Andhra Pradesh New Rations Cards: ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి రైస్ ఏటీఎంలు- అందుబాటులోకి కొత్త రేషన్ కార్డులు!
Andhra Pradesh Ration Card: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు కొత్తవి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈలోపు పాతవాటిని ప్రక్షాళన చేయనుంది. సాంకేతికతతో అనుసంధానించనుంది.
AP Ration Card: సాంకేతికతను మరింతగా వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రైస్ ఏటీఎంలు ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు అవుతున్న రైస్ ఏటీఎంల విధానం ఇక్కడకూడా అమలు చేయాలని చూస్తోంది.
రైస్ ఏటీఎంలు ఏర్పాటు ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్ తీసుకునే వీలు కలుగుతుంది. అంతే కాకుండా రేషన్ దుకాణాల్లో క్యూలైన్లు లేకుండా కూడా చూడొచ్చు. ముఖ్యంగా సమయం ఆదా అవుతుంది. పనికి వెళ్లే వాళ్లు తమ పనులు మానుకొని రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా అక్రమాలకు చెక్ పెట్టే వీలు ఉంటుంది.
ఈ రైస్ ఏటీఎంలకు అనుగుణంగా ఉండేలా రేషన్ కార్డులు డిజైన్ చేస్తున్నారు. గతంలో జగన్ చిత్రాలతో రేషన్ కార్డులు గత ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. ఇందులో సాంకేతికత యాడ్ చేయనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం వెల్లడించనుంది.
రేషన్ కార్డు అప్డేట్ అవుతోంది (Ration Card Update In Andhra Pradesh)
ఇప్పుడు వచ్చే కార్డుల్లో క్యూఆర్ కోడ్‌తో పాటు ఆ ఫ్యామిలీ మెంబర్స్ చిత్రాలు ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు రైస్ ఎంటీఎంలు ఏర్పాటు చేస్తున్నందున వాటిలో కూడా ఉపయోగపడేలా కార్డులు డిజైన్ చేస్తున్నారు.
ఇప్పుడు ఉన్న కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వడమే కాకుండా అవసరమైన వారికి కూడా కార్డులు జారీ చేస్తారు. ఇప్పటి వరకు ఆరు నెలకోసారి కార్డులు ఇచ్చే పద్దతి ఉండేది. సాంకేతికత అప్‌డేట్ అయినందుకున పెళ్లైన జంటలకు, లేదా తల్లిదండ్రుల నుంచి వేరు పడి కార్డు కావాల్సిన వారికి రోజుల వ్యవధిలోనే కార్డులు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డ్(Ration Card Details In Andhra Pradesh) విషయంలో తరచూ వచ్చే సందేహాలు ఇవే (FAQs)
ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డ్ కోసం హెల్ప్‌లైన్ నంబర్ ఉందా?
ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డ్‌పై సందేహాలు, ఫిర్యాదులు, ఫీడ్‌బ్యాక్ కోసం 040-23494808కి కాల్ చేయవచ్చు. pds-ap@nic.inకి ఇమెయిల్ పంపవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు ఏమిటి?
మీ గుర్తింపు, చిరునామా, ఆదాయానికి సంబంధించిన పత్రాలు అవసరం.
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుకు అర్హత ఏమిటి?(Ration Card Eligibility In Andhra Pradesh)
దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఈ కింది విధంగా ఆదాయం ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000, అర్బన్‌లో నెలకు 12,000కు మించి సంపాదించే వాళ్లు రేషన్ కార్డుకు అర్హులు కారు.
ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డ్ అప్లైచేసిన తర్వాత స్టాటస్ ఎక్కడ చూసుకోవాలి.?(Ration Card Status In Andhra Pradesh)
మీ ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత స్టేటస్ తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://www.spandana.ap.gov.in ని సందర్శించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత వచ్చేందుకు ఎంత టైం పడుతుంది?
ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన తర్వాత దాన్ని పొందేందుకు 15 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టదు.
ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు దరఖాస్తు రుసుము ఏదైనా ఉందా?
లేదు, ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు మీరు ఎటువంటి దరఖాస్తు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులో సభ్యుల పేర్లను జోడించవచ్చా లేదా తొలగించవచ్చా?(How To Remove Name From Ration Card Online In Andhra Pradesh)
అవును, ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు జోడించవచ్చు లేదా తొలగించవచ్చు. మీరు దీన్ని వ్యక్తిగతంగా లేదా ఆన్‌లైన్‌లో చేయవచ్చు.
బియ్యం కార్డు, ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు ఒకటేనా?
లేదు, అవి ఒకేలా ఉండవు. ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుల స్థానంలో బియ్యం కార్డులు వస్తున్నాయి.
నా రేషన్ కార్డుకు నా ఆధార్‌ను లింక్ చేయవచ్చా?(Ration Card Link With Aadhar)
అవును, మీరు మీ రేషన్ కార్డుకు మీ ఆధార్‌ను లింక్ చేయవచ్చు.
పెళ్లయిన జంటలు ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయవచ్చా? (AP Ration Card Apply Online)
అవును, భార్యాభర్తలలో ఒకరు రాష్ట్ర నివాసంగా ఉంటే వివాహిత జంటలు దరఖాస్తు చేసుకోవచ్చు.