలు, ఎస్టీల వంటి అణగారి వర్గాలకు దూరం చేశారన్నారు. రాజకీయాల్లో కూడా న్యాయబద్దాంగా రావాల్సిన వాటా రాకపోవడంతో వెనుకబడ్డారని వివరించారు. ఇలాంటి పరిస్థితి మార్చాలనే తన పాదయాత్రలో వాళ్లను కలిసి కష్టనష్టాలు తెలుసుకొని దానికి అనుగుణంగానే అడుగులు వేస్తున్నామన్నారు.
బీసీలంటే ఇస్త్రీపెట్టెలు, కుట్టుమిషన్లు కావని చంద్రబాబుకు చెప్పండని విమర్శించారు జగన్. 2014లో బీసీలకు ఏకంగా 114 వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఉన్న విషయాన్ని బాబుకు చెప్పండన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్న జగన్‌కు వెన్నెముక కులాలుగా మారామని చెప్పండన్నారు. రాజ్యాధికారంలో భాగస్వాములు అని గర్వంగా చెప్పాలన్నారు. వ్యవసాయ రుణమాఫీని ఒక మోసంగా చేసిన విషయాన్ని గుర్తు చేయండన్నారు. ఫీజు రిఎంబర్స్‌మెంట్ ఇవ్వకుండా ఉన్న దుస్థితిని చంద్రబాబుకు గుర్తు చేయాలన్నారు. కేసీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివిస్తానని చెప్పి మాట తప్పిన సంగతి గుర్తు చేయాలన్నారు. సబ్‌ప్లాన్ ద్వారా పదివేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి బీసీలకు చేసిన ద్రోహాన్ని చంద్రబాబుకు గుర్తు చేయాలన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయామని అడిగితే అంతు చూస్తానంటూ మత్స్యకారులకు, తోకలు కత్తిరిస్తామని నాయీబ్రాహ్మణులకు చెప్పన మాటలు గుర్తు చేయమన్నారు. అయ్యా బాబు.. మాకు తోకలు లేవు కానీ.. మీ తోకలను మీకు మొలిచిన కొమ్ములను, కొమ్ముకాసే వారిని కత్తిరించే చైతన్యం ఉందని గట్టిగా చెప్పాలన్నారు.
ఏలూరు బీసీ డిక్లరేషన్ గుర్తు చేసుకోమని బీసీలను కోరారు సీఎం జగన్. అక్కడ ఇచ్చిన వాగ్దాలను మరోసారి గుర్తు చేస్తూ అమలు చేసిన కార్యక్రమాలను వివరించారు. బీసీ కులాలన్నింటికీ 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేశాం. బీసీ కమిషన్‌ను శాశ్వత ప్రాతిపదికన తీసుకొచ్చామని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం బీసీలకు, ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించామన్నారు. నామినేటెడ్ వర్క్స్‌లో యాభై శాతం కూడా వాళ్లకే ఇస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు గ్రామాల్లో పనులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే చాలా పనులు అందుతున్నాయన్నారు. షాపులు పెట్టుకొని సంప్రదాయ వృత్తులు చేసుకుంటున్న బీసీలకు చిరు వ్యాపారులకు జగనన్న తోడు, జగనన్న చేదోడు పథకాలు తీసుకొచ్చాం.... చేదోడు ద్వారా 584కోట్లు అందించామన్నారు. తోడు ద్వారా 259కోట్ల రూపాయుల ఇచ్చామని ప్రకటించారు. వీటి వల్ల 15 లక్షల కుటుంబాలు సంతోషంగా బతుకుతున్నాయన్నారు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీల కోసం ఇచ్చిన హామీ మేరకు వైఎస్‌ఆర్ చేయూత పథకం ద్వారా 14110 కోట్లు ఇచ్చామన్నారు. తిరుమల ఆలయం సన్నిధిలో గొల్లలకు తలుపులు తెరిచే అవకాశం ఇచ్చామని తెలిపారు.
Jagananna Videshi Vidya Deevena : టీడీపీ నేత కుమార్తెకు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఆర్థికసాయం
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Guntur Hospital: ఆ ఆస్పత్రిలో ఐదేళ్లుగా ఎలుకలపై యుద్ధం - కోట్లు ఖర్చయ్యాయి కానీ ఇప్పటికీ ...
AP News : సైకిల్ పై దేశవ్యాప్తంగా యాత్ర - రూ. 10 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ !
Supreme Court Amaravati Case : ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ - త్వరగా చేపట్టాలని ఏపీ న్యాయవాది విజ్ఞప్తి !
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్ వేసుకొని భర్తతో కాపురం!
Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్