అన్వేషించండి

Amaravati: అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!

Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి కేంద్రం మద్దతు ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమరావతి అభివృద్ధిపై చంద్రబాబు ఎన్డీఏ భాగస్వాములతో చర్చించారు.
  • రాష్ట్రవ్యాప్తంగా ఇంటి ముందు దీపాలు వెలిగించాలని సీఎం పిలుపునిచ్చారు.
  • రైతులకు, అమరావతికి మద్దతుగా దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
  • గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుందని చంద్రబాబు విమర్శించారు.

Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాజధాని అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న మద్దతు, గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించడం వంటి అంశాలపై చర్చించారు.  ఈ సందర్భంగా ఆయన ఒక ప్రత్యేక పిలుపునిచ్చారు. "అమరావతికి మద్దతుగా ఈ రోజు సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు దీపాలు వెలిగించాలి" అని సూచించారు. ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, రాజధాని పట్ల ప్రజల నిబద్ధతను, కేంద్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతను తెలియజేసి ఒక సంకేతమని ఆయన పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మధ్యాహ్నం ఆయన ఉద్దండరాయునిపాలెం వెళ్లనున్నారు. ఈ  ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. సరిగ్గా 2015లో ఇదే ప్రాంతంలో  అమరావతి రాజధాని నగరానికి అత్యంత వైభవంగా శంకుస్థాపన జరిగింది. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ అదే స్పూర్తిని నింపేందుకు సీఎం అక్కడ పర్యటించనున్నారు. అదే విధంగా సాయంత్రం వేళల్లో రాష్ట్రవ్యాప్త దీపోత్సవం జరగనుంది.

అమరావతి అంశం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గత ఐదేళ్లుగా ఒక పెద్ద వివాదంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం' మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకురావడంతో అమరావతి నిర్మాణం పూర్తిగా స్తంభించిపోయింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత, అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు చట్టసవరణ కూడా చేసి అమరావతి ఏకైక రాజధాని అని పార్లమెంట్‌లో చట్టం తీసుకొచ్చారు. 

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అమరావతికి, భూములు ఇచ్చిన రైతులకు అండగా నిలబడి మద్ధతు ప్రకటించింది. అందుకే కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల్లో రాజధాని పట్ల నమ్మకాన్ని పెంచడానికి ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 

ఈ దీపోత్సవం కేవలం రాజధాని ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని 26జిల్లాల్లోని ప్రతి గ్రామంలోనూ నిర్వహించాలని ఎన్డీఏ నేతలు నిర్ణయించారు. ఇందులో  పార్టీ కార్యకర్తలు, ప్రజలు భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఉద్దండరాయునిపాలెం పర్యటనలో ఆయన అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి, నిర్మాణ పనులు ఎప్పటి నుంచి వేగవంతం చేయాలో అధికారులకు సూచనలు చేయనున్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు తిరస్కరించినప్పటికీ జగన్ తీరులో మార్పు రాలేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాజెక్టును నాశనం చేశారని అన్నారు. ఆ గాయాలు మాన్సే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఇతర ప్రాంతాల్లో చిచ్చు పెట్టేందుకు అర్థంపర్థం లేని ప్రతిపాదనలు తీసుకొస్తున్నారని అన్నారు. 

అమరావతి పేరు పలకడానికి జగన్‌కు ఇష్టం లేదని చంద్రబాబు విమర్శించారు. అందుకే కొత్త కొత్త వింతైన పేర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి ఏర్పాటుతో ఏ ప్రాంతానికి అన్యాయం జరగదని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే విశాఖలో ప్రపంచస్థాయి సంస్థలు తీసుకొస్తున్నామని వివరించారు. రాయలసీమలో కూడా పరిశ్రమలు తెచ్చామన్నారు. కర్నూలులో విలైనంత త్వరగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. 

Frequently Asked Questions

అమరావతి దీపోత్సవం ఎందుకు నిర్వహిస్తున్నారు?

అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల్లో రాజధాని పట్ల నమ్మకాన్ని పెంచడానికి ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

దీపోత్సవం ఎప్పుడు, ఎక్కడ జరగనుంది?

ఈ రోజు సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు దీపాలు వెలిగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఉద్దండరాయునిపాలెం లో కూడా ప్రత్యేక కార్యక్రమం జరగనుంది.

గతంలో అమరావతి అభివృద్ధి ఎలా ఉంది?

గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడంతో అమరావతి నిర్మాణం నిలిచిపోయింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చట్టం చేసింది.

ముఖ్యమంత్రి ఉద్దండరాయునిపాలెం ఎందుకు వెళ్తున్నారు?

2015లో అమరావతి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. అక్కడి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి, నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు.

దీపోత్సవంలో ఎవరు పాల్గొనాలి?

ఈ దీపోత్సవం రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని ప్రతి గ్రామంలోనూ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget