Chandrababu In Guntur: నేటి నుంచి 3 రోజులపాటు చంద్రబాబు గుం'టూరు' - జిల్లాలో మొదలైన టీడీపీ, వైసీపీ ఫ్లెక్సీ వార్!
గుంటూరు జిల్లాలో ఉద్రిక్తతల మధ్య నేటి నుంచి ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన జరగనుంది. అటు పార్టీలో విభేదాలు, ఇటు అధికార పక్షం ఎదురుదాడికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
గుంటూరు జిల్లాలో ఉద్రిక్తతల మధ్య నేటి నుంచి ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన జరగనుంది. అటు పార్టీలో విభేదాలు, ఇటు అధికార పక్షం ఎదురుదాడికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
చంద్రబాబు టూర్...
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంగళవారం నుంచి మూడు రోజులు పాటు ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబు నిర్వహించనున్నారు. నేటి నుంచి ప్రారంభమయ్యే చంద్రబాబు పర్యటన మొదటి రోజు పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రారంభం కానుంది. నేడు సాయంత్రం అమరావతిలో రోడ్ షో నిర్వహించి పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తారు.. వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మీటింగ్ లో ప్రస్తావించనున్నారు చంద్రబాబు.
టీడీపీ అధినేత పర్యటన సందర్భంగా అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు పర్యటనకు సంబంధించి చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఆ ఫ్లెక్సీలు ఎదురుగానే చంద్రబాబు నాయుడు పర్యటనను వ్యతిరేకిస్తూ వైకాపా కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ ఆయన పర్యటన అడ్డుకుంటామంటూ పోస్టర్లు వేశారు. ఈ పోటాపోటీ ప్లెక్సీలు ఏర్పాటుతో నియోజకవర్గాలలో పరిస్థితులు హీట్ పుట్టిస్తున్నాయి. ఫ్లెక్సీల ఏర్పాటుతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి అమరావతి ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
వైసీపీ ఆందోళనలు..
ఓ వైపు వైసీపీ శ్రేణులు మరోవైపు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు పర్యటన సజావుగా సాగుతోందా లేదా అన్న సందిగ్ధత అయితే నెలకొంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పోలీసులను కలసి చంద్రబాబు పర్యటన సజావుగా సాగేవిధంగా ఏర్పట్లు చేయాలని కోరారు. ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమాన్ని పెదకూరపాడు నియోజకవర్గం లో ప్రారంభమౌతుంది. 26 వ తేదిన సత్తెనపల్లిలో, 27న తాడికొండలో జరుగుతుంది.. ఈ పర్యటనలో చంద్రబాబు మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఇంచార్జ్ లను ప్రకటిస్తారని సమాచారం.
కోడెల శివరాం హాట్ కామెంట్స్..
చంద్రబాబు పర్యటన సందర్భంగా పార్టీలో విభేదాలు కూడా చర్చగా మారాయి. కోడెలని పట్టించుకోవటం లేదని, ఆయన వారసుడు కోడెల శివరాం ఆవేదన వెలిబుచ్చారు.. సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్ లో ఎన్టీఆర్, కోడెల విగ్రహాలకు పూల మాలవేసి నివాళులు అర్పించిన టీడీపీ నేత కోడెల శివరామ్.. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చిన నాయకుడు కోడెల అన్నారు. ప్రతి ఒక్కరికి మార్గదర్శి కోడెల శివప్రసాదరావు అని అభివర్ణించారు. సత్తెనపల్లి ని మోడల్ నియోజకవర్గంగా చేసిన కోడెల అని తెలిపారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశం పై శివరామ్ అసంతృప్తి వెలిబుచ్చారు.
వైసీపీ మొదటి గా టార్గెట్ చేసింది కోడెలనేనని, పార్టీ కోసం పాటుపాడిన వ్యక్తి కోడెలకు నివాళులు అర్పించాటానికి రాజకీయం చేస్తున్నారని అన్నారు. దీని వెనుక ఎవరువున్నారనేది అర్థం కావటం లేదన్నారు. కోడెల పేరు వినపడకుండా కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు
టీడీపీ కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన కోడెల, చంద్రబాబు మాకు అండగా ఉన్నారని, కన్నా లక్ష్మీ నారాయణ తో నాకు వ్యక్తిగత పరిచయాలు లేవన్నారు. కోడెల కి అవమానం జరిగిప్పుడు కన్నా స్పందిస్తే సంతోషం గా ఉండేదని చెప్పారు. మాపై అక్రమ కేసులు పెట్టారని,
కోడెల పేరు తలుచుకోపోవటం బాధాకరమన్నారు. కోడెల బాటలో నడుస్తామని, అభిమానలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.