అన్వేషించండి

Ambati Rambabus Office Attack: అంబటి రాంబాబు ఇంటిపై దాడి.. టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవిపై కేసు నమోదు

Attack on Ambati Rambabu House: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి సహా 31 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Ambati Rambabu | గుంటూరు: ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు కార్యాలయం, నివాసంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు ఈ ఘటనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం అధికార కూటమి వర్సెస్ ప్రతిపక్ష వైసీపీ నేతలుగా వివాదం ముదురుతోంది.

ఏ1గా ఎమ్మెల్యే గళ్లా మాధవి.. నిందితుల జాబితాలో 31 మంది
ఈ కేసులో పోలీసులు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవిని ప్రధాన నిందితురాలిగా (A1) చేర్చారు. అలాగే ఆమె భర్త గళ్లా రామచంద్రరావును ఏ2 కాగా, మొత్తం 31 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అల్లర్లు సృష్టించడం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, అక్రమంగా చొరబాటు వంటి అభియోగాలను వీరిపై మోపారు. దాడి జరిగిన సమయంలో అంబటి రాంబాబు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే.

రాజకీయ ఉద్రిక్తత, పోలీసుల విచారణ
అంబటి రాంబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు మొదటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. తరువాత ఈ దాడికి పాల్పడ్డారు. అంబటి రాంబాబు కార్యాలయం ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు అక్కడ ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను చింపివేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తుండగా, తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన గుంటూరులో రాజకీయాలను వేడెక్కిస్తోంది. 

అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు గుంటూరు జీజీహెచ్‌లో అంబటికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన కేసులో స్టేషన్ బెయిల్ లభించినప్పటికీ, సీఎంపై దూషణల కేసులో కోర్టు రిమాండ్‌కు ఆదేశించింది.

పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన బయట ఉంటే శాంతిభద్రతల సమస్య తలెత్తడమే కాకుండా, ఆయన ప్రాణాలకు కూడా ముప్పు ఉందన్న పోలీసుల వాదనతో కోర్టు ఏకీభవించింది. సీఎంపై అసభ్య పదజాలం వాడారని, రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచేలా ఆయన తీరు ఉందని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఆరోరోపణలు రుజువైతే ఏడేళ్లపైగా శిక్ష పడే అవకాశం ఉండటంతో, తదుపరి విచారణ కోసం అంబటి రాంబాబును తమ కస్టడీకి ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోరారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Kesineni Chinni daughter Issue: ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!
ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget