అన్వేషించండి

Janasena Latest News: పవన్ శాఖపైనే న్యాయపోరాటం చేస్తున్న జనసేన నేత బొలిశెట్టి- పార్టీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన

Janasena Latest News: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించే పర్యావరణ శాఖపై న్యాయపోరాటం చేస్తున్న జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. నైతికంగా ఇబ్బంది ఉంటుందని లేఖ రాశారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ పదవులకు స్వచ్ఛంద విరామం ప్రకటించారు.
  • పర్యావరణ పరిరక్షణ మంత్రి పవన్ కల్యాణ్ శాఖపైనే ఆయన పోరాడుతున్నారు.
  • ప్రభుత్వంపై కేసు వేసిన వ్యక్తిగా అధికార కూటమిలో ఉండటం ఇబ్బందికరమని భావించారు.
  • న్యాయ పోరాటం నీరుగారకుండా, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పదవుల నుంచి తప్పుకున్నారు.

Janasena Latest News: జనసేన పార్టీలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. పర్యావరణ పరిరక్షణ మంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్‌ శాఖపైనే పోరాడుతున్నారు జనసేనకు చెందిన కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి, పవన్ కల్యాణ్‌కు చెడ్డ పేరు రాకూడదని ఆయన పార్టీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇదే ఇప్పుడు కూటమిలో ముఖ్యంగా జనసేనలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న అంశం. 

జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ తన పార్టీ పదవులకు స్వచ్ఛందంగా విరామం ప్రకటించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాకుండా తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం పదవుల నుంచి తప్పుకోవడం రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. పదవులకు తాత్కాలిక విరామం తీసుకుంటున్న పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.  

Image

బొలిశెట్టి సత్యనారాయణ చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలో పెరిగి పోతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా 2020లో నాటి ప్రభుత్వంపై కోర్టులో కేసు వేశారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జనసేన తరఫున ఆయన చేసిన ఈ పోరాటాన్ని నాడు పార్టీ కూడా ప్రోత్సహించింది. అయితే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇందులో జనసేన పార్టీ అత్యంత కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. 

బొలిశెట్టి సత్యనారాయణ తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించిన అంశం కాన్‌ఫ్లిక్‌ట్ ఆఫ్‌ ఇంట్రెస్ట్. ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అంతేకాకుండా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వయంగా రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. తాను గతంలో వేసిన కాలుష్యం వ్యతిరేక కేసు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన గుర్తించారు. 

Image

ప్రభుత్వంపై కేసు వేసిన వ్యక్తిగా అదే అధికార కూటమిలో కీలక పదవిలో ఉండటం వల్ల న్యాయపోరాటం నీరుగారిపోయే ప్రమాదం ఉందని లేదా రాజకీయ కారణాల వల్ల ఆ పోరాటం ప్రభావితం కాకూడదని ఆయన భావించారు. అందుకే స్వచ్ఛమైన నీరు, గాలి కోసం తాను చేస్తున్న పోరాటంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు తావు లేకుండా ఉండేందుకు పదవుల నుంచి తప్పుకుంటున్నట్టు స్పష్టం చేశారు. 

ఈ నిర్ణయం వల్ల జనసేన పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే బొలిశెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంపై కేసు వేసిన వ్యక్తిగా అధికార కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవడం తన బాధ్యతని ఆయన పవన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. పదవుల నుంచి తాత్కాలికంగా తప్పుకున్నా, సామాజిక సేవలో వెనుకడుగు వేయబోనని బొలిశెట్టి స్పష్టం చేశారు. ఇకపై తన పూర్తి సమయాన్ని పర్యావరణ పరిరక్షణకు కేటాయించనున్నట్టు వెల్లడించారు. 

ఇప్పుడు తాను తీసుకున్న నిర్ణయం జనసేన పార్టీకి దూరం కావడానికి కాదని ఆయన స్పష్టత ఇచ్చారు. ఇది కేవలం పార్టీ పదవుల నుంచి తీసుకున్న తాత్కాలిక విరామం మాత్రమేనని రాజీనామా కాదని ఆయన వివరించారు. జనసేన సిద్ధాంతాలకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని, పర్యావరణపరంగా తాను కోరుకుంటున్న న్యాయపరమైన పరిష్కారం లభించిన తర్వాత పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే మళ్లీ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని లేఖలో తెలిపారు. 

Frequently Asked Questions

జనసేన కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ తన పదవుల నుంచి ఎందుకు తప్పుకున్నారు?

తన పర్యావరణ పోరాటం ప్రస్తుత అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉన్నందున, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నివారించడానికి బొలిశెట్టి సత్యనారాయణ తన పార్టీ పదవుల నుంచి తప్పుకున్నారు.

బొలిశెట్టి సత్యనారాయణ ఎప్పటినుంచో ఏ సమస్యపై పోరాడుతున్నారు?

బొలిశెట్టి సత్యనారాయణ చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ సమస్యలపై, ముఖ్యంగా పెరుగుతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

బొలిశెట్టి సత్యనారాయణ నిర్ణయం జనసేన పార్టీకి సంబంధించినదా?

కాదు, ఇది పార్టీ పదవుల నుంచి తీసుకున్న తాత్కాలిక విరామం మాత్రమే, రాజీనామా కాదు. ఆయన జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని, న్యాయపరమైన పరిష్కారం లభించిన తర్వాత తిరిగి బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

బొలిశెట్టి సత్యనారాయణ తన నిర్ణయం గురించి పవన్ కళ్యాణ్‌కు ఏమి తెలిపారు?

తన పోరాటం ప్రభుత్వంపై ప్రభావం చూపకుండా, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఉండేందుకే పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన పవన్ కళ్యాణ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
AP DWCRA: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Perni Nani Avigan: అవిగన్ రాజకీయం - వైఎస్‌ఆర్‌సీపీ మావిగన్‌పై మళ్లీ రూటు మార్చిందా?
అవిగన్ రాజకీయం - వైఎస్‌ఆర్‌సీపీ మావిగన్‌పై మళ్లీ రూటు మార్చిందా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget