అన్వేషించండి

కేంద్రం ఇవ్వని పంటలకి కూడా మద్దతు ధర ఇస్తున్నాం- పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ప్రారంభోత్సవంలో జగన్ కామెంట్స్

రైతులు తాము అమ్ముకోవాల్సిన ఉత్పత్పులను ఆర్బీకేల ద్వారా కొనుగోలు జరిగేలా చేస్తున్నామన్నారు సీఎ జగన్. కేంద్ర ప్రభుత్వం ఇవ్వని పంటలకి కూడా కనీస మద్ధతు ధర ఇస్తూ ఆర్బీకేలలో పోస్టర్లలో డిస్‌ప్లే చేశామన్నారు.

రాష్ట్రంలో 945 ప్రైమరీ ప్రాసెసింగ్‌ కలెక్షన్‌ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయించుకున్నట్టు సీఎం జగన్ చెప్పారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను వర్చువల్‌గా ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ప్రస్తుతానికి 421 ప్రైమరీ ప్రాసెసింగ్‌ కలెక్షన్‌ సెంటర్లు ప్రారంభించినట్టు తెలిపారు. "ఇవన్నీ 1912 ఆర్బీకేలకు మ్యాప్‌ చేసినట్టు పేర్కొన్నారు. తొలిదశలో 344 కోల్డ్‌ రూమ్‌ల పనులు జరుగుతున్నాయి. వీటిలో 43 కోల్డ్‌ రూమ్‌లు ప్రారంభించుకున్నాం. ఇవి కూడా దాదాపు 194 ఆర్బీకేలతో అనుసంధానమై ఉన్నాయి. ప్రతి ఆర్బీకేను కోల్డ్‌ రూమ్స్, కలెక్షన్‌ సెంటర్లకు మ్యాపింగ్‌ చేశాం. ప్రైమరీ ప్రాసెసింగ్‌లో డ్రయ్యింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు, కలెక్షన్‌ సెంటర్లు, వ్యవసాయ ఉపకరణాలు వంటి వాటిని ఆర్బీకే పరిధిలో తీసుకునిపోవాలి. గ్రేడింగ్, సెగ్రిగేషన్‌ వంటి కార్యక్రమాలు ఆ స్థాయిలో జరిగితే సెకండరీ ప్రాసెసింగ్‌ అనేది జిల్లా స్ధాయిలో జిల్లాకొకటి ఉండేటట్టుగా అడుగులు పడుతున్నాయి. అని అన్నారు. 

రైతులు తాము అమ్ముకోవాల్సిన ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారా కొనుగోలు జరిగేలా చేస్తున్నామన్నారు జగన్. కేంద్ర ప్రభుత్వం ఇవ్వని పంటలకి కూడా కనీస మద్ధతు ధర ఇస్తూ ఆర్బీకేలలో పోస్టర్లలో డిస్‌ప్లే చేశాం. ఏ పంట ధరైనా పడిపోతే ఆర్బీకే స్ధాయిలోనే జోక్యం చేసుకుని మద్ధతు ధరకు కొని రైతును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ఈ ప్రైమరీ, సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉపయోగపడతాయి. ఈ మార్పులతో రైతు పండించే పంటకు మెరుగైన రేటు వస్తుంది అని జగన్ అభిప్రాయపడ్డారు. 

శ్రీసిటీలో రూ.1600 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులకు శంకుస్ధాపన చేయడం ఆనందం కలిగిస్తోందన్నారు జగన్. మోన్‌ డ లీజ్‌ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకంతో రెండో విడతలో రూ.1500 కోట్లు పెట్టుబడి పెడుతోందన్నారు. చాక్‌లెట్, క్యాడ్‌బెర్రీ, బోర్న్‌విటా వంటివి తయారు చేస్తున్న ఈ ప్యాక్టరీ దినదినాభివృద్ది చెందాలని జగన్ ఆకాంక్షించారు. 

సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుతో ధర్మవరం ప్రాంతానికి సంబంధించిన వేరుశనగ పంటకు విలువ పెరుగుతుందని వివరించారు. మెరుగైన ధర ఇవ్వాలనే ఈ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయించాం. ధరల స్థిరీకరణనిధి ద్వారా ఏటా రూ.3వేల కోట్లు కేటాయించి నాలుగేళ్లలో దాదాపుగా రూ.8వేలకోట్లతో పంట కొనుగోలకు ఖర్చు చేశాం. మార్కెట్‌లో మద్ధతు ధర లేనప్పుడు రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేస్తున్నాం. మద్ధతు ధరలు కల్పిస్తున్నాం. ఆర్బీకేలో డిస్‌ప్లే చేసిన రేటు కన్నా తక్కువ వస్తే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని జగన్ తెలిపారు.  
రూ.75 కోట్లతో ధర్మవరంలో ఏర్పాటు చేస్తున్న వేరుశనగ ప్రాసెసింగ్‌ యూనిట్‌ జిల్లా రైతులకు ఉపయోగపడుతుంది. 55,620 మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో ఈ యూనిట్‌ 15 వేల మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. మరో 9 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తయితే చిక్కీ, ఆయిల్, పీనట్‌ బట్టర్‌ వంటి ఉపఉత్పత్తులు తయారై పంటకు మార్కెటింగ్‌ పెరుగుతుంది. 

నాలుగు ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్లును చిత్తూరులో జిల్లాలో 3, అన్నమయ్యజిల్లాలో ఒకటి ప్రారంభిస్తున్నామన్నారు జగన్. దాదాపు 14,400 మెట్రిక్‌ టన్నులకు సంబంధించి పండ్లు, కూరగాయల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రారంభిస్తున్నాం. దీనివల్ల మార్కెటింగ్‌ సౌకర్యం పెరుగి రైతులకు మంచి ధరలు లభిస్తాయి. 2414 మంది రైతులకు మంచి జరుగుతుంది. 

సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 3,588 మంది రైతులుకు మేలు చేస్తూ.. దాదాపు 10,800 టన్నుల టమాటా ప్రాసెసింగ్‌ చేసే యూనిట్లకు శంకుస్ధాపన చేసుకున్నాం. మరో నాలుగు నెలల్లో వీటిని ప్రారంభించుకోబోతున్నాం. వీటికి అదనంగా 250 మెట్రిక్‌ టన్నుల కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటుతో మార్కెట్‌లో రైతుల ఇబ్బందులు తీరుతాయి. మార్కెట్‌లో ధరలు పడిపోయినా అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా పోతుంది. మంచి ధరలకు అమ్ముకునే అవకాశం కలుగుతుంది. 

మిల్లెట్స్‌లో దాదాపు 13 సెకెండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 32పైగా ప్రైమరీ ప్రాసెసింగ్‌ మిల్లెట్‌ యూనిట్లు అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలో ఎక్కడా జరగని విధంగా మిల్లెట్స్‌కు ఎంఎస్‌పీ అందించింది కూడా మన రాష్ట్రంలోనే. ఇప్పుడు 7,200 మెట్రిక్‌ టన్నుల కెపాసిటీతో సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ రావడం విజయనగరం రైతులకు మంచి జరుగుతుంది. 

కర్నూలులో ఆనియన్‌ డీహైడ్రేషన్‌ కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద వంద చోట్ల చేస్తున్నామన్నారు జగన్. రూ.1 లక్ష పెట్టుబడితో ప్రతిఒక్కరికీ దాదాపు రూ.12వేల ఆదాయాన్నిచ్చే కార్యక్రమమిది. రానున్న రోజుల్లో ఈ యూనిట్లను మరింత విస్తరిస్తూ ఐదువేల వరకు పెంచుతాం.

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget